తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Atal Bihari Vajpayee Biopic: అట‌ల్ బిహారీ వాజ్‌పేయి బ‌యోపిక్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ - టైటిల్ రోల్ ఎవ‌రు చేశారంటే

Atal Bihari Vajpayee Biopic: అట‌ల్ బిహారీ వాజ్‌పేయి బ‌యోపిక్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ - టైటిల్ రోల్ ఎవ‌రు చేశారంటే

25 December 2022, 13:37 IST

  • Atal Bihari Vajpayee Biopic: దివంగ‌త మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా సినిమా రాబోతున్న‌ది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను ఆదివారం రిలీజ్ చేశారు...

పంకజ్ త్రిపాఠి
పంకజ్ త్రిపాఠి

పంకజ్ త్రిపాఠి

Atal Bihari Vajpayee Biopic: దివంగ‌త ప్ర‌ధాన మంత్రి అట‌ల్ బిహారీ వాజ్‌పేయి జీవితం వెండితెర‌పైకి రాబోతున్న‌ది. ఈ బ‌యోపిక్‌కు మై అట‌ల్ హూ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. టైటిల్ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు పంకజ్ త్రిపాఠి క‌నిపించ‌బోతున్నాడు. అట‌ల్ బిహారీ జ‌యంతి సంద‌ర్భంగా ఆదివారం ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ పోస్ట‌ర్‌లో పంక‌జ్ త్రిపాఠి పూర్తిగా అట‌ల్ బిహారీని పోలి క‌నిపిస్తున్నాడు. హావ‌భావాలు, రూపురేఖ‌లు మొత్తం మాజీ ప్ర‌ధానిని పోలి ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. ఈ పోస్ట‌ర్‌లో కుర్తా, దోతీ ధ‌రించి పంక‌జ్ త్రిపాఠి క‌నిపిస్తున్నారు. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. జాతీయ అవార్డ్ గ్ర‌హీత ర‌వి జాద‌వ్ ఈ బ‌యోపిక్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు

అట‌ల్ బిహారీ వాజ్‌పేయ్ జీవితంలోని కీల‌క ఘ‌ట్టాల‌ను ఈ బ‌యోపిక్‌లో చూపించ‌బోతున్న‌ట్లు తెలిసింది. ప్ర‌ధానిగా ఆయ‌న‌కు ఎదురైన స‌వాళ్లు, రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగే క్ర‌మంలో ఆయ‌న ఎదుర్కొన్న సంఘ‌ర్ష‌ణ‌ను ఈ సినిమాలో ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం.

గొప్ప నాయ‌కుడిగా పాత్ర‌ను వెండితెర‌పై పోషించే అవ‌కాశం ద‌క్క‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు పంక‌జ్ త్రిపాఠి పేర్కొన్నాడు. సందీప్‌సింగ్‌, వినోద్‌, సామ్ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్‌లో మై అట‌ల్ హూ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం