తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ktr Tweet : ప్రశాంతంగా నిద్రపోయా.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

KTR Tweet : ప్రశాంతంగా నిద్రపోయా.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

01 December 2023, 14:45 IST

    • Telangana Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయ్. వీటన్నింటి నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 
మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ (Twitter)

మంత్రి కేటీఆర్

Telangana Assembly Elections 2023 : తెలంగాణలో ఎన్నికల యుద్ధం ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ పూర్తి కావటంతో… ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. డిసెంబర్ 3వ తేదీన మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ హవా వీయటంతో… గెలుపొటములపై ఉత్కంఠ నెలకొంది. ఓవైపు సంబరాలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంటే…డిసెంబర్ 3వ తేదీన కారు దూసుకెళ్తోందని గులాబీ పార్టీ వర్గాలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Ratan Tata: ఐదో దశ లోక్ సభ పోలింగ్ ముందు ముంబై వాసులకు రతన్ టాటా ప్రత్యేక సందేశం; క్షణాల్లో వైరల్ గా మారిన పోస్ట్

SIT On AP Poll Violence : ఏపీలో హింసాత్మక ఘటనలపై ‘సిట్‌’ ఏర్పాటు - 2 రోజుల్లో నివేదిక..!

PM Modi: ‘బుల్డోజర్ ను ఎప్పుడు, ఎలా వాడాలో యోగిని చూసి నేర్చుకోండి’: ప్రధాని మోదీ

CBN and Sajjala: అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు సజ్జల.. అధికారంలో ఉన్నపుడు ఇద్దరిదీ ఒకటే రాగం

పోలింగ్ ప్రక్రియ ముగియటం, ఎగ్జిట్ పోల్స్ వెల్లడైన నేపథ్యంలో… మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయానంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. “చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయాను. ఎగ్జిట్ పోల్స్ పెరగొచ్చు.. కానీ ఎగ్జాట్ ఫలితాలు మాకు శుభవార్తను చెబుతాయి” అంటూ 'X'('ట్విటర్)లో పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం