తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు, సీఎంగా రేవంత్ రెడ్డి?
తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023
తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు, సీఎంగా రేవంత్ రెడ్డి?

03 December 2023, 20:11 IST

  • తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజలో ఉన్నారు. తెలంగాణలో 119 నియోజక వర్గాలకు నవంబర్ 30న ఎన్నికలు జరిగాయి.

03 December 2023, 21:39 IST

Revanth Reddy : రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం?

రేపు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎంలను రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి రాహుల్‌గాంధీ హాజరు కానున్నారు. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఈనెల 9న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేయనున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే సహా కీలక నేతలు హాజరుకానున్నారు.

03 December 2023, 21:11 IST

మరికాసేపట్లో గవర్నర్ ను కలవనున్న కాంగ్రెస్ నేతలు

మరికాసేపట్లో కాంగ్రెస్ నాయకుల బృందం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళ సైతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే గవర్నర్ ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు లేఖ ఇవ్వనున్నారు.

03 December 2023, 20:19 IST

తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తా నియామకం

తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తా నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్ ను ఈసీ సస్పెండ్ చేసింది. కౌంటింగ్ ముగియకముందే అంజనీకుమార్ రేవంత్ రెడ్డిని కలవడంతో ఈసీ ఆయను సస్పెండ్ చేసింది.

03 December 2023, 19:54 IST

PM Modi : తెలంగాణలో ప్రతి ఎన్నికల్లో బలపడుతున్నాం - ప్రధాని మోదీ

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ దిల్లీలో మాట్లాడారు. దేశ ప్రజలు పరిపక్వతతో ఆలోచించి ఓట్లు వేశారని, బీజేపీకి పట్టంకట్టారన్నారు. ఈ ఫలితాలతో 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గ్యారంటీ అన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారని, ప్రతి ఎన్నికల్లో బలపడుతున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ ఎల్లప్పుడూ పనిచేస్తుందన్నారు. ఆదివాసీల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయన్నారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఆదివాసీలను పట్టించుకోలేదని, అందుకే రాజస్థాన్‌ ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు. మధ్యప్రదేశ్‌ ప్రజలు మాత్రం ప్రభుత్వాన్ని మార్చలేదన్నారు.

03 December 2023, 19:22 IST

Karimnagar Election Results 2023 : కరీంనగర్ స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల విజయం

కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ స్వల్ప తేడాతో గెలుపొందారు. దీంతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ రీకౌంటింగ్ చేయాలని ఈసీని కోరాలని నిర్ణయించారు. మొరాయించిన రెండు ఈవీఎంలలో ఓట్లను అధికారులు లెక్కించలేదు. ఈ ఈవీఎంలలో 1300 ఓట్లు ఉన్నట్లు సమాచారం. దీంతో కరీంనగర్ అసెంబ్లీ నియోజకర్గంలో రీకౌంటింగ్ కోరాలని బీజేపీ నిర్ణయించింది.

03 December 2023, 18:44 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు

  • బీఆర్ఎస్-35( 4 స్థానాల్లో ఆధిక్యం)
  • కాంగ్రెస్ -64 స్థానాల్లో విజయం
  • బీజేపీ-8 సీట్లు
  • ఎంఐఎం-7 సీట్లు
  • సీపీఐ-1

03 December 2023, 18:01 IST

Patancheru Election Results 2023 : పటాన్ చెరు నియోజకవర్గం 22వ రౌండ్

  • కాంగ్రెస్ 4041
  • బీఆర్ఎస్ 5664
  • బీఎస్పీ 2047
  • కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ - 94369
  • గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ - 101689
  • నీలం మధు ముదిరాజ్ - 45405
  • 22వ రౌండ్ ముగిసే సరికి 7320 ఓట్ల బీఆర్ఎస్ ఆధిక్యం

03 December 2023, 17:39 IST

TS Elections : తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పై ఎన్నికల సంఘం వేటు

తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ డీజీపీపై వేటు వేసింది. డీజీపీ అంజనీకుమార్, ఇతర పోలీస్ అధికారులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం సీరియస్ తీసుకుని డీజీపీపై వేటు వేసింది.

03 December 2023, 17:22 IST

TS Election Results 2023 : ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా

కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ పంపించారు. రేపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

03 December 2023, 17:21 IST

Yellareddy Election Results 2023 : ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు భారీ మెజార్టీ గెలిపొందారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు తన గెలుపునకు కృషి చేసిన వాళ్లందరికీ మదన్ మోహన్ కృతజ్ఞతలు తెలిపారు

03 December 2023, 17:16 IST

తెలంగాణ ఫలితాలపై ప్రధాని మోదీ స్పందన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. తెలంగాణలో బీజేపీ కి ప్రజా మద్దతు పెరుగుతోందన్నారు. ఈ ట్రెండ్ రానున్న రోజుల్లో కొనసాగుతుందని ఆశిస్తున్నానన్నారు. ‘‘తెలంగాణ తో మా బంధం విడదీయలేనిది. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం కొనసాగిస్తాం. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలను అభినందిస్తున్నా’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

03 December 2023, 16:51 IST

TS Election Results 2023: రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం

రేపు(సోమవారం) తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడనుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరుగనుంది.

03 December 2023, 16:44 IST

Suryapet Election Results 2023 : సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి గెలుపు

సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి 4605 ఓట్లతో గెలుపొందారు.

  • మొత్తం పోలైన ఓట్లు 2,03,564
  • బీఆర్ఎస్ కు పోలైన మొత్తం ఓట్లు- 74433
  • కాంగ్రెస్ పోలైన మొత్తం ఓట్లు -68685
  • బీజేపీకి పోలైన ఓట్లు - 13734
  • పోస్టల్ బ్యాలెట్ మొత్తం - 3120

03 December 2023, 17:11 IST

Paleru Election Results 2023 : పాలేరులో పొంగులేటికి భారీ మెజారిటీ

పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై ఆయన 56,460 ఓట్ల మెజారిటీ సాధించారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు గెలుపొందిన అభ్యర్థుల్లో భారీ మెజారిటీ ఇదే కావడం గమనార్హం.

03 December 2023, 16:22 IST

TS Election Results 2023 : ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం - హరీశ్ రావు

రెండు పర్యాయాలు బీఆర్ఎస్ కు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నాను. ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన మా పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

03 December 2023, 16:14 IST

కొత్తగూడెం ఎన్నికల ఫలితాలు 2023 : సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయం

కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించిన విషయం తెలిసిందే. కాగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పోటీలో ఉండగా మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అయినప్పటికీ సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు 23,089 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.

03 December 2023, 16:01 IST

జగిత్యాల ఎన్నికల ఫలితాలు 2023 : ముందంజలో బీఆర్ఎస్ అభ్యర్థి

జగిత్యాల నియోజకవర్గం 12 రౌండ్ కౌంటింగ్ లో

డా. సంజయ్ కుమార్ (బీఆర్ఎస్)- 40704

జీవన్ రెడ్డి (కాంగ్రెస్) - 37614

డా. బోగ శ్రావణి (బీజేపీ) - 27833

బిఆర్ఎస్ అభ్యర్ధి డా. సంజయ్ కుమార్ 3086 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

03 December 2023, 15:48 IST

మంథని ఎన్నికల ఫలితాలు 2023 : ఈ విజయం సోనియా గాంధీకి అంకితం-శ్రీధర్ బాబు

కాంగ్రెస్ పార్టీ విజయం తెలంగాణ స్వప్నం సాకారం చేసిన సోనియా గాంధీకి అంకితమని సీనియర్ నేత శ్రీధర్ బాబు అన్నారు. ఈ గెలుపు సబ్బండ వర్గాల ప్రజల గెలుపు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. నాకు ఇంత భారీ స్థాయిలో విజయాన్ని కట్టబెట్టిన మంథని ప్రాంత ప్రజలకు ఏళ్ల వేళల రుణపడి ఉంటానన్నారు.

03 December 2023, 15:42 IST

వైరా ఎన్నికల ఫలితాలు 2023 : కాంగ్రెస్ అభ్యర్థి మాలోతు రాందాస్ నాయక్ విజయం

వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మాలోతు రాందాస్ నాయక్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ పై రాందాస్ నాయక్ 33,069 ఓట్ల మెజారిటీతో విజయం పొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాందాస్ నాయక్ విజయం పొందడం చర్చనీయాంశంగా మారింది.

03 December 2023, 15:39 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 : బీజేపీ ఎంపీలు ఓటమి, కాంగ్రెస్ ఎంపీలు గెలుపు

బీజేపీ నుంచి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు సోయం బాపురావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు.

03 December 2023, 15:23 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 : రెండు సార్లు అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు- కేటీఆర్

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ట్వీట్ చేశారు. రెండు పర్యాయాలు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాల గురించి బాధపడలేదని, కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో కచ్చితంగా నిరాశ చెందానన్నారు. కానీ మేము దీన్ని ఒక అభ్యాసంగా తీసుకుంటామని, తిరిగి పుంజుకుంటామన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు.

03 December 2023, 15:25 IST

సిరిసిల్ల ఎన్నికల ఫలితాలు 2023 : 29,845 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్

చివరి రౌండ్ కౌంటింగ్

  • బీఆర్ఎస్ : 1300
  • కాంగ్రెస్ : 1517
  • బీజేపీ : 165

29,845 ఓట్లతో కేటీఆర్ ఆధిక్యంలో ఉన్నారు.

03 December 2023, 15:11 IST

కామారెడ్డి ఎన్నికల ఫలితాలు 2023 : కేసీఆర్, రేవంత్ రెడ్డికి షాక్- బీజేపీ అభ్యర్థి ఘనవిజయం

కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట్ రమణ రెడ్డి 11600 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై విజయం కాటిపల్లి వెంకట్ రెడ్డి విజయం సాధించారు.

03 December 2023, 17:11 IST

తుంగతుర్తి ఎన్నిక ఫలితాలు 2023 : కాంగ్రెస్ అభ్యర్థి విజయం

  • తుంగతుర్తి నియోజకవర్గం ముగిసిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ
  • 51240 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామేలు

03 December 2023, 14:42 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: ఎర్రబెల్లి సోదరుల ఓటమి

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: పాలకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలయ్యారు. వరంగల్ తూర్పులో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు ఓటమి పాలయ్యారు.

03 December 2023, 17:11 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

తెలంగాణలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 8, బీజేపీ 4, ఎంఐఎం 2 స్థానాల్లో గెలుపొందారు.

03 December 2023, 14:29 IST

మధిరలో ఎన్నికల ఫలితాలు 2023: మధిరలో మల్లు భట్టి విక్రమార్క గెలుపు

మధిరలో ఎన్నికల ఫలితాలు 2023: మధిరలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు. మధిరలో సీఎల్ఫీ నేత భట్టి విక్రమార్క ఘన విజయం సాధించారు. 35,190 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పై ఆయన నాలుగోసారి విజయం సాధించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మధిర నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో మూడుసార్లకు మించి ఎవరు గెలుపు సాధించలేదు. కాగా భట్టి విక్రమార్క ఆ చరిత్రను తిరగరాస్తు నాలుగోసారి విజయం సాధించారు.

03 December 2023, 14:27 IST

వర్ధన్నపేట ఎన్నికల ఫలితాలు 2023: వర్ధన్నపేటలో కాంగ్రెస్ గెలుపు

వర్ధన్నపేట ఎన్నికల ఫలితాలు 2023: రిటైర్డ్ పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు వర్ధన్నపేటలో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి హోరా హోరి గా జరిగిన పోరులో ఘన విజయం సాధించారు. ఏ ఆర్ నాగరాజు చివరిసారిగా నిజామాబాద్ సిపిగా పనిచేశారు.

03 December 2023, 14:20 IST

భువనగిరి ఎన్నికల ఫలితాలు 2023: భువనగిరిలో కాంగ్రెస్ గెలుపు

భువనగిరి ఎన్నికల ఫలితాలు 2023: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో 25761 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.

03 December 2023, 14:12 IST

నాగార్జున సాగర్‌ ఎన్నికల ఫలితాలు 2023: నాగార్జున సాగర్‌లో జయవీర్‌

నాగార్జున సాగర్‌ ఎన్నికల ఫలితాలు 2023:నాగార్జునసాగర్‍లో జానారెడ్డి తనయుడు జయవీర్‍రెడ్డి(కాంగ్రెస్) విజయం సాధించారు.

03 December 2023, 14:06 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల వివరాలు

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: ఎన్నికల్లో ఇప్పటివరకు గెలిచిన అభ్యర్థులు.. అంబర్ పేట బీఆర్‍ఎస్.. కాలేరు వెంకటేష్ - మెదక్ కాంగ్రెస్.. మైనంపల్లి రోహిత్ - నల్గొండ కాంగ్రెస్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి - కల్వకుర్తి కాంగ్రెస్.. కశిరెడ్డి నారాయణరెడ్డి - అశ్వారావుపేట కాంగ్రెస్.. ఆదినారాయణరావు - భద్రాచలం కాంగ్రెస్.. తెల్లం వెంకట్రావు - ఇల్లందు కాంగ్రెస్.. కోరం కనకయ్య - జుక్కల్ కాంగ్రెస్.. తోట లక్ష్మీకాంతరావు - బెల్లంపల్లి కాంగ్రెస్.. గడ్డం వినోద్ - కుత్బుల్లాపూర్ బీఆర్‍ఎస్.. కె.పి వివేకానందగౌడ్ - నిర్మల్ కాంగ్రెస్.. మహేశ్వర్ రెడ్డి - మంథని కాంగ్రెస్.. దుద్దిళ్ల శ్రీధర్ బాబు - రామగుండం కాంగ్రెస్.. ఎం.ఎస్ రాజ్‍ఠాకూర్ - అందోల్ కాంగ్రెస్.. దామోదర్ రాజనర్సింహా - దుబ్బాక బీఆర్‍ఎస్ కొత్త ప్రభాకర్ రెడ్డి - హుజూర్‍నగర్ కాంగ్రెస్.. ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి - కొడంగల్ కాంగ్రెస్.. రేవంత్ రెడ్డి

03 December 2023, 14:04 IST

ములుగు ఎన్నికల ఫలితాలు 2023: ములుగులో విజయం సాధించిన ధనసరి సీతక్క

ములుగు ఎన్నికల ఫలితాలు 2023: ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధనసరి సీతక్క విజయం సాధించారు.

03 December 2023, 13:51 IST

సనత్‌ నగర్ ఎన్నికల ఫలితాలు 2023: సనత్‌ నగర్‌లో తలసాని గెలుపు

సనత్‌ నగర్ ఎన్నికల ఫలితాలు 2023: నత్‍నగర్‍లో మంత్రి తలసాని శ్రీనివాస్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పోసాని నీలిమపై తలసాని విజయం సాధించారు.

03 December 2023, 13:49 IST

చెన్నూరు ఎన్నికల ఫలితాలు 2023: చెన్నూరులో వివేక్ గెలుపు

చెన్నూరు ఎన్నికల ఫలితాలు 2023: చెన్నూరులో వివేక్ వెంకటస్వామి విజయం సాధించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌పై 32వేల ఓట్లతో విజయం సాధించారు.

03 December 2023, 13:42 IST

కల్వకుర్తి ఎన్నికల ఫలితాలు 2023: కాంగ్రెస్ పార్టీ గెలుపు

కల్వకుర్తి ఎన్నికల ఫలితాలు 2023: కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపొందారు.

03 December 2023, 13:40 IST

హుజుర్‌నగర్‌ ఎన్నికల ఫలితాలు 2023: ఉత్తమ్‌కుమార్‌ గెలుపు

హుజుర్‌నగర్‌ ఎన్నికల ఫలితాలు 2023: హుజుర్‌నగర్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గెలుపొందారు. 44వేల ఓట్ల మెజార్టీతో ఉత్తమ్ కుమార్‌ రెడ్డి గెలుపొందారు.

03 December 2023, 13:35 IST

మేడ్చల్ ఎన్నికల ఫలితాలు 2023: మేడ్చల్‌లో మల్లారెడ్డి గెలుపు

మేడ్చల్ ఎన్నికల ఫలితాలు 2023: మేల్చల్ నియోజక వర్గంలో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మల్లారెడ్డి విజయం సాధించారు.

03 December 2023, 13:34 IST

మెదక్‌ ఎన్నికల ఫలితాలు 2023: మైనంపల్లి రోహిత్

మెదక్‌ ఎన్నికల ఫలితాలు 2023: మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిపై 7,710 మెజార్టీతో గెలుపొందారు. చెప్పినట్టుగానే మైనంపల్లి హనుమంతరావు తన కొడుకును విజయ తీరాలకు చేర్చి పంతం నెగ్గించుకున్నారు.

03 December 2023, 13:32 IST

నారాయణఖేడ్‌ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ గెలుపు

నారాయణఖేడ్‌ ఎన్నికల ఫలితాలు: నారాయణఖేడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల సంజీవరెడ్డి విజయం సాధించారు. 5 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

03 December 2023, 13:31 IST

పాలకుర్తి ఎన్నికల ఫలితాలు 2023: పాలకుర్తిలో యశస్విని రెడ్డి గెలుపు

పాలకుర్తి ఎన్నికల ఫలితాలు 2023: పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటమి పాలయ్యారు. పాలకుర్తిలో ఎర్రబెల్లిపై కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు.

03 December 2023, 13:30 IST

జుక్కల్ ఎన్నికల ఫలితాలు 2023: లక్ష్మీకాంతరావు గెలుపు

జుక్కల్ ఎన్నికల ఫలితాలు 2023: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజవర్గంలో 1152 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతారావు గెలుపొందారు.

03 December 2023, 13:29 IST

బాన్సువాడ ఎన్నికల ఫలితాలు 2023: బాన్సువాడలో పోచారం గెలుపు

బాన్సువాడ ఎన్నికల ఫలితాలు 2023: బాన్సువాడ నియోజకవర్గంలో 20వేల ఓట్ల మెజార్టీతో స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి గెలుపు గెలుపొందారు.

03 December 2023, 13:27 IST

నల్గొండ ఎన్నికల ఫలితాలు 2023: నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం

నల్గొండ ఎన్నికల ఫలితాలు 2023: నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి విజయం సాధించారు. 54 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

03 December 2023, 13:22 IST

కొడంగల్ ఎన్నికల ఫలితాలు 2023: కొడంగల్‌లో గెలిచిన రేవంత్ రెడ్డి

కొడంగల్ ఎన్నికల ఫలితాలు 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: కొడంగల్‌లో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గెలుపొందారు. 32,800 ఓట్ల మెజార్టీతో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. మరోవైపు కామారెడ్డిలో కూడా రేవంత్‌ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

03 December 2023, 13:20 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: వెనుకబడిన సిట్టింగ్ ఎమ్మెల్యే

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, పాలకుర్తి, డోర్నకల్ మహబూబాబాద్ నియోజకవర్గాలను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేటాయించారు. స్టేషన్ ఘన్పూర్, జనగామ స్థానాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న డాక్టర్ తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టికెట్ నిరాకరించి ఆ రెండు స్థానాలను కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. ఈ రెండు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ లీడ్ కొనసాగుతోంది. జనగామ ఆరో రౌండు ముగిసేసరికి టిఆర్ఎస్ అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి 8,640 ఓట్లతో ముందంజలో ఉన్నారు స్టేషన్ ఘనపూర్ లో 8వ రౌండ్ ముగిసే సరికి కడియం శ్రీహరి 6,977 ఓట్లతో లీడ్ లో కొనసాగుతున్నారు. ములుగులో కొత్తగా బడే నాగజ్యోతి కి అవకాశం ఇవ్వగా అక్కడ వెనుకబడింది.

03 December 2023, 13:18 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: వరంగల్‌లో తలకిందులైన అంచనాలు

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ అంచనాలు తలకిందులు అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరి గ్రాఫ్ బాగుందని భావించిన అధిష్టానం 9 స్థానాలను వారికే కేటాయించింది. ఒక స్థానంలో కొత్తవారికి చోటు కల్పించగా.. మరో రెండు స్థానాల్లో సిట్టింగ్లను మార్చి వేరే వాళ్లకు అవకాశం ఇచ్చింది. కాగా సిట్టింగులను మార్చిన చోట్లనే బీఆర్ఎస్ కు పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తోంది. సిట్టింగులు బరిలో దిగిన అన్ని చోట్లా కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.

03 December 2023, 13:09 IST

దుబ్బాక ఎన్నికల ఫలితాలు 2023: దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు

దుబ్బాక ఎన్నికల ఫలితాలు 2023: దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు. ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.

03 December 2023, 13:07 IST

బెల్లంపల్లి ఎన్నికల ఫలితాలు 2023: బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ గెలుపు

బెల్లంపల్లి ఎన్నికల ఫలితాలు 2023: బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ విజయంసాధించారు. బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై వినోద్ విజయం సాధించారు.

03 December 2023, 12:56 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: పటాన్‌చెరులో కాంగ్రెస్ ఆధిక్యం

పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. రెండవ రౌండ్‌ పటాన్ చెరు నియోజక వర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధిక్యంలో ఉన్నారు. మహిపాల్ రెడ్డి పై కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ 264 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

03 December 2023, 12:54 IST

ఆందోల్‌ ఎన్నికల ఫలితాలు 2023: ఆందోల్‌లో కాంగ్రెస్ గెలుపు

ఆందోల్‌ ఎన్నికల ఫలితాలు 2023: ఆందోల్‌లో 24,422ఓట్ల తేడాతో మాజీ డిప్యూటీ సిఎం దామోదర్ రాజనరసింహ విజయం సాధించారు. బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌పై దామోదర్ గెలుపొందారు.

03 December 2023, 12:52 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: సోనియా గాంధీ బర్త్‌ డే గిఫ్ట్‌

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: సీఎం అభ్యర్థిపై అంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తాను సిఎం రేసులో ఉన్నానా.. లేదా అనేది అప్రస్తుతమన్నారు. సోనియాగాంధీకి బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నామని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

03 December 2023, 12:44 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: భద్రాచలంలో బిఆర్‌ఎస్ గెలుపు

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: భద్రాచలం నియోజకవర్గం బీఆర్ఎస్ ఖాతాలో చేరింది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్యపై బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ సాధించిన తొలివిజయం ఇదే కావడం గమనార్హం.

03 December 2023, 12:38 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: రేవంత్ నివాసానికి డీజీపీ

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. రేవంత్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. డీజీపీ వెంట పలువురు IPS ఆఫీసర్లు సైతం రేవంత్ ఇంటికి వెళ్లారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రేవంత్‌కు భద్రతను పెంచారు.

03 December 2023, 12:36 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: శ్రీకాంతాచారికి రేవంత్ నివాళులు

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు అంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది’’ అంటూ రేవంత్‌ ట్వీట్‌ చేశారు.

03 December 2023, 12:29 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: ఫలితాలు వచ్చాక సమధానం చెబుతా

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాల సరళిపై కర్ణాటక డిప్యూటీ సిఎం డికె.శివకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ నేతలపై తామేమి మాట్లాడమని, వారేమి ట్వీట్ చేశారో అందరికి తెలుసన్నారు.

03 December 2023, 12:27 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: ఆందోల్‌లో దామోదర్ ఆధిక్యత

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: అందోల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఆందోల్ నియోజకవర్గం ఆరో రౌండ్ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి 4492 ఓట్లు,కాంగ్రెస్ కు 6238ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్ లో 1746 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ ఆధిక్యంలో ఉన్నారు. ఆరు రౌండ్లు ముగిసేసరికి మొత్తం 11,622 ఓట్ల ఆధిక్యంలో దామోదర రాజనర్సింహ ముందంజలో ఉన్నారు.

03 December 2023, 12:35 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్ధి ఆధిక్యత

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నారు. 9 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు 22,744 ఓట్ల మెజార్టీ దక్కించుకున్నారు. 9వ రౌండ్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డికి 2518 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 5835 ఓట్లు వచ్చాయి.

03 December 2023, 12:21 IST

ఇల్లందు ఎన్నికల ఫలితాలు 2023: ఇల్లందులో కాంగ్రెస్ విజయం

ఇల్లందు ఎన్నికల ఫలితాలు 2023: తెలంగాణలో మరో నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ పోటీలో నిలిచిన కోరం కనకయ్య 38 వేల మెజారిటీతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియపై విజయం పొందారు.

03 December 2023, 12:35 IST

అశ్వారావుపేట, ఇల్లందు ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్‌ పార్టీకి తొలిగెలుపు

అశ్వారావుపేట నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఇల్లందులో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సమీప ప్రత్యర్థి బిఆర్‌ఎస్‌ పార్టీపై విజయం సాధించారు.

03 December 2023, 12:14 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: జహీరాబాద్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: జహీరాబాద్ నియోజకవర్గంలో నాల్గవ రౌండ్ ముగిసేసరికి బిఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్ రావు ఆధిక్యంలో ఉన్నారు. జహీరాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్ధి మాణిక్ రావుకు 5234 ఓట్లు ,కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్‌కు 4956ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 278 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాలుగో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్ రావు 1136ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.

03 December 2023, 12:11 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: సంగారెడ్డిలో బిఆర్‌ఎస్ అభ్యర్థి ముందంజ

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: సంగారెడ్డి నియోజకవర్గం లో రెండవ రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ముందంజలో ఉన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి )పై 1882 ఓట్ల ఆధిక్యం లో చింతా ప్రభాకర్ ఆధిక్యంలో ఉన్నారు.

03 December 2023, 12:09 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: భద్రాచలంలో తెల్లం వెంకట్రావు ఆధిక్యం

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు 5,115 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఆధిక్యత కనిపించే ఒకే ఒక్క నియోజకవర్గం ఇప్పటి వరకు భద్రాచల మాత్రమే ఉంది.క మిగిలిన 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్, సిపిఐ పొత్తు పెట్టుకున్న కొత్తగూడెంలో సిపిఐ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు మెజారిటీలో కొనసాగుతున్నారు. రెండు నియోజక వర్గాల్లో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.

03 December 2023, 11:58 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: దుబ్బాకలో ఆధిక్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డి

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: దుబ్బాక నియోజకవర్గం 9 రౌండ్ ఫలితాలు వెలువడే సమయానికి బిఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 9 రౌండ్ లో 2515 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. 9 రౌండ్లు ముగిసేసరికి 29, 658 ఓట్ల ఆధిక్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డి కొనసాగుతున్నారు.

03 December 2023, 11:50 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: ఇల్లందులో రెండో విజయం

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి రెండో విజయం దక్కింది. ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.

03 December 2023, 11:44 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: మంత్రి ప్రశాంత్ రెడ్డి వెనుకంజ

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: బాల్కొండ నియోజకవర్గం 12 రౌండ్స్ ముగిసే సరికిి బిఆర్ఎస్ అభ్యర్థికి 43394 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 47152 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ మెజారిటీ 3758 ఓట్లు దక్కాయి. మంత్రి ప్రశాంత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.

03 December 2023, 11:33 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: అశ్వారావుపేటలో కాంగ్రెస్‌ పార్టీకి తొలి విజయం

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: తెలంగాణలో కాంగ్రెస్ తొలి విజయం దక్కించుకుంది. అశ్వారావుపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జారే ఆదినారాయణ విజయం సాధించారు. 23,358 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

03 December 2023, 11:31 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: నిజామాబాద్‌ అర్బన్‌లో బీజేపీ

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: నిజామాబాద్‌లో ఏడవ రౌండ్ ముగిసే సరికి బిజెపి అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు. 7వ రౌండ్‌లో లో 2089 ఓట్లతో అధిక్యంలో కొనసాగిన కాంగ్రెస్ అభ్యర్థి 8వ రౌండ్‌లో వెనుబడ్డారు.

03 December 2023, 11:34 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: నర్సాపూర్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: బిఆర్‌ఎస్‌ పార్టీలో చివరి వరకు చిచ్చు రేపిన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 5వ రౌండ్ ముగిసేనాటికి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి సునీతా లక్ష్మా రెడ్డికి -4698 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్ధికి 4521 ఓట్లు లభించాయి. 5వ రౌండ్‌లో బిఆర్‌ఎస్‌కు 177ఓట్ల ఆధిక్యత రాగా, 5రౌండ్లలో కలిపి కాంగ్రెస్ అభ్యర్థికి 1058 ఓట్లు లభించాయి.

03 December 2023, 11:08 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: నారాయణ్‌ఖేడ్‌లో బిఆర్ఎస్‌

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు.నారాయణ ఖేడ్ నియోజకవర్గం ఏడో రౌండ్ ఫలితాలు వెలువడే నాటికి బిఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థికి 5277 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 5070 ఓట్లు, వచ్చాయి. ఏడో రౌండ్ లో 207 ఆధిక్యంలో BRS అభ్యర్ధి భూపాల్ రెడ్డి ఉన్నారు. ఏడు రౌండ్లు ముగిసేసరికి 582 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి సంజీవ రెడ్డి నిలిచారు.

03 December 2023, 11:02 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: సిద్దిపేటలో హరీష్ రావు భారీ ఆధిక్యం

సిద్ధిపేట నియోజకవర్గంలో హరీష్ రావు భారీ ఆధిక్యం కొనసాగిస్తున్నారు.నాల్గవ రౌండ్ లో మంత్రి హరీష్ రావు కు 3వేల 669 ఆధిక్యంలో ఉన్నారు. నాలుగు రౌండ్స్ ముగిసే సరికి 19వేల 411 అధిక్యత లో మంత్రి హరీష్ రావు ముందంజలో ఉన్నారు.

03 December 2023, 11:01 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: ఉమ్మడి వరంగల్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. 10 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, 02స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ముందంజలో ఉన్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. స్టేషన్ ఘనపూర్, జనగామలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థుల ఆధిక్యంలో ఉన్నారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెనుకబడ్డారు. వరంగల్ తూర్పులో మూడవ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్ పరిమితం అయ్యారు. మాజీ మంత్రి డోర్నకల్ అభ్యర్థి డీఎస్ రెడ్యా నాయక్ వెనుకంజలో ఉన్నారు. సీతక్క, కొండా సురేఖ ముందంజలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు.

03 December 2023, 10:48 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: మెదక్‌లో ఆధిక్యంలో మైనంపల్లి రోహిత్

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: మెదక్‌లో 5వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బిఆర్‌ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డికి 3137 ఓట్లు లభించాయి. మైనంపల్లి రోహిత్‌కు 4203 ఓట్లు లభించాయి. పంజా విజయ్ కుమార్‌కు 546 ఓట్లు దక్కాయి.5వ రౌండ్ ముగిసే వరకు మైనంపల్లి రోహిత్ రావు మెజార్టీ 4932గా ఉంది.

03 December 2023, 11:34 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: వేములవాడలో ఆధిక్యంలో కాంగ్రెస్

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: వేములవాడలో ఐదవ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్‌ అభ్యర్ధి 2841 అభ్యర్ధి ఆధిక్యతలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి 16,846ఓట్లు, బిఆర్‌ఎస్ అభ్యర్థికి 13645 ఓట్లు, బిజెపి అభ్యర్ధికి 10772ఓట్లు దక్కాయి.

03 December 2023, 10:38 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: సిరిసిల్లలో కేటీఆర్ ఆధిక్యం

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: సిరిసిల్లలో 4వ రౌండ్ 4 ఫలితాలలో మంత్రి కేటీఆర్ ఆధిక్యంలో ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ పార్టీకి 4026ఓట్లు, బీజేపీ అభ్యర్ధికి 847ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధికి 2898 ఓట్లు వచ్చాయి. బిఎస్పీ అభ్యర్ధికి 201 ఓట్లు వచ్చాయి. సిరిసిల్లలో కేటీఆర్‌ 3749 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.

03 December 2023, 10:32 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: బర్రెలక్కకు 424 ఓట్లు

కొల్లాపూర్‌లొో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కకు స్వల్ప ఓట్లు మాత్రమే దక్కాయి. రెండవ రౌండ్‌కు ఆమెకు 424 ఓట్లు లభించాయి.

03 December 2023, 10:29 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: చేవెళ్ల అప్డేట్స్

చేవెళ్ల అసెంబ్లీ ఓటింగ్ 3వ రౌం్‌ ముగిసే సమయానికి, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్యకు - 10430 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామేనా భీమ్ భారత్:- 8351ఓట్లు వచ్చాయి. బీజేపీ పార్టీ అభ్యర్థి కె ఎస్ రత్నంకు 4889 ఓట్లు వచ్చాయి. బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య 2079 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

03 December 2023, 10:22 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఆధిక్యం

కామారెడ్డి నియోజకవర్గంలో 4 వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 2004ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి 13,265 ఓట్లు, బిజేపికి 11,261 ఓట్లు, బిఆర్ఎస్‌కు 10,774 ఓట్లు లభించాయి. కామారెడ్డిలో సిఎం కేసీఆర్‌ బిఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తున్నారు.

03 December 2023, 10:15 IST

తెలంగాణ ఫలితాలు: ఇబ్రహీంపట్నంలో ఆధిక్యంలో కాంగ్రెస్

తెలంగాణ ఫలితాలు: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మూడవ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి 5800 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఉన్నారు.

03 December 2023, 10:09 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: కుమురం భీం జిల్లాలో ఫలితాలు

కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం రెండవ రౌండ్‌లో బిఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. బిఅరెస్ అభ్యర్ధికి 2764 ఓట్లు, బిజెపికి 6018ఓట్లు, బిఎస్పీ అభ్యర్థికి 755ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 307 ఓట్లు లభించాయి.

03 December 2023, 10:05 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: సిద్దిపేటలో హరీష్ రావు

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు ఆధిక్యంలో ఉన్నారు. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు కు రెండవ రౌండ్ లో 4313 అధిక్యత లభించింది.

03 December 2023, 11:34 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: ఆధిక్యంలో కాంగ్రెస్

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: బాల్కొండలో మూడో రౌండ్ ముగిసే సరికి వెయ్యి ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ ముందంజలో ఉన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి రెండవ స్థానానికి పడిపోయారు. మూడో స్థానంలో న్న బిజెపి అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ దేవి ఉన్నారు.

03 December 2023, 11:34 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: కాంగ్రెస్ పార్టీ జోరు

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ 666 ఓట్లతో ముందంజలో ఉన్నారు. బోథ్ BRS అనిల్ జాదవ్ 1210 ఓట్లతో ముందంజలో ఉన్నారు. నిర్మల్ BJP అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి 2500 ముందంజలో ఉన్నారు. ఖానాపూర్ కాంగ్రెస్ వెడ్మా బజ్జు ముందంజలో ఉన్నారు. ముథోల్ బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ముందంజలో ఉన్నారు. మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమసాగర్ రావు 3070 ఓట్ల ముందంజలో ఉన్నారు. బెల్లంపెల్లిలో వినోద్ 2600ఓట్ల ముందంజలో ఉన్నారు. చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ 3000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

03 December 2023, 11:34 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: ఆధిక్యంలో యశస్వినిరెడ్డి

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్ధి ముందంజలో ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి 738 ఓట్లతో ముందంజలో ఉన్నారు. మొదటి రౌండులో 11,262 ఓట్లకు ను కాంగ్రెస్ పార్టీ 6,000ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావుకు 5,262 ఓట్లు వచ్చాయి. పాలకుర్తిలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు మధ్య రసవత్తర పోరు కొనసాగుతోంది.

03 December 2023, 11:34 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: ఖమ్మంలో పువ్వాడ వెనుకంజ

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023: ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెనుకంజలో ఉన్నారు.

03 December 2023, 9:37 IST

Telangana Election 2023 Live Updates: నల్గొండ అప్డేట్స్

నల్లగొండలో కాంగ్రెస్ ఆధిక్యం లో నిలిచింది. తొలి రౌండ్ లో 4 వేల ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఉన్నారు. మిర్యాలగూడలో తొలి రౌండ్ లో 1500 ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఉన్నారు. నాగార్జున సాగర్‌లో తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి 3000 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. మునుగోడు రెండూ రౌండ్లు ముగిసే సారికి 2 వేల మెజారిటీ లో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు.

03 December 2023, 9:30 IST

Telangana Election Results 2023 Live Updates: గ్రేటర్‌లో బిఆర్‌ఎస్ ముందంజ

గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

03 December 2023, 9:29 IST

Telangana Election Results 2023 Live Updates: జగిత్యాలలో జీవన్ రెడ్డి

జగిత్యాల కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్ రెడ్డి ముందంజలో ఉన్నారు. కోరుట్ల లో మొదటి రౌండ్ లో బిఆర్ ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ ముందంజలో ఉన్నారు.

03 December 2023, 9:22 IST

Telangana Election Results 2023 Live Updates: పరిగి, వికారాబాద్, తాండూరులో కాంగ్రెస్ ఆధిక్యత

పరిగి, వికారాబాద్‌, తాండూరు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల హవా కొనసాగుతోంది.

03 December 2023, 9:19 IST

Telangana Election Results 2023 Live Updates: పాలేరులో పొంగులేటి ఆధిక్యం

ఖమ్మం జిల్లా పాలేరులో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 2330 ఓట్ల ఆధిక్యంలో పొంగులేటి ఉన్నారు.

03 December 2023, 11:34 IST

Telangana Election Results 2023 Live Updates: మిర్యాలగూడలో కాంగ్రెస్ ఆధిక్యం

మిర్యాలగూడ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్ధి బత్తుల లక్ష్మారెడ్డి 1500 ఆధిక్యంలో నిలిచారు. హుజూర్ నగర్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

03 December 2023, 9:11 IST

Telangana Election Results 2023 Live Updates: ఖైరతాబాద్‌లో దానం నాగేందర్

ఖైరతాబాద్‌లో దానం నాగేందర్ ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ లో 471 ఓట్ల ముందంజలో దానం నాగేందర్ ఉన్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి 3288 ఓట్లు, బిజెపి అభ్యర్థికి 2817 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 1482 ఓట్లు వచ్చాయి. 471 ఓట్ల ముందంజ లో BRS ఖైరతాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ ఉన్నారు.

03 December 2023, 9:08 IST

Telangana Election Results 2023 Live Updates: నల్లగొండలో మొదటి రౌండ్ ఫలితాలు

నల్గొండ నియోజకవర్గ మొదటి రెండు ఫలితాలలో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 6121 ఓట్లు, టిఆర్ఎస్ అభ్యర్ధి కంచల భూపాల్ రెడ్డి 2931 ఓట్లు, పిల్లి రామరాజు యాదవ్ 1594 ఓట్లను, బిజెపి మాధగోని శ్రీనివాస్ 344 ఓట్లు దక్కించుకున్నారు.

03 December 2023, 9:06 IST

Telangana Election Results 2023 Live Updates: కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం

తెలంగాణలో అందరి దృష్టిని ఆకర్షించిన కొల్లాపూర్‌ నియోజక వర్గంలొో కాంగ్రెస్ అభ్యర్ధి జూపల్లి కృష్ణారావు ఆధిక్యంలో ఉన్నారు. దాదాపు 1300ఓట్ల ఆధిక్యంలో జూపల్లి నిలిచారు. బర్రెలక్క పోటీతో కొల్లాపూర్ అందరి దృష్టిని ఆకర్షించింది.

03 December 2023, 9:05 IST

Telangana Election Results 2023 Live Updates: కామారెడ్డిలో కాంగ్రెస్ ఆధిక్యం

కామారెడ్డి నియోజకవర్గంలో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో నిలిచింది. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి 3647 ఓట్లు, బిఆర్ఎస్ అభ్యర్థికి 2603 ఓట్లు, బీజేపీకి 2666 ఓట్లు దక్కాయి.

03 December 2023, 9:03 IST

Telangana Election Results 2023 Live Updates: కాంగ్రెస్‌ ఆధిక్యం

నాగార్జున సాగర్, మిర్యాలగూడ, మధిరలో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నారు. నకిరేకల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం 2408 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. . ఆలేరు అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి రౌండ్లో 720 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి బీర్లు ఐలయ్య ఆధికయంలో ఉన్నారు. తుంగతుర్తి, నకిరేకల్ సెగ్మెంట్ లలో మందుల సామెల్, వేముల వీరేశం లీడ్‌లోఉన్నారు.

03 December 2023, 8:58 IST

Telangana Election Results 2023 Live Updates: ఖైరతాబాద్‌లో విజయారెడ్డి

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయా రెడ్డి ముందజలో ఉన్నారు.

03 December 2023, 8:56 IST

Telangana Election Results 2023 Live Updates: ​తెలంగాణలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

తెలంగాణలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో హోరా హోరీగా బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోటీ నెలకొంది. పోస్టల్ బ్యాలెంట్ ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కామారెడ్డిలో BJP అభ్యర్ధి లీడింగ్‌లో ఉన్నారు.

చాంద్రయణగుట్టలో అక్బరుద్దీన్ ముందంజలో ఉన్నారు. మధిరలో మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర రావు ఆధిక్యంలో ఉన్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు (కాంగ్రెస్) ముందంజలో ఉన్నారు. బెల్లంపల్లిలో గడ్డం వినోద్ (కాంగ్రెస్) ముందున్నారు. ఖమ్మం పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 10 కి 10 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలొ ఉన్నారు.

