తెలుగు న్యూస్  /  బిజినెస్  /  5.5-inch Screens Mobile Phone: చిన్న స్క్రీన్ తో ‘ప్యాకెట్’ ఫ్రెండ్లీ ఫోన్స్

5.5-inch screens mobile phone: చిన్న స్క్రీన్ తో ‘ప్యాకెట్’ ఫ్రెండ్లీ ఫోన్స్

HT Telugu Desk HT Telugu

05 January 2023, 20:44 IST

  • స్క్రీన్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల ఉపయోగాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. పెద్ద సైజ్ స్మార్ట్ ఫోన్ ప్యాకెట్లో సరిగ్గా అడ్జస్ట్ కాదు. బ్యాటరీ కన్సప్షన్ ఎక్కువ. చేయి జారి కింద పడే అవకాశాలు ఎక్కువ. అందువల్ల చాలామంది 5.5 ఇంచెస్ స్క్రీన్ సైజ్ మొబైల్ ఫోన్స్ ను ఇష్టపడుతుంటారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అందువల్ల చాలా స్మార్ట్ ఫోన్ కంపెనీలు 5.5 అంగుళాల స్క్రీన్ సైజ్ తో మొబైల్ ఫోన్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. యాపిల్ ఐ ఫోన్ స్క్రీన్ సైజ్ ఇటీవలి వరకు 5.5 ఇంచెస్ గానే ఉండేది. 5.5 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Apple iPhone 12 Mini: యాపిల్ ఐ ఫోన్ 12 మిని

ఇది యాపిల్ ప్రొడక్ట్.స్క్రీన్ సైజ్ 5.4 అంగుళాలు. 1080 x 2340 పిక్సెల్ OLED Display ఉంటుంది. ఇందులో యాపిల్ ఏ 14 బయోనిక్ ప్రాసెసర్ (A14 Bionic Processor) ను అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్ ఐఓఎస్ వీ 14 ఆపరేటింగ్ సిస్టమ్(iOS v14 OS) పై పని చేస్తుంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఉంటుంది. 12 + 12 MP Dual Rear Camera; 12 MP Front Camera సెటప్ ఉంది. 2227 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో పొందుపర్చారు.

Apple iPhone 13 Mini: ఐఫోన్ 13 మిని

ఇది కూడా యాపిల్ ప్రొడక్ట్. ఐ ఫోన్ 13లో ఉన్న అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని స్క్రీన్ సైజ్ 5.4 అంగుళాలు. 1080 x 2340 పిక్సెల్ OLED Display ఉంటుంది. ఇందులో యాపిల్ ఏ 15 బయోనిక్ ప్రాసెసర్ (A15 Bionic Processor) ను అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్ ఐఓఎస్ వీ 15 ఆపరేటింగ్ సిస్టమ్(iOS v15 OS) పై పని చేస్తుంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. 12 + 12 MP Dual Rear Camera; 12 MP Front Camera సెటప్ ఉంది. 2406 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో పొందుపర్చారు.

Reliance JioPhone Next: రిలయన్స్ జియో ఫోన్ నెక్స్ట్

రిలయన్స్ జియో, గూగుల్ ల భాగస్వామ్యంలో వచ్చిన అద్భుతమైన ఫోన్ ఇది. దీని స్క్రీన్ సైజ్ 5.45 అంగుళాలు. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే(IPS LCD Display). పర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్ (Qualcomm Snapdragon 215 Processor) ను అమర్చారు. ఇది ప్రగతి ఓఎస్ (Pragat) పై పని చేస్తుంది. ఇందులో 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి.

Google Pixel 3: గూగుల్ పిక్సెల్ 3

ఈ Google Pixel 3 గూగుల్ నుంచి వచ్చిన బెస్ట్ 5.5 ఇంచ్ స్మార్ట్ ఫోన్. దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. దీనికి క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ ను అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది. ఇందులో 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇందులో 12 ఎంపీ రియర్ కెమెరా, 8 + 8 డ్యుయల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఇది 5.5 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే(OLED Display) వస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం