తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush Tv Premier Date: ఆదిపురుష్ టీవీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడు, ఏ ఛానెల్లో చూడాలంటే?

Adipurush TV Premier Date: ఆదిపురుష్ టీవీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడు, ఏ ఛానెల్లో చూడాలంటే?

Hari Prasad S HT Telugu

22 October 2023, 11:44 IST

    • Adipurush TV Premier Date: ఆదిపురుష్ టీవీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్ ను స్టార్ మా అనౌన్స్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఈ సినిమా.. టీవీల్లో ఏం చేస్తుందో అన్న ఆసక్తి నెలకొంది.
ఆదిపురుష్ సినిమా
ఆదిపురుష్ సినిమా

ఆదిపురుష్ సినిమా

Adipurush TV Premier Date: ఆదిపురుష్ మూవీ టీవీ ప్రీమియర్ డేట్ వచ్చేసింది. ఓవైపు రెబల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి మూవీ సలార్: సీజ్ ఫైర్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న వేళ.. ఆదిపురుష్ వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్ ను స్టార్ మా(Star Maa) వెల్లడించింది. ఈ సినిమా వచ్చే ఆదివారం (అక్టోబర్ 29) సాయంత్రం 5.30 గంటలకు రానున్నట్లు స్టార్ మా తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

Krishnamma OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వ‌చ్చిన స‌త్య‌దేవ్ కృష్ణ‌మ్మ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

భారీ అంచనాల మధ్య రిలీజైన ఆదిపురుష్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన విషయం తెలిసిందే. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తొలి మూడు రోజుల్లోనే భారీగా వసూలు చేసినా.. నెగటివ్ టాక్ తో తర్వాత కలెక్షన్లు పడిపోతూ వచ్చాయి.

ప్రభాస్ కు వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్ ను మిగిల్చింది. అంతకు ముందు సాహో, రాధేశ్యామ్ సినిమాలు కూడా బోల్తా పడిన విషయం తెలిసిందే. ఆదిపురుష్ మూవీకి ఓటీటీలోనూ పెద్దగా ఆదరణ లభించలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. బాక్సాఫీస్ వైఫల్యంతో అనుకున్నదానికంటే ఎంతో ముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

ఈ సినిమా రిలీజ్ సమయంలోనూ ఎన్నో వివాదాలు చెలరేగాయి. విమర్శలూ వచ్చాయి. రామాయణాన్ని పూర్తిగా నాశనం చేశారంటూ డైరెక్టర్ ఓంరౌత్ పై ఎంతో మంది విరుచుకుపడ్డారు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం సలార్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. హ్యాట్రిక్ వైఫల్యాలతో ఢీలా పడిన ప్రభాస్.. ఈ సలార్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం