తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kushi: విజయ్-సామ్ ‘ఖుషి’ రెండో షెడ్యూల్‌కు సర్వం సిద్ధం

Kushi: విజయ్-సామ్ ‘ఖుషి’ రెండో షెడ్యూల్‌కు సర్వం సిద్ధం

07 July 2022, 17:36 IST

    • విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తోన్న చిత్రం ఖుషి. ఈ సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను వైజాగ్‌లో నిర్వహించనున్నారు.
సమంత-విజయ్
సమంత-విజయ్ (Twitter)

సమంత-విజయ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తోన్న చిత్రం ఖుషీ. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభమైంది. కొన్ని రోజుల పాటు ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కశ్మీర్‌లో జరిగింది. ఆ సెట్‌లోనే సమంత పుట్టిన రోజు వేడుకలు కూడా జరిపింది. అనంతరం కాస్త గ్యాప్ తీసుకున్న ఖుషీ టీమ్.. ఎట్టకేలకు రెండో షెడ్యూల్‌‌కు అన్ని ఏర్పాట్లు చేసింది. వైజాగ్‌లో బీచ్ లోకేషన్లలో ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

Panchayat 3 Trailer: పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. మరింత రాజకీయం, నవ్వులతో అదిరిపోయింది

Getup Srinu: ఆ ఇద్దరు హీరోలపై నమ్మకం కుదర్లేదు.. గెటప్ శ్రీను పర్ఫెక్ట్.. డైరెక్టర్ కామెంట్స్

Suchitra Dhanush: హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్

వైజాగ్‌ నగరంలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు బీచ్‌లో ఓ లవ్ సాంగ్‌ను చిత్రీకరించనుందట చిత్రబృందం. కశ్మీర్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్‌ను వైజాగ్‌లో జరపనున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, జయరామ్, సచిన్ ఖేడ్కర్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చనున్నారు.

విజయ్ దేవరకొండ, సమంత తొలి సారిగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. డిసెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఈ సినిమాతో పాటు విజయ్, సామ్ తమ ఇతర చిత్రాలపై కూడా దృష్టి పెట్టారు. సమంత తెలుగులో యశోధ, శాకుంతలంతో పాటు హిందీలో వరుణ్ ధావన్ సిటాడెల్‌లో నటిస్తోంది. ఇది కాకుండా హాలీవుడ్‌లో అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే చిత్రం చేస్తోంది. మరోపక్క విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా పూరీ దర్శకత్వంలోనే జీజీఎం చేయనున్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం