తెలుగు న్యూస్  /  బిజినెస్  /  What Is Spacefiber: స్పేస్ ఫైబర్ ను ప్రారంభించిన రిలయన్స్ జియో.. ఇంతకీ ఏంటీ స్పేస్ ఫైబర్?

What is SpaceFiber: స్పేస్ ఫైబర్ ను ప్రారంభించిన రిలయన్స్ జియో.. ఇంతకీ ఏంటీ స్పేస్ ఫైబర్?

HT Telugu Desk HT Telugu

27 October 2023, 14:13 IST

  • What is SpaceFiber?: రిలయన్స్ జియో శుక్రవారం స్పేస్ ఫైబర్ (SpaceFiber) ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. మూడు రోజుల పాటు జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (India Mobile Congress IMC) లో జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు.

స్పేస్ ఫైబర్ గురించి ప్రధాని మోదీకి వివరిస్తున్న జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ
స్పేస్ ఫైబర్ గురించి ప్రధాని మోదీకి వివరిస్తున్న జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ

స్పేస్ ఫైబర్ గురించి ప్రధాని మోదీకి వివరిస్తున్న జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ

What is SpaceFiber?: ఢిల్లీలో శుక్రవారం ఇండియా మొబైల్ కాంగ్రెస్ (India Mobile Congress (IMC) ప్రారంభమైంది. ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది మూడు రోజుల పాటు జరుగుతుంది. ఈ ఐఎంసీ లో రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ స్పేస్ ఫైబర్ (SpaceFiber) వివరాలను ప్రధాని మోదీకి వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

స్పేస్ ఫైబర్

ఈ ఐఎంసీ (IMC) లో రిలయన్స్ జియో (Reliance Jio) తమ లేటెస్ట్ ఎడిషన్ రిలయన్స్ జియో స్పేస్ ఫైబర్ (JioSpaceFiber) ను ప్రారంభించింది. ఇది ఉపగ్రహ ఆధారిత గిగాబైట్ బ్రాడ్ బాండ్ సర్వీస్. దీని ద్వారా ఇప్పటివరకు ఇంటర్నెట్ సేవలు అందని ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలను అందించే అవకాశం ఉంటుంది. భారత్ లో ఇదే తొలి ఉపగ్రహ ఆధారిత గిగాబైట్ బ్రాడ్ బాండ్ సర్వీస్. ‘డిజిటల్ సొసైటీలో ప్రజలందరినీ భాగస్వామ్యులను చేసే లక్ష్యంతో ఈ స్పేస్ ఫైబర్ ను ప్రారంభించామని ఆకాశ్ అంబానీ తెలిపారు. ప్రభుత్వ సేవలకు, విద్య, వైద్యం, వినోదం.. తదితర రంగాలకు ఈ స్పేస్ ఫైబర్ సేవలను అందిస్తుందన్నారు. దీని ద్వారా ఇప్పటివరకు ఇంటర్నెట్ పరిథిలోకి రాని లక్షలాది మంది ఈ నెట్ వర్క్ లోకి వస్తారన్నారు.

పూర్తి వివరాలు..

  • స్పేస్ ఫైబర్ అనేది సాటిలైట్ బేస్డ్ ఫాస్ట్ ఇంటర్నెట్ సర్వీస్. దీనిద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా అందించవచ్చు.
  • ప్రస్తుతం జియో బ్రాండ్ బ్యాండ్ సేవలను అందిస్తున్న జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ లకు ఇది అదనం.
  • ఈ ప్రాజెక్ట్ కోసం జియో లక్సెంబర్గ్ కు చెందిన ఎస్ఈఎస్ (SES) అనే సాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొవైడర్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
  • ఎస్ఈఎస్ (SES) కు చెందిన ఓ3బీ (O3b), న్యూ ఓ3బీ (new O3b) ఎంపవర్ సాటిలైట్ సేవలను జియో ఉపయోగించుకుంటుంది. తద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా 5 జీ సేవలను అందించడం సాధ్యమవుతుంది.
  • ప్రస్తుతం గుజరాత్ లోని గిర్, చత్తీస్ గఢ్ లోని కోర్బా, ఒడిశాలోని నబరంగ్ పూర్, అస్సాంలోని ఓఎన్జీసీ జోర్హాట్ ల్లో జియో స్పేస్ ఫైబర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా చవకగా ఈ సేవలను జియో అందుబాటులోకి తీసుకురానుంది.

తదుపరి వ్యాసం