03 December 2023, 8:52 IST

Telangana Election Results 2023 Live Updates: ఆశ్వారావుపేట, ఇల్లెందులో కాంగ్రెస్ ఆధిక్యం

ఆశ్వారావుపేట, ఇల్లెందులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. 1748ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ ఆధిక్యంలో ఉన్నారు. పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మధిరలో మల్లు భట్టివిక్రమార్క, వైరాలో మాలోత్ రాందాసు, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు.

03 December 2023, 8:50 IST

Telangana Election Results 2023 Live Updates: నల్గొండలో ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. 10 స్థానాలలో పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది.

03 December 2023, 8:49 IST

Telangana Election Results 2023 Live Updates: నల్గొండలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్స్ వివరాలు...

నల్గొండ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....4619

దేవరకొండ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....1424

మిర్యాలగూడ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....2569

మునుగోడు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....1494

నకిరేకల్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....1910

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....1958.

సూర్యాపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....3153

కోదాడ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...2638

హుజూర్నగర్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....2143

తుంగతుర్తి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....1530

భువనగిరి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1031

ఆలేరు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1132

03 December 2023, 8:48 IST

Telangana Election Results 2023 Live Updates: కామారెడ్డిలో బీజేపీ ఆధిక్యం

కామారెడ్డిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డి ముందంజలో ఉన్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నారు.

03 December 2023, 8:44 IST

Telangana Election Results 2023 Live Updates: పోస్టల్‌ బ్యాలెట్లలో కాంగ్రెస్ ఆధిక్యం

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. బిఆర్ఎస్ - 28 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 44 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. బిజేపి - 2 స్థానాల్లో ముందున్నారు.

03 December 2023, 8:40 IST

Telangana Election Results 2023 Live Updates: ఖమ్మం అప్డేట్స్‌

ఖమ్మంలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల ముందంజలో ఉన్నారు. మధిర లో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్ధి భట్టి విక్రమార్క ముందంజలో ఉన్నారు. పాలేరు లో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందున్నారు.

03 December 2023, 8:39 IST

Telangana Election Results 2023 Live Updates: చాంద్రాయణ గుట్టలో

చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు.

03 December 2023, 8:37 IST

Telangana Election Results 2023 Live Updates: హుజుర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ ముందంజ

హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో.. పోస్టల్ బ్యాలెట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

03 December 2023, 8:36 IST

Telangana Election Results 2023 Live Updates: ఖమ్మంలో భట్టి ముందంజ

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు లో తుమ్మల ముందంజలో ఉన్నారు. మధిర పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు లో భట్టి విక్రమార్క ముందంజలో ఉన్నారు.

03 December 2023, 8:17 IST

Telangana Election Results 2023 Live Updates పోస్టల్‌లో బండి సంజయ్ ముందంజ

తెలంగాణ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కరీంనగర్‌లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పోస్టల్‌ ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు.

03 December 2023, 8:06 IST

Telangana Election Results Live Updates 2023: తొలి ఫలితం నారాయణపేటదే

ఉమ్మడి జిల్లాలో అతి తక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసిన నారాయణపేట ఫలితం 11:30లోగా వచ్చే అవకాశముంది. ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్ధులు మాత్రమే బరిలో ఉన్నారు. 270 పోలింగ్ స్టేషన్లలో 1,81,708 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తక్కువ మంది అభ్యర్థులు ఉండటంతో లెక్కింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని, 11:30 గంటల లోపు ఫలితం వచ్చే అవకాశముంది. కల్వకుర్తి, గద్వాల ఫలితం సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది.

03 December 2023, 8:05 IST

Telangana Election Results Live Updates 2023: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో మొదలు

తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ ఓట్లు, సర్వీస్ ఓట్లు లెక్కింపుతో తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 8.30వరకు పోస్టల్ ఓట్లను లెక్కించనున్నారు.

03 December 2023, 8:00 IST

Telangana Election Results Live Updates 2023: తెలంగాణ ఓట్ల లెక్కింపు ప్రారంభం

తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోట్ల బ్యాలెట్ల లెక్కింపును రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ సెంటర్లలో ప్రారంభించారు. తెలంగాణలో 49 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపు 15 నిమిషాల సమయం పడుతుంది.

03 December 2023, 7:50 IST

Telangana Election Results Live Updates 2023: హైదరాబాద్‌కు కాంగ్రెస్ పరిశీలకులు

నాలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ పరిశీలకులను నియమించింది. తెలంగాణకు డీకే శివకుమార్, దీపాదాస్ మున్నీ, అజోయ్‍కుమార్, మురళీధరణ్, కె.జె.జార్జ్ నియామించారు. ఇప్పటికే వీరంతా హైదరాబాద్‌ చేరుకున్నారు.

03 December 2023, 7:16 IST

Telangana Election Results Live Updates 2023: జూబ్లిహిల్స్‌లో 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

తెలంగాణలో అత్యధికంగా జూబ్లీహిల్స్ లో 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. అత్యల్పంగా భద్రాచలంలో 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలంగాణ లో మొత్తం ఓట్ల సంఖ్య 3,26, 02,793 ఉండగా ఓటు హక్కు వినియోగించుకున్న 2,32,59,256 మంది ఓటర్లు వినియోగించుకున్నారు.

03 December 2023, 7:14 IST

Telangana Election Results Live Updates 2023: మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం

మరికాసేపట్లో తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 71.34 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. - రాష్ట్రంలో మునుగోడులో 91.89 శాతం పోలింగ్ నమోదవగా, అత్యల్పంగా యాకుత్‌పురలో 39.64 శాతం పోలింగ్ నమోదైంది. నేడు 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.

03 December 2023, 7:13 IST

Telangana Election Results Live Updates 2023: హైదరాబాద్ చేరుకున్న డికె శివకుమార్

కర్ణాటక డిప్యూటీ సిఎం డీకే శివకుమార్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. అంతా గెలుస్తారని అంటున్నా, గెలిచే అవకాశాలు మాకే ఉన్నాయని చెప్పారు. ఈసారి తెలంగాణలో ప్రజలు ఆశీర్వదిస్తారనే ఆశతో ఉన్నామని, తమకు ఎలాంటి ఆపరేషన్ భయం లేదని చెప్పారు.

03 December 2023, 6:39 IST

Telangana Election Results Live Updates 2023: కీలక నేతలతో రాహుల్‌ మీటింగ్‌

ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వర్చువల్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ భేటీలో టీపీసీసీ ముఖ్య నేతలు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కర్ణాటక మంత్రులు జార్జి, బోసురాజు, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, పరిశీలకులు పాల్గొన్నారు.

03 December 2023, 7:22 IST

Telangana Election Results Live Updates 2023: రంగంలోకి కాంగ్రెస్ కీలక నేతలు

ఓట్ల లెక్కింపు వేళ తెలంగాణ వ్యవహారాల బాధ్యతను కర్ణాటక ఉపముఖ్యమంత్రి, 'ట్రబుల్‌ షూటర్‌' డి.కె. శివకుమార్‌కు అప్పగించింది. ఆయనకు తోడుగా పలువురు కర్ణాటక మంత్రులు, కొందరు ఏఐసీసీ కీలక నేతలు ఆపరేషన్‌లో పాలుపంచుకోనున్నారు. కర్ణాటక మంత్రులు జార్జి, బోసురాజు శనివారం మధ్యాహ్నానికే హైదరాబాద్‌ చేరుకోగా డి.కె.శివకుమార్‌ రాత్రికి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ ఆపరేషన్‌ కోసం రెండు ప్లాన్‌లను ఏఐసీసీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

03 December 2023, 6:34 IST

పోస్టల్‌ బ్యాలెట్లకు ప్రత్యేక ఏర్పాట్లు

ఈ దఫా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 500 ఓట్లకు ఒకటి చొప్పున మొత్తం 131 టేబుళ్లను ఏర్పాటుచేశారు. ఈవీఎంల కౌంటింగ్‌ పూర్తయ్యేలోగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకుంటే, చివరి రౌండ్‌ ఈవీఎంల లెక్కింపును నిలిపివేసి, పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపును పూర్తిచేయాలని, ఆ తర్వాతే చివరి రౌండ్‌ ఈవీఎంల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

03 December 2023, 6:14 IST

భారీగా నగదు స్వాధీనం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసులు భారీగా నగదు సీజ్ చేశారు. మొత్తం 469.63 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 09 అక్టోబర్, 2023 నుండి 1 డిసెంబర్, 2023 6AM వరకు 11,859 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 2018 ఎన్నికల్లో రూ. 103 కోట్ల విలువైన నగదు మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అంకితభావంతో కూడిన అధికారుల సమూహంలో సభ్యుడిగా ఉన్నందుకు గర్విస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు.

03 December 2023, 7:04 IST

గ్రేటర్ హైదరాబాద్‌ వరించేది ఎవరినో…

రాజధానిలో ఎక్కువ సీట్లు గెలుస్తామని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార పీఠం అందుకోవాలంటే హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న 29 నియోజకవర్గాలు కీలకం కానున్నాయి.. హైదరాబాద్‌ జిల్లాలో 15, మేడ్చల్‌ 5, రంగారెడ్డి జిల్లాలో 8, పటాన్‌చెరు నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఎవరికి ఆధిక్యం వస్తుందనేది ఉత్కంఠగా మారింది. పలు నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు, కొన్నిచోట్ల చతుర్ముఖ పోరు ఉండటంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

03 December 2023, 5:55 IST

ఈవిఎంలలో అభ్యర్థుల భవితవ్యం

రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌కేంద్రాల్లో గత నెల 30న పోలింగ్‌ పూర్తికాగా, 119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు తమ భవితవ్యం కోసం ఎదురుచూస్తున్నారు. భద్రాచలం 13, అశ్వారావుపేటలో 14, చార్మినార్‌లో 15, ఆర్మూర్‌లో 16 రౌండ్లలో కౌంటింగ్‌ జరుగుతుంది.

03 December 2023, 5:54 IST

12తర్వాత తొలి ఫలితం

మధ్యాహ్నం ఒంటి గంటకు తొలి ఫలితం రానుంది. సాయంత్రానికి పూర్తిస్థాయిలో ఫలితాలు వెల్లడవుతాయని ఎన్నికల అధికారులు తెలిపారు. మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, ఎల్బీనగర్‌, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాల్లో 28 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. మిగిలిన చోట్ల 14, 20 చొప్పున ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా, యాకుత్‌పురా, కరీంనగర్‌, ఇబ్రహీంపట్నం తదితర నియోజకవర్గాల్లో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనున్నది

03 December 2023, 7:04 IST

ఆ తర్వాతే చివరి రౌండ్ లెక్కింపు

ఈసారి పోస్టల్‌ బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేశారు. 500 ఓట్లకు ఒకటి చొప్పున మొత్తం 131 టేబుళ్లను ఏర్పాటుచేశారు. ఈవీఎంల కౌంటింగ్‌ పూర్తయ్యేలోగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకుంటే, చివరి రౌండ్‌ ఈవీఎంల లెక్కింపును నిలిపివేసి, పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపును పూర్తిచేయాలని, ఆ తర్వాతే చివరి రౌండ్‌ ఈవీఎంల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

03 December 2023, 7:04 IST

ప్రతి టేబుల్‌కు ప్రత్యేక సిబ్బంది

ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌ (గెజిటెడ్‌ ఆఫీసర్‌, లేక ఆ సమాన హోదాగల అధికారి), ఒక కౌంటింగ్‌ అసిస్టెంట్‌, కౌంటింగ్‌ సిబ్బంది, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కోసం టేబుళ్ల వద్ద ఒక సహాయక రిటర్నింగ్‌ అధికారి, ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌ (గెజిటెడ్‌ ఆఫీసర్‌, లేక ఆ సమాన హోదాగల అధికారి), ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లు (గెజిటెడ్‌ ఆఫీసర్‌, లేక ఆ సమాన హోదాగల అధికారి), ఒక మైక్రో అబ్జర్వర్‌ చొప్పున నియమించారు.

03 December 2023, 5:50 IST

మూడంచెల భద్రత ఏర్పాటు

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటుచేయడంతో పాటు అభ్యర్థులు, ఏజెంట్లు సహా పాస్‌లు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఇతరుల ప్రవేశంపై నిషేధం విధించారు. అలాగే, అగ్గిపెట్టె, ఆయుధాలు, పేలుడు పదార్థాలను కౌంటింగ్‌ కేంద్రాల్లోకి నిషేధించారు. మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లనూ నిషేధించారు.

03 December 2023, 7:04 IST

మొదట పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు

కౌంటింగ్‌ ప్రారంభమైన మొదటి అరగంటలో పోస్టల్‌, సర్వీస్‌ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంల ఓట్ల కౌంటింగ్‌ చేపడతారు. ఒక్కో రౌండ్‌ లెక్కింపు పూర్తికాగానే, ఫలితాన్ని ధ్రువీకరణ కోసం పంపుతారు. అనంతరం ఆర్వో ఆధ్వర్యంలో రౌండ్ల వారీగా మీడియాకు ఫలితాలు ప్రకటిస్తారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే సరిచేసేందుకు అన్ని పోలింగ్‌ కేంద్రాలవద్ద టెక్నికల్‌ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేశారు.

03 December 2023, 7:04 IST

తొలి ఫలితాలు అక్కడే

ఓట్ల లెక్కిపులో తొలి ఫలితాలు అక్కడే వెలువడ నున్నాయి. అతితక్కువ ఓటర్లు, తక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచితొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉన్నది. అత్యధిక పోలింగ్‌ కేంద్రాలు, ఎక్కువ ఓటర్లున్న శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల ఫలితం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాాి. భద్రాచలంలో 13, అశ్వారావుపేటలో 14, చార్మినార్‌లో 15, ఆర్మూర్‌లో 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి