తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lakshmika Sajeevan: 24ఏళ్లకే గుండెపోటుతో నటి మృతి.. సినీ ఇండస్ట్రీలో విషాదం

Lakshmika Sajeevan: 24ఏళ్లకే గుండెపోటుతో నటి మృతి.. సినీ ఇండస్ట్రీలో విషాదం

08 December 2023, 17:37 IST

    • Lakshmika Sajeevan: మలయాళ నటి లక్ష్మిక సజీవన్ కన్నుమూశారు. 24 ఏళ్ల వయసులోనే ఆమె ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు.
లక్ష్మిక సజీవన్
లక్ష్మిక సజీవన్

లక్ష్మిక సజీవన్

Lakshmika Sajeevan: మలయాళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నటి లక్ష్మిక సజీవన్ (24) గుండెపోటు కారణంగా మృతి చెందారు. లక్ష్మిక హఠాన్మరణంతో సినీ పరిశ్రమ షాక్‍కు గురైంది. శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో లక్ష్మిక కన్నమూశారు. కక్కా అనే టెలీ ఫిల్మ్‌లో పంచమి పాత్రతో ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించారు.

ట్రెండింగ్ వార్తలు

Furiosa A Mad Max Saga: మ్యాడ్‌మ్యాక్స్‌కు ప్రీక్వెల్ వ‌స్తోంది. 1400 కోట్ల విజువ‌ల్ వండ‌ర్‌ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

NNS Serial May 16th Episode: మిస్స‌మ్మ‌ను అవ‌మానించిన మ‌నోహ‌రి - త‌ల్లికి ఎదురుతిరిగిన అమ‌ర్ - నిజ‌మైన అరుంధ‌తి మాట‌

Kalvan Review: కాల్వన్ రివ్యూ - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజైన‌ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Jr NTR Donation: ఏపీలోని ఆలయానికి భారీ విరాళం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్: వివరాలివే

హఠాత్తుగా గుండెపోటు రావటంతో షార్జాలో లక్ష్మిక సజీవన్ మృతి చెందారు. ఆమె అక్కడ ప్రస్తుతం ఓ బ్యాంకులో పని చేస్తున్నట్టు తెలుస్తోంది. పంజయమ్మ, పంచవర్ణతతా, సౌదీ వెల్లక్క, ఉయరే, ఒరు కట్టందన్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్ సహా మరిన్ని చిత్రాల్లో లక్ష్మిక నటించారు. దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన ఒరు యమనందాన్ ప్రేమకథలోనూ లక్ష్మిక నటించారు.

చివరగా 2021లో కూన్ అనే సినిమాలో లక్ష్మిక సజీవన్ నటించారు. ఆ చిత్రానికి ప్రశాంత్ మొలికల్ దర్శకత్వం వహించారు. పంజయమ్మ సినిమాలో దేవయానికి టీచర్‌గా లక్ష్మిక నటించగా.. ఆ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే, కక్కాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి కూడా చాలా ప్రశంసలు వచ్చాయి. మంచి నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.

లక్ష్మిక సజీవన్ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా నివాళి తెలియజేస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్టులు చేస్తున్నారు.

లక్ష్మిక ఆరు రోజుల క్రితమే తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో ఓ పోస్ట్ చేశారు. సూర్యుడు ఉదయిస్తున్న ఫొటోను దుబాయ్ నుంచే షేర్ చేశారు. “నమ్మకం. చీకటి ఉన్నప్పటికీ వెలుగు కూడా వస్తుంది” అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ పెట్టి వారం తిరగకుండానే ఆమె కన్నుమూశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం