తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Barelakka Security : బర్రెలక్కకు పోలీసు సెక్యూరిటీ - హైకోర్టు కీలక ఆదేశాలు

Barelakka Security : బర్రెలక్కకు పోలీసు సెక్యూరిటీ - హైకోర్టు కీలక ఆదేశాలు

24 November 2023, 16:05 IST

    • TS HC On Barelakka Sirisha Security : కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన శిరీషా అలియాస్ బర్రెలక్క రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు… కీలక ఆదేశాలను జారీ చేసింది.
బర్రెలక్క శిరీష పిటిషన్ పై హైకోర్టు విచారణ
బర్రెలక్క శిరీష పిటిషన్ పై హైకోర్టు విచారణ

బర్రెలక్క శిరీష పిటిషన్ పై హైకోర్టు విచారణ

Barelakka Sirisha Security: ఎన్నికల బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన శిరిష అలియాస్ బర్రెలక్క… తన భద్రతపై హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు… కీలక ఆదేశాలను ఇచ్చింది. స్వతంత్య్ర అభ్యర్థి బర్రెలెక్క కు భద్రత కల్పించాలని ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. బర్రెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లకు కూడా భద్రత కల్పించటంతో పాటు…ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని ఆదేశాల్లో పేర్కొంది హైకోర్టు.

ట్రెండింగ్ వార్తలు

Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ లో నేతల చివరి ప్రయత్నాలు-ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు రంగంలోకి బృందాలు!

AP Polling : ఏపీలో పోలింగ్ కు సర్వం సిద్ధం-64 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్ట్

Lok Sabha Elections : రేపే లోక్​సభ ఎన్నికల 4వ దశ పోలింగ్​- పూర్తి వివరాలు..

Medak : మెదక్ లో ఒక అభ్యర్థి అనుచరుడి కారులో రూ.88 లక్షలు సీజ్

శిరీష(బర్రెలక్క) పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని… భద్రతపరంగా ముప్పు ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు సెక్యూరిటీ కల్పించాలని తెలిపింది. అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్ దే అని స్పష్టం చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా ఈల గుర్తుపై పోటీ చేస్తున్న శిరీష తక్కువ వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. కొల్లాపూర్‌లో పోటీ చేస్తుండగా.. మొత్తం తెలంగాణలో ఎన్నికల్లో ఆమె యువ సంచలనంగా మారారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుండటంతో ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు క్రితం ప్రచారం నిర్వహిస్తున్న శిరీష సోదరుడిపై కొందరు దాడి చేశారు. తనను ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల నుంచి ఆఫర్లు కూడా వచ్చాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్ధిగా తాను నిర్వహిస్తున్న ప్రచారానికి రక్షణ కల్పించకపో వడాన్ని సవాలు చేస్తూ కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క హైకో ర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు.

నిరుద్యోగిగా ఉన్న తాను వారి సమస్యల్ని పరిష్కరించేందుకు స్థానిక యువత ప్రోత్సాహంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రచారంలో నియోజక వర్గ ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోందని, ఈ నేపథ్యంలో విజయావకాశాలు ఉన్న తనకు ఇతర పార్టీలకు చెందిన వారు ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారని ఆరోపించారు. తరచూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ లు వస్తున్నాయని ఈ నెల 2న ఎన్నికల ప్రచారంలో ఉన్న తన సోదరుడిపై సంతోష్, మరికొందరు దాడికి దిగారని, కత్తితో బెదిరించారని ఈ వ్యవహారంపై పోలీసు కేసు నమోదైందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో తనకు రక్షణ కల్పించాలని వినతిపత్రం ఇచ్చినా పోలీసులు పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికలు పూర్తయ్యే దాకా 2 ప్లస్ 2 గన్‌మెన్‌లతో రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించాల్సిందిగా కోరారు. ప్రతివాదులుగా తెలంగాణ హోంశాఖ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, పెద్ద కొత్తపల్లి స్టేషన్ హౌస్‌ ఆఫీసర్‌లను పేర్కొన్నారు. దీనిపై విచారించిన హైకోర్టు… ప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసింది.

తదుపరి వ్యాసం