తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Adilabad Loksabha: ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్ధిని ఖరారు చేయని కాంగ్రెస్... ప్రచారం ప్రారంభించిన బీఆర్‌ఎస్‌, బీజేపీ

Adilabad loksabha: ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్ధిని ఖరారు చేయని కాంగ్రెస్... ప్రచారం ప్రారంభించిన బీఆర్‌ఎస్‌, బీజేపీ

HT Telugu Desk HT Telugu

26 March 2024, 8:17 IST

    • Adilabad loksabha: ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎవరో ఇంకా కొలిక్కి రాలేదు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై స్పష్టత రావడంతో ప్రచారం ప్రారంభించారు. 
ఆదిలాబాద్‌లో కొలిక్కి రాని కాంగ్రెస్ అభ్యర్ధి...
ఆదిలాబాద్‌లో కొలిక్కి రాని కాంగ్రెస్ అభ్యర్ధి...

ఆదిలాబాద్‌లో కొలిక్కి రాని కాంగ్రెస్ అభ్యర్ధి...

Adilabad loksabha: ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అభ్యర్థి ఎంపికను ఇప్పటికే బిఆర్‌ఎస్ BRS, బిజెపి BJP లు పూర్తి చేశాయి.

ట్రెండింగ్ వార్తలు

SIT On AP Poll Violence : ఏపీలో హింసాత్మక ఘటనలపై ‘సిట్‌’ ఏర్పాటు - 2 రోజుల్లో నివేదిక..!

PM Modi: ‘బుల్డోజర్ ను ఎప్పుడు, ఎలా వాడాలో యోగిని చూసి నేర్చుకోండి’: ప్రధాని మోదీ

CBN and Sajjala: అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు సజ్జల.. అధికారంలో ఉన్నపుడు ఇద్దరిదీ ఒకటే రాగం

Transfers in AP : ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ - పల్నాడు కలెక్టర్ బదిలీ, పలువురు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు

గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు సీనియర్ నాయకులను ఎన్నికల్లో పోటీలోకి దింపారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ Congress పార్టీ నుండి అభ్యర్థి పేరును ఇంకా ప్రకటించలేదు.

హైదరాబాద్ సెగ్మెంట్లో గత అసెంబ్లీ ఫలితాలను పరిశీలిస్తే నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. దీంతో సిట్టింగ్ ఎంపీ బీజీపీ స్థానం కావడంతో ఆదిలాబాదులో Adilabad ఎలాగైనా పాగా వేయాలని బిజెపి తీవ్రంగా కృషి చేస్తోంది. గోండు సామాజిక వర్గానికి చెందిన ఓట్లను కైవసం చేసుకునేందుకు గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన మాజీ ఎంపీ గడం నగేష్‌ను బరిలోకి దింపారు.

గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆశీర్వాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు టిఆర్ఎస్ టికెట్ కట్టబెట్టింది, బి ఆర్ ఎస్, బిజెపి ఇరు పార్టీలు ఆదివాసులకి టికెట్ ఇవ్వడంతో అధికార కాంగ్రెస్ సైతం ఆదివాసులకు టికెట్ ఇవ్వాలని యోచిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం సుమారు 42 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా అందులో కేవలం ప్రస్తుతం ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, ఆత్రం సుగుణ, లంబాడ సామాజిక వర్గం నుండి రేఖ నాయక్, డాక్టర్ సుమలత, ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్ , గడ్డం వంశీ లు పరిశీలనలో ఉన్నారు.

ఆదివాసీ.... లంబాడాలో ఎవరికి దక్కేను…

తెలంగాణలో ఎస్టీ రిజర్వ్ స్థానాలైన మహబూబ్ బాద్, అదిలాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులు ఎంపిక కోసం షెడ్యూల్ విడుదల కంటే ముందే పీసీసీ ఆచితూచి వ్యవహరిస్తోంది.

ఒకచోట లంబాడిలకు చోటు కల్పిస్తే మరోచోట ఆదివాసులకు ఇవ్వాలని ముందే నిర్ణయించినట్లు తెలుస్తుంది. మహబూబాబాద్ టికెట్ లంబాడ తెగ కు చెందిన మాజీ మంత్రి బలరాం నాయక్ ఇచ్చారు. ఆదిలాబాద్‌ స్థానాన్ని ఆదివాసులకే కేటాయించడానికి కాంగ్రెస్ సన్నద్ధం చేస్తుంది.

కాంగ్రెస్ తరపున ముందుగా డా. సుమలత పేరును పరిశీలించినా తాజాగా ఆత్రం సుగుణ, ఆత్రం భాస్కర్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయనే ఆలోచన చివరి నిమిషంలో పీసీసీలో చర్చకు వచ్చింది.

బీజేపీ అభ్యర్థి గోడం నగేష్, బిఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు ఆదివాసీలే కావ డంతో కాంగ్రెస్ నుంచి ఆదివాసీనే నిలిపితే పార్టీలో లంబాడీల నుంచి వ్యతిరేకత వస్తే ఎలా? అనే ఓ ఆలోచన ఊగిసలాటకు కారణమైంది. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని దక్కించుకోవాలని మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఈ విషయాన్ని పీసీసీ బాధ్యులు ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆదిలాబాద్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. వెనుకాముందు ఆలోచించకుండా వెంటనే అభ్య ర్థిని ప్రకటించటం కంటే అలోచించి నిర్ణయం తీసుకోవాలని మరొక రెండు రోజులు వాయిదా వేయాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. దీనికి అనుగుణంగానే ఏఐసీసీ ఆదిలాబాద్ అభ్యర్థిని వెల్లడించలేదని తెలిసింది.

రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి

తదుపరి వ్యాసం