తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Auto Expo 2023: మూడు నయా ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్న టాటా మోటార్స్: వివరాలివే..

Auto Expo 2023: మూడు నయా ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్న టాటా మోటార్స్: వివరాలివే..

10 January 2023, 10:28 IST

    • Tata Motors at Auto Expo 2023: ఆటో ఎక్స్‌పోలో మూడు కొత్త ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించనున్నట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. అలాగే మరో ఎలక్ట్రిక్ మోడల్ కూడా వస్తుందని అంచనాలు ఉన్నాయి. వివరాలివే..
Auto Expo 2023: మూడు నయా ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్న టాటా మోటార్స్
Auto Expo 2023: మూడు నయా ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్న టాటా మోటార్స్

Auto Expo 2023: మూడు నయా ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్న టాటా మోటార్స్

Tata Motors at Auto Expo 2023: మరో మూడు రోజుల్లో ఆటో ఎక్స్‌పో మొదలుకానుంది. దేశరాజధాని ఢిల్లీ వేదికగా ఆరు రోజుల పాటు ఈ ఈవెంట్ జరగనుంది. కొత్త ప్రొడక్టులను, టెక్నాలజీలను ప్రదర్శించేందుకు ఆటోమొబైల్ తయారీ సంస్థలన్నీ సిద్ధమవుతున్నాయి. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న కొన్ని కార్లు ఆటో ఎక్స్‌పోలోకి రానున్నాయి. దిగ్గజ సంస్థ టాటా మోటార్స్.. ఆటో ఎక్స్‌పోలో కొత్తగా మూడు కొత్త ఎలక్ట్రిక్ కార్ల మోడళ్లను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని టాటా మోటార్స్ ధ్రువీకరించింది. హారియర్ (Tata Harrier), సఫారీ (Safari) ఎస్‍యూవీలు, ఆల్ట్రోజ్‍ (Altroze) హ్యాచ్‍బ్యాక్ కార్లకు ఎలక్ట్రిక్ వేరియంట్లను టాటా మోటార్స్ తీసుకురానుంది. పంచ్ (Tata Punch) ఈవీ కూడా రానుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇవే..

కొత్త మోడళ్లు ఇవే..

Auto Expo 2023: ప్రస్తుతం నెక్సాన్ ఈవీ (Nexon EV), టిగోర్ (Tigor EV) ఈవీ, టియోగో (Tiago EV).. ఎలక్ట్రిక్ కార్లను టాటా మోటార్స్ విక్రయిస్తోంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల లైనప్‍లో హారియర్, సఫారీ, ఆల్ట్రోజ్‍లను యాడ్ చేసుకోనుంది. ఇవి లాంచ్ అయ్యాక.. అత్యధిక ఎలక్ట్రిక్ మోడళ్లు అందుబాటులో ఉంచిన సంస్థగా టాటా మోటార్స్ నిలువనుంది. అయితే, టాటా పంచ్ కారుకు కూడా ఈవీ మోడల్ వస్తుందని తెలుస్తోంది.

ఆల్ట్రోజ్ హ్యాచ్‍బ్యాక్ లాంచ్ అయిన దగ్గరి నుంచి దీనికి ఎలక్ట్రిక్ మోడల్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు టాటా మోటార్స్ దీన్ని తీసుకొస్తోంది. నెక్సాన్ ఈవీలో ఉన్నటు వంటి బ్యాటరీనే ఆల్ట్రోజ్‍లోనూ ఉండే అవకాశం ఉంది. 30.2 kWh బ్యాటరీ ఆల్ట్రోజ్ ఈవీలో ఉండొచ్చు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 350 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

కాగా, హారియర్, సఫారీ ఎలక్ట్రిక్ మోడళ్ల గురించి టాటా మోటార్స్ వివరాలను ఇంకా టీజ్ చేయలేదు. దీంతో వీటిపై ఆసక్తి పెరిగింది. మరోవైపు టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు.. 26kWh లిథియమ్ ఇయాన్ బ్యాటర్ ప్యాక్‍తో వస్తుందని తెలుస్తోంది. ఇది 300 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని అంచనా. అయితే హారియర్, సఫారీ, ఆల్ట్రోజ్‍లకు ఎలక్ట్రిక్ మోడళ్లను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నట్టు టాటా మోటార్స్ ధ్రువీకరించింది. కర్వ్ (Curvv), అవిన్యా (Avinya).. ఈవీ కాన్సెప్ట్‌లను కూడా ప్రదర్శించనుంది.

Auto Expo 2023: ఆటో ఎక్స్‌పో ఈనెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‍, గ్రేటర్ నోయిడా వేదికగా ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఆటో ఎక్స్‌పోలో నయా కార్లు, కారు కాన్సెప్ట్‌లు, టెక్నాలజీలు, బైక్‍లు, ఆటోమోటివ్ డిజైన్లతో పాటు చాలా ప్రొడక్టులను ఆటోమొబైల్ తయారీ సంస్థలు ప్రదర్శిస్తాయి.

తదుపరి వ్యాసం