తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ahimsa Release Date: ఎట్ట‌కేల‌కు రానా త‌మ్ముడి సినిమాకు రిలీజ్ డేట్ దొరికిందోచ్

Ahimsa Release Date: ఎట్ట‌కేల‌కు రానా త‌మ్ముడి సినిమాకు రిలీజ్ డేట్ దొరికిందోచ్

HT Telugu Desk HT Telugu

10 May 2023, 9:44 IST

  • Ahimsa Release Date: రానా సోద‌రుడు అభిరామ్ ద‌గ్గుబాటి హీరోగా న‌టిస్తోన్నతొలి సినిమా అహింస రిలీజ్ డేట్ ఖ‌రారైంది. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు రానుందంటే...

అహింస మూవీ
అహింస మూవీ

అహింస మూవీ

Ahimsa Release Date: రానా సోద‌రుడు, సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ ద‌గ్గుబాటి అహింస సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యి చాలా రోజులైంది. ఏప్రిల్‌లో అహింస సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని అనుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Prabhas Instagram Story: ప్రభాస్ పెళ్లి కాదు.. అతని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వెనుక అసలు విషయం ఇదీ

Preminchoddu: షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు.. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాడు.. హీరో కామెంట్స్

Suriya Kanguva: సూర్య కంగువ.. పది వేల మందితో సూర్య, బాబీ డియోల్ వార్ సీన్ షూటింగ్

Kajal Agarwal Kannappa: మంచు విష్ణు కన్నప్పలో కాజల్ అగర్వాల్.. అప్పుడు చెల్లెలిగా ఇప్పుడు?

భారీ బ‌డ్జెట్ సినిమాలు పోటీగా ఉండ‌టంతో వెన‌క్కి త‌గ్గారు. మ‌రో మంచి రిలీజ్ డేట్ కోసం చాలా రోజులుగా చిత్ర యూనిట్ ఎదురుచూస్తోన్నారు. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అయినా సురేష్‌బాబు త‌న‌యుడి సినిమాకే రిలీజ్ డేట్ దొర‌క్క‌పోవ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎట్ట‌కేల‌కు అహింస కొత్త రిలీజ్ డేట్‌ను ఖ‌రారు చేశారు.

జూన్ 2న ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో అభిరామ్‌కు జోడీగా గీతిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. స‌దా, ర‌జ‌త్ బేడీ , క‌మ‌ల్ కామ‌రాజు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. ఇందులో ర‌ఘు అనే అమాయ‌క యువ‌కుడి పాత్ర‌లో అభిరామ్ న‌టిస్తోన్నాడు.

ధ‌ర్మాన్ని గెలిపించ‌డం కోసం ఓ యువ‌కుడు సాగించిన పోరాటం నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు తేజ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాకు ఆర్ పీ ప‌ట్నాయ‌క్ సంగీతాన్ని అందించారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత తేజ‌, ఆర్‌పీ ప‌ట్నాయ‌క్ కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా ఇది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం