తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Kishanreddy: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల గెలుపుకు కేసీఆర్ ప్రయత్నాలు - కిషన్ రెడ్డి

Kishanreddy: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల గెలుపుకు కేసీఆర్ ప్రయత్నాలు - కిషన్ రెడ్డి

HT Telugu Desk HT Telugu

28 November 2023, 6:57 IST

    • Kishanreddy: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో 1200 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishanreddy: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకించిన సిపిఎం, ఎంఐఎం పార్టీలతో కాంగ్రెస్ జత కట్టిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మందిని బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ కాదా అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9,2009 లో మొదటి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ఆ తరువాత డిసెంబర్ 23న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కాంగ్రెస్ పార్టీ వందల మంది తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేసిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

ట్రెండింగ్ వార్తలు

Warangal News : పోలింగ్ ముగిసి ఐదు రోజులు, అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

TS Lok Sabha Elections : అగ్రనేతలకు అగ్ని పరీక్షే- లోక్ సభ ఎన్నికల ఫలితాలే కీలకం!

Ratan Tata: ఐదో దశ లోక్ సభ పోలింగ్ ముందు ముంబై వాసులకు రతన్ టాటా ప్రత్యేక సందేశం; క్షణాల్లో వైరల్ గా మారిన పోస్ట్

SIT On AP Poll Violence : ఏపీలో హింసాత్మక ఘటనలపై ‘సిట్‌’ ఏర్పాటు - 2 రోజుల్లో నివేదిక..!

రాజకీయ స్వలాభం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోదని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ విషయంలో మొదటి నుంచి బిజేపి ఒక స్పష్టమైన ఆలోచనతో ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.నాడు లోక్ సభ వేదికగా సుష్మాస్వరాజ్ చేసిన చారిత్రక ప్రసంగం ఇంకా తెలంగాణ ప్రజల కళ్ల ముందు కదలాడుతుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణకు అండగా ఉండాలన్న సుష్మాస్వరాజ్ నిర్ణయం,పార్లమెంట్ లోపల, బయట బిజేపి చేసిన ఉద్యమం,తెలంగాణ లో వందలాది మంది విద్యార్థులు బలి దానాలకు తలొగ్గి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును కాంగ్రెస్ ప్రవేశ పెట్టిందన్నారు. ఇది వాస్తవం కాదని చెప్పే ధైర్యం కాంగ్రెస్ నాయకులకు ఉందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

రాజకీయ స్వలాభం లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ,తెలంగాణ ఏర్పడిన కొత్తలో కెసిఆర్ కుటుంబంతో కాంగ్రెస్ పార్టీ ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదా అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్,బిఆర్ఎస్ లకు ప్రజలు సరైన బుద్ది చెబుతారని, తెరముందు రాజకీయంగా వైరుధ్యాన్ని పాటిస్తూనే తెరవెనుక కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీల దోస్తీ అందరికీ తెలుసన్నారు కిషన్ రెడ్డి.

పదేళ్లుగా కాంగ్రెస్,బిఆర్ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకుంటూ తెలంగాణ ప్రజలకు చేస్తున్న మోసం ఇప్పుడు బట్ట బయలు అయిందన్నారు.ఈ రెండు పార్టీలకు తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో పార్లమెంట్ బిల్లుకు సహకరించుకోవడంలో ఈ రెండు పార్టీల స్నేహాన్ని యావత్ తెలంగాణ సమాజం గమనించందని కిషన్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే మాదిరి ఉన్నాయన్నారు.కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కెసిఆర్ డబ్బు పంపించారని అనేక ఆరోపణలు ఉన్నాయని, ప్రస్తుతం తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించడానికి కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.

(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)

తదుపరి వ్యాసం