తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Major Movie: మేజర్‌ మూవీపై అమితాబ్‌ ట్వీట్.. తెగ ఆనందపడిపోయిన అడివి శేష్‌

Major Movie: మేజర్‌ మూవీపై అమితాబ్‌ ట్వీట్.. తెగ ఆనందపడిపోయిన అడివి శేష్‌

Hari Prasad S HT Telugu

11 June 2022, 12:48 IST

    • అడివి శేష్‌ నటించిన మేజర్‌ మూవీపై ఇప్పటికే ఎంతోమంది ప్రశంసలు కురిపించారు. మూవీకి పాజిటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ దగ్గర కూడా కలెక్షన్లు భారీగానే ఉన్నాయి.
మేజర్ మూవీలో అడివి శేష్
మేజర్ మూవీలో అడివి శేష్ (Twitter)

మేజర్ మూవీలో అడివి శేష్

మేజర్‌ మూవీతో తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌ అందుకున్నాడు అడివి శేష్‌. ముంబై దాడుల్లో మరణించిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితచరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ నెల 3న రిలీజైన మేజర్‌ మూవీ.. విక్రమ్‌, సామ్రాట్‌ పృథ్వీరాజ్‌లాంటి సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్‌ దగ్గర కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది.

ట్రెండింగ్ వార్తలు

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

ఈ సినిమాపై ఎంతో మంది సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా బాలీవుడ్‌ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా ట్విటర్‌ ద్వారా మూవీపై స్పందించాడు. మూవీ మేకర్స్‌కు గుడ్‌ విషెస్‌ చెప్పాడు. "మేజర్‌ సినిమా మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఆయన ముంబై 26\11 దాడుల్లో ఎంతోమందిని రక్షించారు. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో రిలీజైంది. నా బెస్ట్‌ విషెస్‌" అంటూ అడివి శేష్‌తోపాటు సినిమా నిర్మాత మహేష్‌ బాబులను ట్యాగ్‌ చేశాడు.

శుక్రవారం రాత్రి బిగ్‌ బీ ఈ ట్వీట్‌ చేయగా.. శనివారం ఉదయం దీనిపై అడివి శేష్‌ స్పందించాడు. "ఇది చాలా గొప్ప విషయం. లెజెండే స్వయంగా ట్వీట్‌ చేశాడు. థ్యాంక్యూ సో మచ్‌ సర్‌" అంటూ అడివి శేష్‌ ట్వీట్‌ చేశాడు. మేజర్‌ సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషల్లోనూ రిలీజ్‌ చేశారు. నార్త్‌ బెల్ట్‌లోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లే రాబట్టింది.

ఈ మధ్యే మూవీ సక్సెస్‌ మీట్‌ కూడా మేకర్స్‌ ఏర్పాటు చేశారు. ఇందులో అడివి శేష్‌తోపాటు ప్రొడ్యూసర్‌ మహేష్‌ బాబు, ఇతర మూవీ యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఎన్‌ఎస్‌జీ కమాండో అయినా మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ ముంబై దాడుల్లో ఉగ్రవాదులతో పోరాడి అమరుడయ్యారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం