తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalyanam Kamaneeyam Trailer: కళ్యాణం కమనీయం ట్రైలర్ వచ్చేసింది.. భార్య సంపాదనపై బతికే భర్త కథ

Kalyanam Kamaneeyam Trailer: కళ్యాణం కమనీయం ట్రైలర్ వచ్చేసింది.. భార్య సంపాదనపై బతికే భర్త కథ

05 January 2023, 17:47 IST

    • Kalyanam Kamaneeyam Trailer: టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం కళ్యాణం కమనీయం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.
కళ్యాణం కమనీయం ట్రైలర్ విడుదల
కళ్యాణం కమనీయం ట్రైలర్ విడుదల

కళ్యాణం కమనీయం ట్రైలర్ విడుదల

Kalyanam Kamaneeyam Trailer: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం కళ్యాణం కమనీయం. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిసిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా చేస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సరికొత్త అప్డేట్ వచ్చింది. కళ్యాణం కమనీయం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకునే ఓ యువకుడు భార్య సంపాదనపై బతుకడం ఎంత సవాలుగా ఉంటుంది? సమాజం, కుటుంబం నుంచి ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నాడనేది చిత్ర కథాంశం. ట్రైలర్ వినోదాత్మకంగానే కాకుండా ఎమోషనల్‌గానూ ఆకట్టుకుంది. సంతోష్ శోభన్, ప్రియ మధ్య కెమెస్ట్రీ బాగా వర్కౌటైంది.

"నీ భోగమే భోగం రా.. ఉద్యోగం చేసే భార్య.. అవసరాలు తీర్చే మామ.." అంటూ సాగే డైలాగ్‌తో ఈ సినిమా ట్రైలర్ ఆరంభమవుతుంది. ఇవే పనులా లేక ఉద్యోగ ప్రయత్నాలేమైనా ఉన్నాయా..? అంటూ హీరో పాత్రను పరిచయం చేశారు. శివకు ఉద్యోగం లేకపోయినా ఫర్వాలేదేమో కానీ శృతి భర్తకు ఉద్యోగం ఉండాలని హీరోయిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

సంతోష్ శోభన్ సరసన ఈ చిత్రం ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా చేసింది. అనిల్ కుమార్ ఆళ్ల చిత్రానికి దర్శకత్వం వహించారు. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు. జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం