తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Madhavi Latha On Adipurush: ఆదిపురుష్ చెత్త సినిమా - హిందువుల్ని డివైడ్ చేయ‌డానికే తీశారు - మాధ‌వీల‌త కామెంట్స్ వైర‌ల్‌

Madhavi Latha on Adipurush: ఆదిపురుష్ చెత్త సినిమా - హిందువుల్ని డివైడ్ చేయ‌డానికే తీశారు - మాధ‌వీల‌త కామెంట్స్ వైర‌ల్‌

08 November 2023, 13:42 IST

  • Madhavi Latha on Adipurush: ఆదిపురుష్  బ్లండ‌ర్‌, డ‌ర్టీయెస్ మూవీ అని చెప్పింది మాధ‌వీల‌త‌. హిందువుల‌ను డివైడ్ చేయడానికే ఆదిపురుష్ సినిమా తీశార‌ని పేర్కొన్న‌ది. ప్ర‌భాస్ మూవీపై మాధ‌వీల‌త చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

మాధ‌వీల‌త
మాధ‌వీల‌త

మాధ‌వీల‌త

Madhavi Latha on Adipurush: ప్ర‌భాస్ ఆదిపురుష్ మూవీపై హీరోయిన్ మాధ‌వీల‌త ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ఈ సినిమా బ్లండ‌ర్‌, డ‌ర్టీయెస్ట్ మూవీ అని చెప్పింది. హిందువుల‌ను విడ‌గొట్ట‌డానికే ఆదిపురుష్ సినిమా చేశార‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌పై మాధ‌వీల‌త ఫైర్ అయ్యింది. సినిమాటిక్ లిబ‌ర్టీ పేరుతో రామాయ‌ణాన్ని పూర్తిగా వ‌క్రీక‌రించార‌ని మాధ‌వీల‌త అన్నది.

ట్రెండింగ్ వార్తలు

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

Lampan OTT: బాల్యాన్ని గుర్తుచేసేలా ఉన్న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.. ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..

Mega vs Allu fans: మెగా, అల్లు అభిమానుల మధ్య పెరుగుతూనే ఉన్న గ్యాప్! మీమ్‍లతో ఫ్యాన్స్ వార్

ప్ర‌భాస్ మూవీపై మాధ‌వీల‌త చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో వైరల్ అవుతోన్నాయి. ఆదిపురుష్‌తో పాటు త‌న సినీ కెరీర్‌పై మాధ‌వీల‌త ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో అనేక విషయాల్ని వెల్లడించింది. ఇండ‌స్ట్రీలో తెలుగు అమ్మాయిల‌పై వివ‌క్ష ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంద‌ని చెప్పింది. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన హీరోయిన్ల‌కు భారీగా రెమ్యున‌రేష‌న్ల‌ను ఇస్తుంటార‌ని, కానీ తెలుగు అమ్మాయిల‌కు స‌రిగా రెమ్యున‌రేష‌న్లు ఇవ్వ‌ర‌ని చెప్పింది.

హైట్ విష‌యంలో ఇండ‌స్ట్రీలో చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాన‌ని చెప్పింది. పొట్టిదానా అని పిలిచేవార‌ని చెప్పింది. కెరీర్ ఆరంభంలో ఆ విమ‌ర్శ‌లు చూసి కోప్ప‌డేదానిన‌ని, ఇప్పుడు అవ‌న్నీ ఎదురించ‌డం నేర్చుకున్నాన‌ని చెప్పింది.

ఆదిపురుష్‌తో పాటు ఇండ‌స్ట్రీపై మాధ‌వీల‌త చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. 2008 రిలీజైన న‌చ్చావులే సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మాధ‌వీల‌త‌. నాని స్నేహితుడా, అర‌వింద్ 2తో పాటు కొన్ని సినిమాల్లో న‌టించింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం