తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anand Devarakonda: అతన్ని మా అన్నలా భావిస్తాను.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్

Anand Devarakonda: అతన్ని మా అన్నలా భావిస్తాను.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

01 April 2024, 11:18 IST

  • Anand Devarakonda KVR Mahendra Bharatanatyam: తాజాగా జరిగిన భరతనాట్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బేబీ హీరో ఆనంద్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో భరతనాట్యం సినిమాకు సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆనంద్ దేవరకొండ.

అతన్ని మా అన్నలా భావిస్తాను.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్
అతన్ని మా అన్నలా భావిస్తాను.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్

అతన్ని మా అన్నలా భావిస్తాను.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్

Anand Devarakonda KVR Mahendra: దొరసాని మూవీతో హారోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ బేబి సినిమాతో కెరీర్‌లో మంచి హిట్ అందుకున్నాడు. తాజాగా భరతనాట్యం అనే క్రైమ్ కామెడీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనంద్ దేవరకొండ విచ్చేశాడు. భరతనాట్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించి, డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు ఆనంద్ దేవరకొండ.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

"భరతనాట్యం ప్రమోషనల్ కంటెంట్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. క్రైమ్ కామెడీ నా ఫేవరేట్ జోనర్. చాలా ఆసక్తికరమైన కథ ఇది. చాలా మంది ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పని చేస్తున్నారు. వివేక్ సాగర్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఎడిటర్ రవితేజ నా ఫేవరేట్ ఎడిటర్. నిర్మాతలు పాయల్ సరాఫ్, హితేష్ గారికి ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని హీరో ఆనంద్ దేవరకొండ అన్నాడు.

"దొరసాని సినిమా మా అందరికీ చాలా మంచి పేరు తీసుకొచ్చింది. దర్శకుడు కెవీఆర్ మహేంద్ర, నేను, శివాత్మిక.. ఇలా దాదాపు అందరం కొత్తవాళ్లతో ఆ సినిమా చేశాం. ఆ సినిమా మా అందరి కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. ఇదే నమ్మకంతో చెబుతున్నా.. భరతనాట్యం సినిమా కూడా సూర్య తేజతో పాటు మూవీ యూనిట్ అందరికీ చాలా మంచి పేరు తీసుకొస్తుంది. కెవీఆర్ మహేంద్రని మా అన్నలా భావిస్తాను. కెవీఆర్ మహేంద్ర అన్న విషయంలో ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుతాను. భరతనాట్యం కూడా చాలా పెద్ద విజయం సాధిస్తుంది" అని ఆనంద్ దేవరకొండ చెప్పాడు.

"ధని ఏలే గారు పాతికేళ్ల నుంచి అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. ఈ వేడుకకు విచ్చేసిన అతిధులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 5న 'భరతనాట్యం', ఫ్యామిలీ స్టార్ సినిమాలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలని చూసి ఎంజాయ్ చేయండి. అన్నీ సినిమాలు విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మన ఇండస్ట్రీ బాగుండాలి. మనమంతా బాగుండాలి" అని ఆనంద్ దేవరకొండ తెలిపాడు.

ఇదిలా ఉంటే, భరతనాట్యం సినిమాతో సూర్య తేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్నాడు. అతను ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే కుమారుడు. ఈ సినిమాకు దొరసాని ఫేమ్ కెవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పఈఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. హీరోయన్‌గా మీనాక్షి గోస్వామి చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలోనే ఇటీవల భరతనాట్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ యూనిట్. ఈ వేడుకకు ఆనంద్ దేవరకొండ చీఫ్ గెస్టుగా హాజరు కాగా హీరోయిన్ శివాత్మిక, జీవిత రాజశేఖర్, నవదీప్, దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, విరించి వర్మ, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, మధుర శ్రీధర్, లగడపాటి శ్రీధర్ అతిథులుగా పాల్గొన్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం