తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rc 16: రామ్‍చరణ్ - బుచ్చిబాబు సినిమాకు ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఖరారు! గ్లోబల్ లెవెల్‍ ప్లాన్

RC 16: రామ్‍చరణ్ - బుచ్చిబాబు సినిమాకు ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఖరారు! గ్లోబల్ లెవెల్‍ ప్లాన్

07 July 2023, 20:53 IST

    • RC 16: రామ్‍చరణ్ - డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‍లో రానున్న చిత్రం గురించి ఓ కీలక సమాచారం బయటికి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ఖరారైనట్టు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రామ్‍చరణ్ తేజ్, బుచ్చిబాబు సానా
రామ్‍చరణ్ తేజ్, బుచ్చిబాబు సానా

రామ్‍చరణ్ తేజ్, బుచ్చిబాబు సానా

RC 16: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ తేజ్. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‍లో అతడు గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. కాగా, తదుపరి యువ దర్శకుడు, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో సినిమా చేయనున్నాడు రామ్‍చరణ్. రామ్‍చరణ్‍కు ఇది 16వ సినిమా (RC16)గా ఉండనుంది. అయితే, ఈ ఆర్‌సీ 16 గురించి తాజాగా ఓ విషయం చక్కర్లు కొడుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Devara vs NBK 109: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

రామ్‍చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‍లో రానున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్నాడని తెలుస్తోంది. రహమాన్ పేరును చిత్ర యూనిట్ ఖరారు చేసినట్టు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

ఏఆర్ రహమాన్‍ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ చాలా పాపులర్. దీంతో ఆయనను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకుంటే గ్లోబల్ రేంజ్‍లో సినిమాకు క్రేజ్ వస్తుందని ఆర్‌సీ16 చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన రామ్‍చరణ్‍కు ఏఆర్ రహమాన్ కలిస్తే అది గ్లోబల్ సినిమాగా మరింత బజ్ దక్కించుకుంటుందని అంచనాలు ఉన్నాయి.

రామ్‍చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‍లో మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో భారీ బడ్జెట్‍తో ఆర్‌సీ16 మూవీ రూపొందనుంది. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రానుంది. ఈ సినిమా చిత్రీకరణలో రామ్‍చరణ్ త్వరలోనే పాల్గొననున్నాడు. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలవుతుందని అంచనా. ఆర్‌సీ 16లో ఇతర నటీనటుల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

శంకర్ డైరెక్షన్‍లో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక వచ్చే ఏడాది మార్చిలో విడుదలవుతుందని అంచనా. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‍గా నటిస్తోంది. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు.. గేమ్ చేంజర్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గేమ్ చేంజర్ క్లైమాక్స్ ఫైట్ సుమారు 1200 మందితో రూపొందింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం