తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Hyderabad Leaders : పల్లె నుంచి పట్టణానికి... ఈ నేతల రాజకీయ జీవితానికి హైదరాబాదే పునాది

Hyderabad Leaders : పల్లె నుంచి పట్టణానికి... ఈ నేతల రాజకీయ జీవితానికి హైదరాబాదే పునాది

HT Telugu Desk HT Telugu

08 November 2023, 11:50 IST

    • Telangana Assembly Election 2023: వేర్వురు ప్రాంతాలకు చెందిన చాలా మంది హైదరాబాద్ లో నివసిస్తుంటారు. తమ నచ్చిన రంగాల్లో పని చేస్తూ… ఉన్నతమైన స్థితికి చేరుకున్న వాళు చాలా మందే ఉంటారు. ఇక రాజకీయాల విషయానికొస్తే… చాలా మంది నేతల ప్రస్థానం హైదరాబాద్ నుంచే మొదలైన వారు ఉన్నారు. 
పల్లె నుంచి పట్టణానికి... ఈ నేతల రాజకీయ జీవితానికి హైదరాబాదే  పునాది
పల్లె నుంచి పట్టణానికి... ఈ నేతల రాజకీయ జీవితానికి హైదరాబాదే పునాది

పల్లె నుంచి పట్టణానికి... ఈ నేతల రాజకీయ జీవితానికి హైదరాబాదే పునాది

Telangana Assembly Election 2023: భిన్న భాషలు,సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమే హైదరాబాద్ మహానగరం.దేశ నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్ కు వచ్చి స్థిర పడుతుంటారు.విద్య,ఉద్యోగ,ఉపాధి అవకాశాలకు వచ్చినవారిని హైదరాబద్ మహా నగరం అక్కున చేర్చుకుంటూ ఉంటుంది.వీటితో పాటు ప్రజల మనసులను గెలిచిన వారిని రాజకీయ వేదికలపై నాయకులుగా ఆదరిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

SIT On AP Poll Violence : ఏపీలో హింసాత్మక ఘటనలపై ‘సిట్‌’ ఏర్పాటు - 2 రోజుల్లో నివేదిక..!

PM Modi: ‘బుల్డోజర్ ను ఎప్పుడు, ఎలా వాడాలో యోగిని చూసి నేర్చుకోండి’: ప్రధాని మోదీ

CBN and Sajjala: అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు సజ్జల.. అధికారంలో ఉన్నపుడు ఇద్దరిదీ ఒకటే రాగం

Transfers in AP : ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ - పల్నాడు కలెక్టర్ బదిలీ, పలువురు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు

కుల, మత, ప్రాంత విభేదాలకు అతీతంగా ఇక్కడి ప్రజలు ఎంతో మంది నాయకులకు జేజేలు కొడుతూ చట్ట సభలకు పంపారు. అలా నగరం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కొందరు నేతలు ఎమ్మెల్యేగా విజయం సాధించి ముఖ్యమంత్రులుగా,కేంద్ర మంత్రులు గా,రాష్ట్ర మంత్రులుగా పని చేశారు.వివిధ ప్రాంతాల్లో జన్మించి నగరంలోని వివిధ నియోజికవర్గాల నుంచి ఎదిగిన నేతలు వీరే….

• మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి స్వస్థలం వికారాబాద్ జిల్లా మర్పల్లి.ఈయన 1978 లో మేడ్చల్,1989 లో సనత్ నగర్ నుంచి గెలుపొందారు.

• లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ మహారాష్ట్రలో జన్మించారు.ఈయన 2014 లో కూకట్ పల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

• 1952 లో ముషిరా బాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన జీఎస్ మెల్కోటి ఒడిశాలోని బరంపర ప్రాంతానికి చెందిన వారు. అయన హైదరాబాద్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పని చేశారు.

• గంగాపురం కిషన్ రెడ్డి సొంతూరు రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్.అయన 2009,2014లో అంబర్ పేట్ నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు.2019 లో సికింద్రాబాద్ ఎంపిగా గెలిచి అనంతరం కేంద్ర పర్యాటక మంత్రి పదవిని అధిరోహించారు.

• తెలంగాణ తొలి హాం మంత్రిగా పని చేసిన నాయిని నర్సింహారెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా నేరెడుగొమ్ము. ఆయన 1985,2004 లో ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

• ఇటీవలే త్రిపుర గవర్నర్ గా నియమితులు అయిన నాల్లు ఇంద్రసేనారెడ్డి స్వస్థలం సూర్యాపేట జిల్లా గానుబండ వాసి. 1983,1985,1999 ఎనికల్లో మలక్ పేట్ ఎమ్మెల్యేగా గెలిచారు.

• బీసీ నేత,ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అర్.కృష్ణయ్య 2014 ఎన్నికల్లో ఎల్ బి నగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయన సొంతూరు వికారాబాద్ జిల్లా రల్లగుడు పల్లి.

• మైనంపల్లి హన్మంతరావు ఈయన స్వస్థలం మెదక్ జిల్లా కొర్వి పల్లి.ఈయన 2018 లో మల్కాజ్ గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

• తూళ్ళ దేవేందర్ గౌడ్ స్వస్థలం మహేశ్వరం మండలం తుక్కుగూడ. టీడీపీ హయాంలో ఈయన మంత్రిగా,కేంద్రమంత్రిగా పని చేశారు. దేవేందర్ గౌడ్ మేడ్చల్ నుంచి 1994,1999,2004 లో ఎమ్మెల్యే వా విజయం సాధించారు.

• 2009 లో సికింద్రబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు సినీనటి జయసుధ.ఈమె స్వస్థలం మద్రాసు.

రిపోర్టర్: కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం