తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush Trp: టీవీలో అదరగొట్టిన ఆదిపురుష్.. ఎంత టీఆర్పీ సాధించిందో తెలుసా?

Adipurush TRP: టీవీలో అదరగొట్టిన ఆదిపురుష్.. ఎంత టీఆర్పీ సాధించిందో తెలుసా?

Hari Prasad S HT Telugu

09 November 2023, 20:57 IST

    • Adipurush TRP: ఆదిపురుష్ మూవీ టీవీలో అదరగొట్టింది. ఈ మధ్యే తొలిసారి టీవీలో టెలికాస్ట్ అయిన ఈ సినిమాకు ఊహించినదాని కంటే ఎంతో మెరుగైన టీఆర్పీ రావడం విశేషం.
ఆదిపురుష్ మూవీకి మంచి టీఆర్పీ
ఆదిపురుష్ మూవీకి మంచి టీఆర్పీ

ఆదిపురుష్ మూవీకి మంచి టీఆర్పీ

Adipurush TRP: బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ప్రభాస్ ఆదిపురుష్ మూవీని.. టీవీలో మాత్రం ప్రేక్షకులు ఆదరించారు. ఈ మధ్య కాలంలో టీవీల్లోకి వచ్చిన ఎన్నో హిట్ మూవీస్ కంటే కూడా ఎంతో మెరుగైన టీఆర్పీ ఈ సినిమా సొంతమైంది. ఆదిపురుష్ మూవీ అక్టోబర్ 29న తొలిసారి స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ అయింది. అదే రోజు ఇండియా, ఇంగ్లండ్ వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Malayalam Movie: వామ్మో ఇదేం టైటిల్‌ -ఈ కొత్త మ‌ల‌యాళం మూవీ పేరు చెప్ప‌డానికి నోరు తిర‌గ‌డం క‌ష్ట‌మే!

NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్​కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

అయినా కూడా ఆదిపురుష్ ఏకంగా 9.47 టీఆర్పీ సాధించడం విశేషం. ఇది అసలు ఊహకందనిదే. బాక్సాఫీస్ తోపాటు ఓటీటీలోనూ ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ టీవీలో తొలిసారి టెలికాస్ట్ అయిన సందర్భంలోనే మంచి టీఆర్పీతో అదరగొట్టింది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పూర్తి కార్టూన్ సినిమాలాగా ఉందంటూ తొలి రోజు తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు వచ్చాయి.

ఆ ప్రభావం బాక్సాఫీస్ వసూళ్లపై బాగానే పడింది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్, తర్వాతి రెండు రోజులు ఫర్వాలేదనిపించినా.. అక్కడి నుంచి దారుణంగా పతనమైంది. వెయ్యి కోట్లు వసూలు చేస్తుందని భావించిన సినిమా కేవలం రూ.360 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రభాస్ హ్యాట్రిక్ పరాజయాన్ని మిగిల్చిన ఆదిపురుష్ మూవీని టీవీల్లో మాత్రం ప్రేక్షకులు ఆదరించడం విశేషమే.

నిజానికి ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన వీర సింహా రెడ్డి, వాల్తేర్ వీరయ్యలాంటి సినిమాల కంటే కూడా ఆదిపురుష్ కు మంచి టీఆర్పీ వచ్చింది. వాల్తేర్ వీరయ్యకు 5.14, వీర సింహా రెడ్డికి 8.83 టీఆర్పీ వచ్చింది. ఈ రెండు సినిమాలు రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి పెద్ద హిట్ టాక్ సంపాదించిన సినిమాలే. వీటినే టీవీల్లో ప్రేక్షకులు ఆదరించకపోగా.. ఆదిపురుష్ కు మాత్రం ఈ స్థాయి టీఆర్పీ రావడం నిజంగా విశేషమే.

ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించగా.. కృతి సనన్ సీతగా నటించిన విషయం తెలిసిందే. ఇక రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. ఓంరౌత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇందులో పాత్రధారులను చూపించిన తీరు, నాసిరకం వీఎఫ్ఎక్స్ పై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం