తెలుగు న్యూస్  /  బిజినెస్  /  High Interest Rate Fds: ఎక్కువ వడ్డీ ఇచ్చే ఈ ఎఫ్ డీ పథకాలు ఈ నెలాఖరు వరకే అందుబాటులో..

High interest rate FDs: ఎక్కువ వడ్డీ ఇచ్చే ఈ ఎఫ్ డీ పథకాలు ఈ నెలాఖరు వరకే అందుబాటులో..

HT Telugu Desk HT Telugu

13 June 2023, 14:48 IST

  • High interest rate FDs: ఎక్కువ వడ్డీ అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ (Fixed Deposit FD) పథకాలను బ్యాంకులు ఇక ఎక్కువ కాలం కొనసాగించబోవన్న వార్తల నేపథ్యంలో మూడు  ముఖ్యమైన ఎఫ్ డీ (FD) పథకాలు ఈ నెలాఖరు వరకే అందుబాటులో ఉండనున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Mint)

ప్రతీకాత్మక చిత్రం

High interest rate FDs: గత ఏప్రిల్ నుంచి ఆర్బీఐ (RBI) రెపో రేటును 25ం బేసిస్ పాయింట్లను పెంచింది. ప్రస్తుతం ఈ రెపో రేటు 6.5% గా ఉంది. దాంతో, బ్యాంకులు కస్టమర్లకు ఎఫ్ డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల (FD interest rate)ను అందించాయి. ప్రస్తుతం ఫిక్స్ డ్ డిపాజిట్స్ పై వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇవి ఇంతకన్నా పెరిగే అవకాశం కూడా లేదు. అంతేకాదు, ప్రస్తుత స్థాయి నుంచి తగ్గే అవకాశముంది. ఇప్పటికే కొన్ని బ్యాంక్ లు ఆ దిశగా చర్యలు ప్రారంభించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక సంవత్సరం కాల వ్యవధిలో ఉన్న ఎఫ్ డీ (FD)లపై వడ్డీ రేటును ఇప్పటికే తగ్గించింది.

ఈ పథకాలు నెలాఖరు వరకే..

ఎక్కువ వడ్డీ అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ (Fixed Deposit FD) పథకాలను బ్యాంకులు ఇక ఎక్కువ కాలం కొనసాగించబోవన్న వార్తల నేపథ్యంలో మూడు ముఖ్యమైన ఎఫ్ డీ (FD) పథకాలు ఈ నెలాఖరు వరకే అందుబాటులో ఉండనున్నాయి. ఆ పథకాలు ఇవే..

SBI Amrit Kalash: ఎస్బీఐ అమృత కలశ్..

కస్టమర్లను విపరీతంగా ఆకర్షించిన ఫిక్స్ డ్ టర్మ్ డిపాజిట్ పథకాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన అమృత్ కలశ్ (SBI Amrit Kalash) ఒకటి. ఈ ఫిక్స్ డ్ టర్మ్ డిపాజిట్ పథకంలో కస్టమర్లు వార్షికంగా 7.1% వడ్డీ పొందుతారు. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అదనంగా, 7.6% వడ్డీ లభిస్తుంది. ఇది 400 రోజుల కాల వ్యవధి కలిగిన పథకం. కాగా, ఈ పథకం ఈ నెలాఖరు, అంటే జూన్ 30 వరకే అందుబాటులో ఉంటుంది. జూన్ 30 తరువాత ఈ పథకాన్ని క్లోజ్ చేయాలని ఎస్బీఐ నిర్ణయించింది.

Indian Bank special FD: ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్ డీ

ఇండియన్ బ్యాంక్ కూడా 400 రోజుల కాల వ్యవధితో ‘‘ఇండ్ సూపర్ 400 డేస్ (IND SUPER 400 DAYS)’’ పేరుతో ప్రత్యేక ఫిక్స్ డ్ టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో కస్టమర్లకు వార్షికంగా 7.25% వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ లభిస్తుంది. అయితే, ఈ పథకం కూడా జూన్ 30 వరకే అందుబాటులో ఉంటుంది.

SBI WE Care: ఎస్బీఐ వి కేర్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన మరో ఫిక్స్ డ్ డిపాజిట్ పథకం ‘‘ఎస్బీఐ వి కేర్ (SBI WE Care)’’. ఇది ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన పథకం. ఈ ఎఫ్ డీ స్కీమ్ కాల వ్యవధి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు. ఇందులో 7.5% వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ ఈ పథకం కూడా జూన్ 30 వరకే అందుబాటులో ఉంటుంది. ఈ ఎఫ్ డీ స్కీమ్ ను 2020 మే నెలలో ప్రారంభించారు.

తదుపరి వ్యాసం