తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Avatar Advance Bookings: అవతార్ రీరిలీజ్‌కు కూడా అడ్వాన్స్ బుకింగ్స్‌ భారీగానే..

Avatar Advance Bookings: అవతార్ రీరిలీజ్‌కు కూడా అడ్వాన్స్ బుకింగ్స్‌ భారీగానే..

HT Telugu Desk HT Telugu

23 September 2022, 16:33 IST

    • Avatar Advance Bookings: అవతార్ రీరిలీజ్‌కు కూడా అడ్వాన్స్ బుకింగ్స్‌ భారీగానే నమోదయ్యాయి. అవతార్‌ 2 రిలీజ్‌ కానున్న నేపథ్యంలో 2009లో వచ్చిన ఈ అవతార్‌ను మరోసారి రిలీజ్‌ చేయడం విశేషం.
అవతార్ రీరిలీజ్ కు కూడా భారీగానే అడ్వాన్స్ బుకింగ్స్
అవతార్ రీరిలీజ్ కు కూడా భారీగానే అడ్వాన్స్ బుకింగ్స్

అవతార్ రీరిలీజ్ కు కూడా భారీగానే అడ్వాన్స్ బుకింగ్స్

Avatar Advance Bookings: ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మూవీ అవతార్‌. ఇప్పటికీ అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా అవతార్‌ పేరు మీదే రికార్డు ఉంది. 2009లో రిలీజైన ఈ మూవీ.. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్‌ 23) రీరిలీజ్‌ చేశారు. నిజానికి థియేటర్లలో అవతార్‌ రిలీజ్‌ కావడం ఇది మూడోసారి. ఈ మూవీ సీక్వెల్‌ అవతార్‌ 2 రిలీజ్‌కు ముందు పబ్లిసిటీ కోసం ఈ అవతార్‌ను మళ్లీ రిలీజ్‌ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Kalki 2898 AD Event: కల్కి ఈవెంట్‍కు డేట్, టైమ్ ఫిక్స్.. అత్యంత గ్రాండ్‍గా కార్యక్రమం.. ఆ విషయంపై క్లారిటీ వస్తుందా!

Sarkaar 4 OTT: సుధీర్ గేమ్ షోకు వైష్ణవి చైతన్య.. ఎంటర్‌టైనింగ్‍గా ప్రోమో: చూసేయండి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rathnam OTT Release Date: విశాల్ రత్నం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అనుకున్నదాని కంటే ముందుగానే..

Prasanth Ranveer Movie: ఆ వార్తల్లో నిజం లేదు.. ప్రశాంత్ వర్మ, రణ్‌వీర్ సింగ్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది కూడా..

అయితే ఇప్పుడు కూడా ఈ సినిమాకు మంచి అడ్వాన్స్‌ బుకింగ్సే రావడం విశేషం. ఇండియాలో రూ.కోటి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జరగడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. 2 కోట్ల డాలర్ల అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జరిగాయి. ఇక ఇండియాలో శుక్రవారం నేషనల్ సినిమా డే సందర్భంగా టికెట్ల ధరలను తగ్గించడం కూడా అవతార్‌ మూవీకి కలిసి వచ్చింది.

ఇక వీకెండ్‌లో అవతార్‌కు రూ.5 కోట్ల వరకూ కలెక్షన్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమాకు బ్రహ్మాస్త్ర, చుప్‌ల నుంచి పోటీ ఉంది. ఇండియాలో అవతార్‌ రీరిలీజ్‌కు మొత్తంగా 77559 టికెట్లు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారా అమ్ముడయ్యాయి. దీని ద్వారా రూ.1.04 కోట్లు వచ్చినట్లు ఇండస్ట్రీ ట్రాకర్‌ సాక్‌నిల్క్‌ వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫ్రాన్స్‌, కొరియా, సౌదీ అరేబియా, బెల్జియం, ఫిలిప్పీన్స్‌లాంటి దేశాల్లో గురువారమే ఈ మూవీ రిలీజైంది. ఈ దేశాల్లో తొలి రోజు 8.77 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఇక ఉత్తర అమెరికా మార్కెట్‌లో శుక్రవారం ఈ అవతార్‌ మూవీ 70 లక్షల నుంచి 1.2 కోట్ల డాలర్ల మార్కెట్‌ చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇక ఇండియాతో కలిపి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు అవతార్‌ రీరిలీజ్‌ కలెక్షన్లు 2 కోట్ల డాలర్ల వరకూ ఉండొచ్చని కూడా అంచనా. ఓ రీరిలీజ్‌ సినిమాకు ఇంత భారీ ఓపెనింగ్స్‌ సంచలనమే. అవతార్‌ మూవీ 2009లో తొలిసారి రిలీజైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా 280 కోట్ల డాలర్లు వసూలు చేసి ఆల్‌టైమ్‌ హయ్యెస్ట్‌ గ్రాసింగ్‌ మూవీగా నిలిచింది. అయితే 2021లో కొంతకాలం పాటు అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ మూవీ ఈ రికార్డును బ్రేక్‌ చేసింది.

కానీ అదే ఏడాది అవతార్‌ను చైనాలో మరోసారి డిస్ట్రిబ్యూట్‌ చేయడంతో ఆ రికార్డు తిరిగి ఆ మూవీకే దక్కింది. ఇప్పుడు వచ్చే కలెక్షన్లతో అవతార్‌ రికార్డు మరింత పదిలం కానుంది. డిసెంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌ మూవీ రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీని కూడా జేమ్స్‌ కామెరానే డైరెక్ట్‌ చేశాడు. అవతార్‌ మొత్తంగా ఐదు భాగాలుగా రానుండగా.. ఇది రెండోది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం