తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Annapoorani Review: అన్న‌పూర్ణి రివ్యూ - యానిమ‌ల్‌కు పోటీగా రిలీజైన న‌య‌న‌తార మూవీ ఎలా ఉందంటే?

Annapoorani Review: అన్న‌పూర్ణి రివ్యూ - యానిమ‌ల్‌కు పోటీగా రిలీజైన న‌య‌న‌తార మూవీ ఎలా ఉందంటే?

04 December 2023, 5:57 IST

  • Annapoorani Review: న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించిన 75వ మూవీ అన్న‌పూర్ణి ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. నీలేష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఎలా ఉందంటే?

న‌య‌న‌తార  అన్న‌పూర్ణి మూవీ
న‌య‌న‌తార అన్న‌పూర్ణి మూవీ

న‌య‌న‌తార అన్న‌పూర్ణి మూవీ

Annapoorani Review: న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్న‌పూర్ణి ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. న‌య‌న‌తార కెరీర్‌లో 75వ మూవీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు నీలేష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ డ్రామా మూవీలో జై, స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. జ‌వాన్ స‌క్సెస్ త‌ర్వాత న‌య‌న‌తార న‌టించిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వ‌ద్ద నయనతార విజ‌యాన్ని అందుకుందా? లేదా? అన్న‌ది చూద్దాం...

ట్రెండింగ్ వార్తలు

Payal Rajput Rakshana Release Date: పాయల్ రాజ్‌పుత్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. వచ్చే నెలలోనే..

Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. ఫియర్ సాంగ్ అంటూ భయపెడుతున్న మేకర్స్

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

అన్న‌పూర్ణి చెఫ్ క‌ల‌...

అన్న‌పూర్ణి (న‌య‌న‌తార‌) సంప్ర‌దాయ బ్రాహ్మ‌ణ‌ కుటుంబంలో పుట్టిన అమ్మాయి. ఆమె తండ్రి రంగ‌రాజ‌న్ (అచ్యుత్ కుమార్‌) శ్రీరంగం టెంపుల్‌లో పూజారిగా ప‌నిచేస్తుంటాడు. ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌చ్చినా తిర‌స్క‌రించి దేవుడి సేవ‌కు అంకితం అవుతాడు. శ్రీరంగం టెంపుల్‌లో ప్ర‌సాదం త‌యారుచేసే బాధ్య‌త‌ను రంగ‌రాజ‌న్ తీసుకుంటాడు. అన్న‌పూర్ణికి తండ్రి ద్వారా వంట‌ల‌పై ఆస‌క్తి ఏర్ప‌డుతుంది. చెఫ్ కావాల‌ని క‌ల‌లుకుంటుంది.

కానీ తండ్రి మాత్రం ఎమ్‌బీఏ చేయాల‌ని ప‌ట్టుప‌డ‌తాడు. తండ్రికి ఎంబీఏ అని చెప్పి త‌న చిన్న‌నాటి స్నేహితుడు ఫ‌ర్హాన్ (జై) స‌హాయంతో చెఫ్‌ కోర్సులో జాయిన్ అవుతుంది అన్న‌పూర్ణి. కాలేజీలో నాన్‌వెజ్ వంట‌కాలు చేయ‌డంలో శిక్ష‌ణ తీసుకుంటాడు. అన్న‌పూర్ణి కాలేజీలో నాన్‌వెజ్ వండ‌టం రంగ‌రాజ‌న్ చూస్తాడు. కూతురిని చ‌దువు మాన్పించి పెళ్లిచేయాల‌ని ఫిక్స‌వుతాడు.

ఫ‌ర్హాన్ స‌హాయంతో పెళ్లి పీఠలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్‌స్టార్‌ హోట‌ల్‌లో చెఫ్‌గా జాయిన్ అవుతుంది అన్న‌పూర్ణి. తాను స్ఫూర్తిగా భావించే ఇండియ‌న్ ఫేమ‌స్ చెఫ్ ఆనంద్ సుంద‌ర్‌రాజ‌న్ (స‌త్య‌రాజ్‌) మెప్పు పొందుతుంది. ఇండియ‌న్ బెస్ట్ చెఫ్ పోటీల‌కు ఎంపిక‌వుతుంది అన్న‌పూర్ణి. అదే స‌మ‌యంలో హోట‌ల్‌లో జ‌రిగిన ఓ ప్ర‌మాదంలో రుచి తెలుసుకునే శ‌క్తిని అన్న‌పూర్ణి కోల్పుతుంది.

తాను ఇష్ట‌ప‌డ్డ చెఫ్ క‌ల‌కు దూర‌మ‌వ్వాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఆ త‌ర్వాత ఏమైంది? ఇండియ‌న్ బెస్ట్ చెఫ్ పోటీల్లో అన్న‌పూర్ణి ఎలా విజేత‌గా నిలిచింది? అన్న‌పూర్ణిని ఆనంద్ సుంద‌ర్‌రాజ‌న్ కొడుకు అశ్విన్ (కార్తిక్ కుమార్‌) ఎందుకు ద్వేషించాడు? ఇండియ‌న్ బెస్ట్ చెఫ్ పోటీల్లో అన్న‌పూర్ణి గెవ‌ల‌కుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకులు సృష్టించాడు? ఈ పోటీల్లో అన్న‌పూర్ణికి ఆనంద్ సుంద‌ర్‌రాజ‌న్‌తో పాటు ఫ‌ర్హాన్ ఎలా అండ‌గా నిలిచారు. కూతురి మ‌న‌సును రంగ‌రాజ‌న్ అర్థం చేసుకున్నాడా? లేదా అన్న‌దే అన్న‌పూర్ణి మూవీ క‌థ‌.

వంట చేయ‌డం గౌర‌వ‌మే...

చెఫ్ వృత్తిని వంట ప‌ని అంటూ చాలా మంది చుల‌క‌న‌గా చూస్తుంటారు. కానీ ఐఏఎస్‌, ఐపీఎస్ లాగే చెఫ్ అన్న‌ది కూడా ఓ గౌర‌వ‌ప్ర‌ద‌మైన వృత్తి అన్ని అన్న‌పూర్ణి సినిమాలో చూపించాడు డైరెక్ట‌ర్ నీలేష్ కృష్ణ‌. వంట చేయ‌డం కూడా ఓ ఆర్ట్ అని చాటిచెప్పాడు. బ్రాహ్మ‌ణ అమ్మాయి చెఫ్‌గా ఎలా మారింది?

ఈ ప్ర‌యాణంలో ఆమె ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొన్న‌ద‌న్న‌దే అన్న‌పూర్ణి మూవీ క‌థ‌. బ్రాహ్మ‌ణులు నాన్ వెజ్ వండ‌టం, తిన‌డం అన్న‌ది చాలా సెన్సిటివ్ పాయింట్‌. ఈ అంశాన్ని వివాదాల‌కు తావు లేకుండా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశాడు డైరెక్ట‌ర్‌. పురాణాల్లో వంట‌ల‌కు ఉన్న ప్రాశాస్త్యాన్ని, ఇండియ‌న్ వంట‌కాల గొప్ప‌ద‌నాన్ని ఈ క‌థ‌లో చ‌ర్చించాడు డైరెక్ట‌ర్‌.

ప్ర‌మాదంతోనే ప్రారంభం…

న‌య‌న‌తార‌కు హోట‌ల్‌లో ప్ర‌మాదానికి గుర‌య్యే సీన్‌తోనే సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. డైరెక్ట్‌గా కాకుండా క‌ల ద్వారా న‌య‌న‌తార పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌డం, శ్రీరంగం టెంపుల్ గొప్ప‌త‌నాన్ని చూపించ‌డం ఆస‌క్తిని పంచుతుంది. న‌య‌న‌తార చెఫ్‌గా మారాల‌ని తండ్రితో చెప్ప‌డం నుంచే అస‌లు క‌థ‌ మొద‌ల‌వుతుంది. తండ్రికి తెలియ‌కుండా చెఫ్ కోర్సులో జాయిన్ కావ‌డం, అక్క‌డ నాన్‌వెజ్ వంట‌కాలు వండ‌టం వంటి సీన్స్‌ను కామెడీ, ఎమోష‌న్స్ మేళ‌వించి చూపించారు డైరెక్ట‌ర్‌.

ఇష్టం లేని పెళ్లిని కాద‌నుకొని త‌న క‌ల సాధ‌నం కోసం ఇంటి నుంచి చెన్నై పారిపోవ‌డంతో క‌థ మొత్తం ఫైవ్‌స్టార్ హోట‌ల్‌కు షిఫ్ట్ అవుతుంది. న‌య‌న‌తార‌కు అసూయ‌, ద్వేషం నిండిన చెఫ్ పేరుతో ఓ విల‌న్‌ను క్రియేట్ చేశాడు డైరెక్ట‌ర్‌.

తండ్రి కొడుకుల డ్రామా మ‌ధ్య‌లో హీరోయిన్ ఎలా న‌లిగిపోయిందో చూపిస్తూ స్టోరీని ముందుకు న‌డిపించారు. సెకండాఫ్ చాలా వ‌ర‌కు వంట‌ల పోటీ చుట్టూ సాగుతుంది. చివ‌ర‌కు విల‌న్ సృష్టించిన అడ్డంకులు అన్ని దాటుకొని హీరోయిన్ గెల‌వ‌డం అనే రొటీన్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు డైరెక్ట‌ర్‌.

ఐడియా ఓకే కానీ...

బ్రాహ్మ‌ణ అమ్మాయి చెఫ్‌గా మార‌డం అనే ఐడియా కొత్త‌గా ఉంది. అది త‌ప్ప స్క్రీన్‌ప్లే, క్యారెక్ట‌రైజేష‌న్స్ మొత్తం టెంప్లేట్ ఫార్మెట్‌లో సాగుతాయి ఈ ఫార్మెట్‌లోవంద‌లాది సినిమాలొచ్చాయి. న‌య‌న‌తార‌కు ఎదుర‌య్యే క‌ష్టాల్లో ఎమోష‌న్స్, డ్రామా స‌రిగా పండ‌లేదు. ఆ సీన్స్ చాలా వ‌ర‌కు సినిమాటిక్‌గా అనిపిస్తాయి.

వంట‌ల పోటీల్లో న‌య‌న‌తార‌ విజేత‌గా నిలిచే స‌న్నివేశాల‌ను ట్విస్ట్‌లు, ట‌ర్న్‌లు లేకుండా సింపుల్‌గా రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌. హీరోయిన్ విన్న‌ర్ అన్న‌ది సెకండాఫ్ ఆరంభంలోనే ఈజీగా గెస్ చేసేలా ఉంటుంది. న‌య‌న్‌, జై ల‌వ్ స్టోరీ స‌రిగా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయాడు. జైతో పాటు స‌త్య‌రాజ్ క్యారెక్ట‌ర్స్ స్ట్రాంగ్‌గా రాసుకుంటే బాగుండేది. న‌య‌న్‌తో వారి బాండింగ్‌లోని సెంటిమెంట్ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.

న‌య‌న్ జీవించింది...

అన్న‌పూర్ణి పాత్ర‌లో న‌య‌న్ జీవించింది. రొటీన్ క‌థ‌కు త‌న యాక్టింగ్‌తో ప్రాణం పోసింది. ఓ వైపు ఫ్యామిలీ, మ‌రోవైపు త‌న క‌ల‌కు మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ఎదుర్కొనే యువతి పాత్ర‌లో అస‌మాన న‌ట‌న‌తో మెప్పించింది.

జై పేరుకే హీరో. అత‌డి పాత్ర‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదు. హీరోయిన్ గాడ్‌ఫాద‌ర్‌గా స‌త్య‌రాజ్ పాజిటివ్ రోల్‌లో క‌నిపించాడు. కానీ యాక్టింగ్‌, క్యారెక్ట‌ర్‌లో కొత్త‌ద‌నం కనిపించదు. విల‌న్‌గా కార్తిక్ కుమార్ ఎక్స్‌ప్రెష‌న్స్ స‌రిగా కుద‌ర‌లేదు. ఉన్నంత‌లో న‌య‌న‌తార తండ్రిగా అచ్యుత్‌కుమార్ ఆక‌ట్టుకున్నాడు.

నయన్ యాక్టింగ్ కోసం…

అన్న‌పూర్ణి… న‌య‌న‌తార యాక్టింగ్ మిన‌హా క‌థ‌, క‌థ‌నాల్లో ఎలాంటి కొత్త‌ద‌నం లేని లేడి ఓరియెంటెడ్ మూవీ. న‌య‌న్ కోసం ఈ మూవీని ఓ సారి చూడొచ్చు.

రేటింగ్ : 2/5

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం