తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mannara Chopra: హిందీ బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన‌ టాలీవుడ్ హీరోయిన్ - డైరెక్ట‌ర్‌తో ముద్దుపై క్లారిటీ

Mannara Chopra: హిందీ బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన‌ టాలీవుడ్ హీరోయిన్ - డైరెక్ట‌ర్‌తో ముద్దుపై క్లారిటీ

16 October 2023, 11:01 IST

  • Mannara Chopra: టాలీవుడ్ హీరోయిన్ మ‌న్నారా చోప్రా హిందీ బిగ్‌బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఆదివారం హిందీ బిగ్‌బాస్ సీజ‌న్ 17 ప్రారంభ‌మైంది. ఈ కొత్త సీజ‌న్‌కు స‌ల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు.

మ‌న్నారా చోప్రా
మ‌న్నారా చోప్రా

మ‌న్నారా చోప్రా

Mannara Chopra: హిందీ బిగ్‌బాస్ సీజ‌న్ 17 ఆదివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కొత్త సీజ‌న్‌కు స‌ల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. స‌ల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న 14వ సీజ‌న్ ఇది కావ‌డం గ‌మ‌నార్హం. కాగా హిందీ బిగ్‌బాస్ సీజ‌న్ 17లోకి ఫ‌స్ట్ కంటెస్టెంట్‌గా టాలీవుడ్ హీరోయిన్ మ‌న్నారా చోప్రా ఎంట్రీ ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేసింది. మ‌న్నారా చోప్రాకు స్టేజ్‌పైకి గ్రాండ్‌గా వెల్క‌మ్ చెప్పాడు స‌ల్మాన్‌ఖాన్‌.

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రియాంక చోప్రా, ప‌రిణితీ చోప్రా ల‌కు క‌జిన్‌గా ప్రేమ గీమా జాన్తా న‌య్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. జ‌క్క‌న్న‌, తిక్క‌, రోగ్‌తో పాటు సీత సినిమాల్లో న‌టించింది. ఈ సినిమాల‌న్నీ బ్యాక్ టూ బ్యాక్ డిజాస్ట‌ర్స్‌గా నిల‌వ‌డంతో మ‌న్నారా చోప్రాకు ల‌క్ క‌లిసి రాలేదు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత రాజ్‌త‌రుణ్ హీరోగా న‌టిస్తోన్న తిర‌గ‌బ‌డ‌రా సామీ సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది.

త్వ‌ర‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా ఇప్పుడు హిందీ బిగ్‌బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి షాకిచ్చింది. చోప్రా ఫ్యామిలీ అనే గుర్తింపుతో కాకుండా త‌న హార్డ్ వ‌ర్క్ వ‌ల్లే బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గ‌లిగాన‌ని చెప్పింది మ‌న్నారా చోప్రా.

ముద్దుపై క్లారిటీ...

ఇటీవ‌లే తిర‌గ‌బ‌డ‌రా సామీ సినిమా ఈవెంట్‌లో మ‌న్నారా చోప్రాకు సినిమా డైరెక్ట‌ర్ ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రి ముద్దు ఇచ్చాడు. ప‌బ్లిక్‌గా హీరోయిన్‌కు డైరెక్ట‌ర్ ముద్దు ఇవ్వ‌డంపై విమ‌ర్శ‌లొచ్చాయి. ఈ ముద్దుగురించి మ‌న్నారా చోప్రాను ప్ర‌శ్న అడిగాడు స‌ల్మాన్ ఖాన్‌. డైరెక్ట‌ర్ ముద్దు ఇవ్వ‌డంపై అన‌వ‌స‌రంగా రాద్ధాంతం చేశార‌ని స‌మాధాన‌మిచ్చింది మ‌న్నారా చోప్రా.

డైరెక్ట‌ర్ ర‌వికుమార్ చౌద‌రి చాలా రోజుల త‌ర్వాత త‌న‌ను క‌లుసుకున్నాడ‌ని, ఆ సంతోషంలోనే త‌న చెంప‌పై ముద్దుపెట్టార‌ని తెలిపింది. ర‌వికుమార్ చౌద‌రి త‌న‌కు తండ్రితో స‌మాన‌మ‌ని మ‌న్నారా చోప్రా తెలిపింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం