తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Veera Simha Reddy Release Date: బాల‌కృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - వీర‌సింహారెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్‌

Veera Simha Reddy Release Date: బాల‌కృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - వీర‌సింహారెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్‌

03 December 2022, 14:57 IST

  • Veera Simha Reddy Release Date: బాల‌కృష్ణ (Balakrishna) హీరోగా న‌టిస్తోన్న వీర‌సింహారెడ్డి రిలీజ్ డేట్‌ను శ‌నివారం వెల్ల‌డించారు. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు రానుందంటే...

బాల‌కృష్ణ
బాల‌కృష్ణ

బాల‌కృష్ణ

Veera Simha Reddy Release Date: బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి రిలీజ్ డేట్‌ను శ‌నివారం మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సంక్రాంతికి గాడ్ ఆఫ్ మాసెస్ రాబోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

ట్రెండింగ్ వార్తలు

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ ఈ సినిమాకు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన‌ ఈ సినిమాలో బాల‌కృష్ణ డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఓ గెట‌ప్ సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో క‌నిపించ‌గా మ‌రో క్యారెక్ట‌ర్ స్టైలిష్‌గా ఉంటుంద‌ని స‌మాచారం.

వీర‌సింహారెడ్డి సినిమాలో బాల‌కృష్ణ‌కు జోడీగా శృతిహాస‌న్(Shruti Haasan) హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్‌గా వీర‌సింహారెడ్డి సినిమాతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

వీర‌సింహారెడ్డితో పాటుగా జ‌న‌వ‌రి 12న త‌మిళ హీరో విజ‌య్ న‌టిస్తోన్న వార‌సుడు కూడా రిలీజ్ కానుంది. అలాగే సంక్రాంతికి చిరంజీవి వాల్తేర్ వీర‌య్య ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. మూడు భారీ బ‌డ్జెట్ సినిమాల మ‌ధ్య పోరు తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం