తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp New Feature: ఇక ఫార్వార్డ్‌లకు క్యాప్షన్ ఇవ్వొచ్చు..

WhatsApp new feature: ఇక ఫార్వార్డ్‌లకు క్యాప్షన్ ఇవ్వొచ్చు..

HT Telugu Desk HT Telugu

21 October 2022, 14:04 IST

    • వాట్సాప్ యూజర్లు ఇప్పుడు ఇక మల్టీమీడియా కంటెంట్ ఫార్వార్డ్ చేసినప్పుడు క్యాప్షన్ కూడా ఇవ్వొచ్చు.
వాట్సాప్
వాట్సాప్ (HT_PRINT)

వాట్సాప్

WhatsApp new feature: ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఇక వీడియోలు, ఫోటోలు, జిఫ్ ఫైల్స్ వంటివి ఫార్వార్డ్ చేసినప్పుడు వాటికి క్యాప్షన్ ఇచ్చే సౌలభ్యాన్ని కల్పిస్తూ ఒక కొత్త ఫీచర్‌ను రూపకల్పన చేస్తోంది.

ప్రస్తుతం మనం ఏదైనా ఫార్వార్డ్ చేసినప్పుడు దానికి క్యాప్షన్ ఇచ్చే సౌకర్యం లేదు. కేవలం వచ్చిన కంటెంట్‌ను వీడియో అయినా, ఫోటోలైనా ఫార్వార్డ్ చేయొచ్చ గానీ, దానికి కాప్షన్ ఇవ్వలేం. కొత్త ఫీచర్ ద్వారా వేరొకరికి కానీ, గ్రూపు‌నకు గానీ ఫార్వార్డ్ చేసినప్పుడు వీడియోలు, ఫోటోలకు క్యాప్షన్ ఇవ్వొచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలో ఉంది. కొద్ది మంది బీటా టెస్టర్స్‌కు అందుబాటులో ఉంది. త్వరలోనే బీటా వర్షన్‌గా రానుంది.

WABetaInfo షేర్ చేసిన స్క్రీన్ షాట్ల ప్రకారం యూజర్లు ఒక వీడియో గానీ, ఫోటో గానీ ఫార్వార్డ్ చేసినప్పుడు కొత్త ఇంటర్‌ఫేస్ ప్రత్యక్షమై సదరు ఫార్వార్డ్ కంటెంట్‌కు క్యాప్షన్ ఇస్తారా? అని అడుగుతుంది. సదరు మల్టీమీడియా కంటెంట్‌కు క్యాప్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇంటర్‌ఫేస్ ప్రత్యక్షమై యూజర్లను అడుగుతుంది. ఆ క్యాప్షన్‌ తొలగించేందుకు కూడా యూజర్లను అనుమతిస్తుంది. దిగువన ఉన్న డిస్మిస్ బటన్ నొక్కడం ద్వారా క్యాప్షన్ తొలగించవచ్చు.

వాట్సాప్ ఇటీవలే కొత్తగా కాల్ లింక్ ఫీచర్‌ను కూడా ప్రారంభించింది. యూజర్లు ఒక వీడియో లేదా ఆడియో కాల్ లింక్ తయారు చేసి ఇతరులతో పంచుకునేందుకు అనుమతిస్తుంది. వాట్సాప్‌పై లేనివారికి కూడా దీనిని షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. అయితే వాట్సాప్ లేని వారు దానిని డౌన్ లోడ్ చేసి ఆ పై కాల్ లో జాయిన్ అవ్వొచ్చు.

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ విండోస్ యూజర్లకు మరో ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెస్తోంది. వాయిస్ నోట్స్‌ను స్పీడప్ చేసేందుకు విండోస్ బీటా యూజర్స్‌కు అనుమతిస్తుంది. విండోస్ బీటా యూజర్లు ఆ ఆడియో మెసేజ్‌ను 1.5 లేదా 2 రెట్ల వేగంతో వినవచ్చు.

ఈ ఫీచర్ ప్రస్తుతం మీ వాట్సాప్‌లో అందుబాటులో ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. ఒక వాయిస్ నోట్‌ను ప్లే చేసి చూస్తే అందులో వేగానికి సంబంధించి కంట్రోల్స్ కనిపిస్తాయి. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆధారిత మొబైల్ యూజర్లకు అందుబాటులో ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం