తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 17 Winner: హౌస్‌లో రోజూ ఏడ్చేవాడిని.. మానసికంగా కుంగిపోయాను: బిగ్ బాస్ విన్నర్ షాకింగ్ కామెంట్స్

Bigg Boss 17 Winner: హౌస్‌లో రోజూ ఏడ్చేవాడిని.. మానసికంగా కుంగిపోయాను: బిగ్ బాస్ విన్నర్ షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

30 January 2024, 8:01 IST

    • Bigg Boss 17 Winner: బిగ్ బాస్ 17 విన్నర్ మునావర్ ఫరూఖీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. హౌజ్ లో తాను రోజూ ఏడ్చేవాడినని, ఈ విజయం కోసం తాను మానసికంగా ఎంతో కుంగిపోయానని అతడు అనడం గమనార్హం.
బిగ్ బాస్ 17 విజేత మునావర్ ఫరూఖీ
బిగ్ బాస్ 17 విజేత మునావర్ ఫరూఖీ

బిగ్ బాస్ 17 విజేత మునావర్ ఫరూఖీ

Bigg Boss 17 Winner: బిగ్ బాస్ 17 విజేత అయిన మునావర్ ఫరూఖీ ఈ రియాల్టీ షో గెలిచినందుకు రూ.50 లక్షలు గెలుచుకున్నాడు. ఓ కారు కూడా వచ్చింది. బయట ఎంతో పేరుప్రతిష్టలు వస్తాయి. కానీ వీటి కోసం తాను భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చిందని అతడు అనడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

Jai Ganesh OTT: ఓటీటీలోకి భాగ‌మ‌తి హీరో మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులో స్ట్రీమింగ్‌

Game Changer Release Date:రామ్ కోసం భీమ్ త్యాగం...దేవ‌ర డేట్‌కు థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న గేమ్‌ఛేంజ‌ర్‌

Pawan Kalyan Vote: హెలికాప్టర్‌లో వచ్చి ఓటేసిన పవన్ కల్యాణ్ దంపతులు.. ఫొటోలు, వీడియోలు వైరల్

Allu Arjun Vote: అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడా? నంద్యాలో వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్దతుపై ఇదీ అతని సమాధానం

ఆదివారం (జనవరి 28) జరిగిన గ్రాండ్ ఫినాలేలో అభిషేక్ కుమార్ ను ఓడించి టైటిల్ గెలిచిన మునావర్.. మరుసటి రోజే షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను హౌస్ లో రోజూ ఏడ్చేవాడినని అతడు చెప్పాడు.

భారీ మూల్యం చెల్లించాను కానీ..

బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన తర్వాత మునావర్ ఫరూఖీ.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తో మాట్లాడాడు. "ఇది నమ్మశక్యం కాని ఫీలింగ్. నా ప్రయాణం అలాంటిది. ఆ సమయంలో ఆ ట్రోఫీ బరువు కూడా నాకు తెలిసింది. ఈ ట్రోఫీ కోసం నేను భారీ మూల్యమే చెల్లించాను. కానీ అందుకు తగిన ఫలితం కూడా పొందాను. చివరికి ట్రోఫీతోపాటు ఎన్నో విషయాలను కూడా నేను ఇంటికి తీసుకెళ్తున్నాను" అని మునావర్ అన్నాడు.

షోలో తన వ్యక్తిగత విషయాలను కూడా లాగడంపై అతడు స్పందించాడు. "షోలో నా వ్యక్తిగత జీవితం గురించి ఈ స్థాయిలో లాగడం నాకు నచ్చలేదు. కానీ అవి నా నియంత్రణలో లేని విషయాలు. అలాంటి పరిస్థితి ఎదుర్కోకూడదని అనుకున్నాను. కానీ నాకు వేరే దారి లేదు. నేను చేసినదానికి నాకు గర్వంగా ఏమీ లేదు. వాటిని మరచిపోయి పరిస్థితులన మెరుగుపరచుకోవాలి" అని మునావర్ చెప్పాడు.

రోజూ ఏడ్చేవాడిని..

బిగ్ బాస్ హౌస్ లో తాను రోజూ ఏడ్చేవాడినని కూడా మునావర్ చెప్పడం గమనార్హం. "మానసికంగా నేను చాలా కుంగిపోయాను. హౌస్ లో రోజూ బాత్రూమ్ లేదా పడుకున్న తర్వాత దుప్పట్లో దూరి ఏడవని రోజు లేదు. నేను నిస్సహాయంగా ఫీలయ్యాను. మానసికంగా కూడా అది ప్రభావం చూపింది. కానీ వాటిని ఎదుర్కోవాల్సిందే అని అనుకున్నాను" అని మునావర్ తెలిపాడు.

బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితులను మెరుగుపరచుకోవడంపై తాను దృష్టి సారిస్తానని, ఎవరినీ బాధ పెట్టకూడదని అనుకుంటున్నట్లు చెప్పాడు. బిగ్ బాస్ 17 సీజన్ గతేడాది అక్టోబర్ లో ప్రారంభమై జనవరి 28న ముగిసింది. 107 రోజుల పాటు ఈ కొత్త సీజన్ సాగింది. ఈ సీజన్ లో బాలీవుడ్ అంకితా లోఖాండే కూడా ఓ కంటెస్టెంట్ గా ఉంది.

ఐదుగురు ఫైనలిస్టుల్లో ఆమె కూడా ఉంది. టైటిల్ గెలుస్తుందని కూడా చాలా మంది భావించారు. కానీ అంకితా ఫైనల్ 4 వరకూ మాత్రమే రాగలిగింది. చివరికి మునావర్ ఫరూఖీ విజేతగా నిలవగా.. అభిషేక్ కుమార్ రన్నరప్ గా నిలిచాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన మునావర్ రూ.50 లక్షల ప్రైజ్ మనీ, ఓ కారు, ట్రోఫీ అందుకున్నాడు. హోస్ట్ సల్మాన్ ఖాన్ అతనికి వీటిని అందజేశాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం