తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 17 Winner Prize Money: బిగ్ బాస్ 17 విజేత అతడే.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

Bigg Boss 17 Winner Prize Money: బిగ్ బాస్ 17 విజేత అతడే.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

Hari Prasad S HT Telugu

29 January 2024, 9:34 IST

    • Bigg Boss 17 Winner Prize Money: బిగ్ బాస్ 17 ఆదివారం (జనవరి 28)తో ముగిసింది. ఈసారి విజేతగా కమెడియన్ మునావర్ ఫరూఖీ నిలిచాడు. అంకితా లోఖాండేలాంటి వాళ్లను అతడు వెనక్కి నెట్టి భారీ ప్రైజ్ మనీని కూడా సొంతం చేసుకున్నాడు.
బిగ్ బాస్ 17 విజేత మునావర్ ఫరూఖీ
బిగ్ బాస్ 17 విజేత మునావర్ ఫరూఖీ

బిగ్ బాస్ 17 విజేత మునావర్ ఫరూఖీ

Bigg Boss 17 Winner Prize Money: బిగ్ బాస్ 17 సీజన్ ముగిసింది. ఆదివారం (జనవరి 28) జరిగిన గ్రాండ్ ఫినాలేలో విజేతను అనౌన్స్ చేశారు. ఈసారి కమెడియన్, ర్యాపర్ అయిన మునావర్ ఫరూఖీ టైటిల్ గెలుచుకున్నాడు. అభిషేక్ కుమార్ తో పోటీ పడిన మునావర్.. చివరికి తానే విజేతగా నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

Mahesh Babu - Ram Charan: ఓటేసిన మహేశ్ బాబు, రామ్‍చరణ్.. స్టైలిష్ లుక్‍లో స్టార్ హీరోలు

Bollywood: వాటి గురించి సుశాంత్ సింగ్ చాలా బాధపడేవారు: మనోజ్ బాజ్‍పేయ్

Pavithra Jayaram: టీవీ సీరియల్ నటి మృతి.. తిరిగి రావా అంటూ భర్త చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్

Kannappa Teaser Date: కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్‍కు డేట్ ఖరారు.. ప్రతిష్టాత్మక వేదికపై..

బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ విజేతను అనౌన్స్ చేశాడు. అయితే విన్నర్స్ రేసులో ఉన్నట్లు కనిపించిన అంకితా లోఖాండే ఎలిమినేట్ కావడం అందరినీ షాక్ కు గురి చేసింది.

బిగ్ బాస్ 17 విన్నర్ ప్రైజ్ మనీ ఇదీ

బిగ్ బాస్ 17 విజేతగా నిలిచిన మునావర్ ఫరూఖీకి ఏకంగా రూ.50 లక్షల ప్రైజ్ మనీ, ఓ లగ్జరీ కారు దక్కడం విశేషం. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ గ్రాండ్ ఫినాలే మొదలైంది. ఐదుగురు ఫైనలిస్టుల నుంచి చివరికి ఇద్దరు మిగిలారు. అభిషేక్ కుమార్, మునావర్ ఫరూఖీలలో ఎవరు విజేత కానున్నారన్న సస్పెన్స్ కు తెరదించుతూ హోస్ట్ సల్మాన్ ఖాన్ విన్నర్ పేరును అనౌన్స్ చేశాడు.

ఈ సీజన్ మొత్తం టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా నిలిచిన మునావర్.. చివరికి అనుకున్నది సాధించాడు. టాప్ 5 ఫైనలిస్టులలో మొదట హైదరాబాద్ కు చెందిన అరుణ్ మాషెట్టి ఎలిమినేట్ అయ్యాడు. ఆ వెంటనే టైటిల్ ఫేవరెట్లలో ఒకరైన అంకితా లోఖాండే ఎలిమినేట్ కావడం షాక్ కు గురి చేసింది. హోస్ట్ సల్మాన్ ఖాన్ కూడా ఆమె ఎలిమినేట్ కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఇక టాప్ 3లో మన తెలుగు వారికి పరిచయం ఉన్న మన్నారా చోప్రా కూడా ఉంది. నిజానికి టైటిల్ ఫేవరెట్స్ లో ఆమె కూడా ఒకరు. కానీ ఆమె కూడా టాప్ 3 నుంచే తప్పుకుంది. చివరికి అభిషేక్, మునావర్ మాత్రమే మిగలగా.. మునావర్ టైటిల్ దక్కించుకున్నాడు. అతనికి ఏకంగా రూ.50 లక్షల ప్రైజ్ మనీ, ఓ కారు దక్కాయి.

గతేడాది అక్టోబర్ 15న బిగ్ బాస్ 17 ప్రారంభమైంది. 107 రోజుల పాటు ప్రేక్షకులను అలరించింది. మొత్తం 21 మంది హౌజ్‌మేట్స్ తో షో ప్రారంభమైంది. చివరికి ఐదుగురు ఫైనలిస్టులు మాత్రమే గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. వాళ్లలో చివరికి మునావర్ టైటిల్ దక్కించుకున్నాడు.

బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే?

ఇక గతేడాది డిసెంబర్ లో బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో రైతుబిడ్డగా పేరుగాంచిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అతనికి కూడా రూ.35 లక్షల ప్రైజ్ మనీతోపాటు రూ.15 లక్షల విలువైన డైమండ నగలు, ఓ కారు దక్కడం విశేషం. బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో అమర్‌దీప్ రన్నరప్ గా నిలిచాడు. గతేడాది డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలే జరిగింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం