తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amma Nanna O Tamila Ammayi Sequel: అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయి సీక్వెల్ వ‌స్తోంది - తెలుగులో కాదు త‌మిళంలో...

Amma Nanna o Tamila Ammayi Sequel: అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయి సీక్వెల్ వ‌స్తోంది - తెలుగులో కాదు త‌మిళంలో...

28 November 2023, 11:26 IST

  • Amma Nanna o Tamila Ammayi Sequel: ర‌వితేజ‌, డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో రూపొందిన అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి సినిమాకు సీక్వెల్ రాబోతోంది. అయితే తెలుగులో కాదు త‌మిళంలో. ఈ సీక్వెల్‌ను డైరెక్ట‌ర్ మోహ‌న్‌రాజా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాడు.

అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి
అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి

అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి

Amma Nanna o Tamila Ammayi Sequel: ర‌వితేజ‌, డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందిన అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయి మూవీ ట్రెండ్‌సెట్ట‌ర్‌గా ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. 2003లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ఆల్‌టైమ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌లో ఒక‌టిగా నిలిచింది. మ‌ద‌ర్‌ సెంటిమెంట్‌కు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించి ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ట్రెండింగ్ వార్తలు

Prasanth Ranveer Movie: ఆ వార్తల్లో నిజం లేదు.. ప్రశాంత్ వర్మ, రణ్‌వీర్ సింగ్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది కూడా..

Blackout OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న 12th ఫెయిల్ హీరో కొత్త సినిమా: డేట్ ఖరారు.. తెలుగులో కూడా స్ట్రీమింగ్

TV Serial : తెలుగులో వస్తున్న శ్రీమద్ రామాయణం సీరియల్: ప్రారంభ తేదీ, టైమింగ్స్ ఇవే: కాంటెస్ట్ కూడా..

Allu Arjun at Dhaba: దాబాలో భార్యతో కలిసి అల్లు అర్జున్ లంచ్.. ఫొటోలు వైరల్.. ఎక్కడో తెలుసా?

ఈ టాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని ఎం. కుమ‌ర‌న్ స‌న్నాఫ్ మ‌హాల‌క్ష్మి పేరుతో ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా త‌మిళంలోకి రీమేక్ చేశారు. త‌మిళ రీమేక్‌లో జ‌యం ర‌వి హీరోగా న‌టించాడు. త‌మిళ వెర్ష‌న్‌లో కూడా ఆసిన్ హీరోయిన్‌గా న‌టించింది. జ‌య‌సుద‌ రోల్‌ను న‌దియాచేసింది. దాదాపు ప‌దిహేనేళ్ల త‌ర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన న‌దియాకు ఈ రీమేక్‌ మంచి క‌మ్‌బ్యాక్‌గా నిలిచింది.

కాగా ఎం. కుమ‌ర‌న్ స‌న్నాఫ్ మ‌హాల‌క్ష్మి రీమేక్‌కు సీక్వెల్ రాబోతోంది. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా వెల్ల‌డించాడు. ఎం కుమ‌ర‌న్ స‌న్నాఫ్ మ‌హాల‌క్ష్మి 2 పేరుతో ఈ సినిమాను రూపొందిస్తోన్న‌ట్లు పేర్కొన్నాడు. ఈ సీక్వెల్‌కు సంబంధించి క‌థ మొత్తం పూర్త‌యిన‌ట్లు, త్వ‌ర‌లోనే షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఈ సీక్వెల్‌లో జ‌యం ర‌వి హీరోగా న‌టిస్తాడ‌ని అన్నాడు. కానీ ఇందులో న‌దియా రోల్ ఉండ‌ద‌ని మోహ‌న్‌రాజా అన్నాడు.

త్వ‌ర‌లోనే ఈ సీక్వెల్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం. చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ త‌ర్వాత నాగార్జున‌, అఖిల్ అక్కినేనిల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా ప్లాన్ చేశాడు మోహ‌న్‌రాజా. కానీ అనుకున్న స్థాయిలో స్క్రిప్ట్ రాక‌పోవ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మ‌ల్టీస్టార‌ర్ స్థానంలోనే అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయి మూవీ సీక్వెల్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం