తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush Trailer 2 : ఆదిపురుష్ నుంచి మరో ట్రైలర్.. ఎప్పుడంటే?

Adipurush Trailer 2 : ఆదిపురుష్ నుంచి మరో ట్రైలర్.. ఎప్పుడంటే?

Anand Sai HT Telugu

04 June 2023, 11:32 IST

    • Adipurush 2nd trailer : త్వరలో ఆదిపురుష్ సినిమా విడుదల కానుంది. ప్రభాస్ సినిమా కావడంతో భారీగా హైప్ ఉంది. అయితే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ రానుంది.
ఆదిపురుష్ పోస్టర్
ఆదిపురుష్ పోస్టర్

ఆదిపురుష్ పోస్టర్

ఆదిపురుష్ సినిమా(Adipurush Cinema) గురించి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. ఓం రావత్(Om Raut) దర్శకత్వం వహించాడు. అనేక కారణాలతో ఆదిపురుష్ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది . ఈ చిత్రం రామాయణం కథ ఆధారంగా రూపొందింది. ఇప్పటికే ట్రైలర్‌ చూసి అభిమానులు ఎంజాయ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Guppedantha Manasu Serial: వ‌సుధార దెబ్బ‌కు ఏడ్చేసిన‌ శైలేంద్ర - కొడుకు ప‌రిస్థితికి దేవ‌యాని విల‌విల - మ‌హేంద్ర హ్యాపీ

Blink OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న కన్నడ సై-ఫి థ్రిల్లర్.. రికార్డు టైమ్‌లోనే.. మీరు చూశారా లేదా?

krishna mukunda murari serial: మరోసారి చెంప పగిలిందిరోయ్.. నేనే ముకుందనని చెప్పేసిన మీరా, షాక్ లో కృష్ణ

Brahmamudi May 22nd Episode: కావ్య ప్లేస్‌లోకి వ‌చ్చిన‌ మాయ - దుగ్గిరాల‌ ఇంటి కోడ‌లిగా స్థానం - రుద్రాణి మాస్ట‌ర్ ప్లాన్

ఇప్పుడు మరో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి సంబంధించిన మరో ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసినట్లు సమాచారం. జూన్‌ 6న తిరుపతిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది. ఆ రోజున ‘ఆదిపురుష్’ సినిమా 2వ ట్రైలర్ (Adipurush 2nd Trailer ) విడుదల కానుందనే వార్తలు వినిపిస్తు్న్నాయి. కొత్త ట్రైలర్‌ను నటుడు ప్రభాస్, నటి కృతి సనన్(Kriti Sanon) లాంచ్ చేసే అవకాశం ఉంది.

ప్రభాస్ సినిమా కావడంతో సాధారణంగానే అందరికీ ఆసక్తి నెలకొంది. ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. రాముడు, రావణుడి యుద్ధం ఎలా ఉంటుందో తెలియజేసేలా 2వ ట్రైలర్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాలో అడ్వాన్స్‌డ్ గ్రాఫిక్స్ టెక్నాలజీని ఉపయోగించారు. భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమా ప్రభాస్‌కి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. 'ఆదిపురుష్'తో హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుందోనని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. బాక్సాఫీస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.

పాన్ ఇండియా(Pan India) లెవల్లో ఆదిపురుష్ సినిమా విడుదలవుతోంది. కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు. హిందీ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం