తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Elections 2023 : తెలంగాణలో 'హంగ్' కు అవకాశం ఉందా..?

Telangana Elections 2023 : తెలంగాణలో 'హంగ్' కు అవకాశం ఉందా..?

30 November 2023, 20:06 IST

    • Telangana Assembly Elections 2023: తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. అయితే ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ హవా ఉన్నట్లు పలు సంస్థలు తెలిపాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023

Telangana Assembly Elections 2023: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ ముగిసింది. ఇక అందరి చూపు డిసెంబర్ 3 వైపునకు మళ్లింది. ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాబోతుందనేది టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది. అయితే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ సంస్థలు… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. అయితే ఆయా సంస్థలు ఇచ్చిన వాటిల్లో ఆసక్తికరమైన విషయాలను పేర్కొన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

TS Lok Sabha Elections : అగ్రనేతలకు అగ్ని పరీక్షే- లోక్ సభ ఎన్నికల ఫలితాలే కీలకం!

SIT On AP Poll Violence : ఏపీలో హింసాత్మక ఘటనలపై ‘సిట్‌’ ఏర్పాటు - 2 రోజుల్లో నివేదిక..!

PM Modi: ‘బుల్డోజర్ ను ఎప్పుడు, ఎలా వాడాలో యోగిని చూసి నేర్చుకోండి’: ప్రధాని మోదీ

CBN and Sajjala: అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు సజ్జల.. అధికారంలో ఉన్నపుడు ఇద్దరిదీ ఒకటే రాగం

ఎగ్జిట్ పోల్స్ లో చూస్తే… ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితం కానున్నట్లు సూచించాయి. అయితే కాంగ్రెస్ వేవ్ ఉందని, మెజార్టీ సీట్లు ఆ పార్టీకే దక్కుతాయని స్పష్టం చేశాయి. జన్ కీ బాత్ సర్వే చూస్తే… బీఆర్ఎస్ పార్టీకి 40-55 సీట్లు వస్తాయని తెలపగా… కాంగ్రెస్ పార్టీకి 48-64 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. బీజేపీ 7-13, ఎంఐఎం - 4-7 సీట్లలో గెలిచే ఛాన్స్ ఉందని అభిప్రాయపడింది. Republic - Matrize సర్వేలో కాంగ్రెస్ కు 58-68, బీఆర్ఎస్ కు 46-56 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. బీజేపీకి 4-9 సీట్లు రావొచ్చని పేర్కొంది. వీరి సర్వే ప్రకారం చూస్తే… తెలంగాణలో హంగ్ రావొచ్చని చెప్పొచ్చు. జన్ కీ బాత్ సర్వే కూడా ఇదే విషయాన్ని బలపరుస్తున్నట్లు కనిపిస్తోంది.

CNN ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే కాంగ్రెస్-56 సీట్లు, బీఆర్ఎస్-48, బీజేపీ-10,ఎంఐఎం-5 సీట్లు గెలుస్తుందని తెలిపింది. వీరి లెక్క ప్రకారం కూడా హంగ్ కే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. TV9 Bharatvarsh - Polstrat వారి ఎగ్జిట్ పోల్స్ లో బీఆర్ఎస్ కు 48-58 సీట్లు, కాంగ్రెస్ కు 49-59 సీట్లు వస్తాయని అంచనా వేసింది. వీరి సర్వేలో కూడా స్పష్టమైన మెజార్టీ మార్క్ దాటినట్లు కనిపించటం లేదు.

రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే 60 సీట్లు మార్కును దాటాల్సి ఉంటుంది. అలా దాటితినే సింగిల్ గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితులు లేకుండా… పైన పేర్కొన్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఫలితాలు ఉంటే మాత్రం హంగ్ కు అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. నిజంగానే హంగ్ పరిస్థితి వస్తే… ఎంఐఎం కింగ్ మేకర్ కాబోతుంది. అయితే బీజేపీ పార్టీకి కనుక రెండంకెల సీట్లు దాటితే… సమీకరణాలు మరోలా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది.

ఇక ఎగ్జిట్ పోల్స్ ను పూర్తిగా విశ్వసించే పరిస్థితి ఉండదు. చాలా సార్లు భిన్నంగా ఫలితాలు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3న ఏం జరగబోతుందనేది చూడాలి….!

తదుపరి వ్యాసం