తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market Holiday: శ్రీరామనవమి సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్ కు సెలవు

Stock market holiday: శ్రీరామనవమి సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్ కు సెలవు

HT Telugu Desk HT Telugu

17 April 2024, 8:57 IST

    • Stock market holiday: శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17 బుధవారం రోజు స్టాక్ మార్కెట్ కు సెలవు ప్రకటించారు. ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజీలు, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ల్లో ఈ రోజు కార్యకలాపాలు జరగవు. భారత ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ ఉండదు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Stock market holiday: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 17, బుధవారం భారత స్టాక్ మార్కెట్ పని చేయదు. శ్రీరాముడి జన్మదినమైన శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజీలు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మూసివేయడంతో భారత ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ ఉండదు.

ట్రెండింగ్ వార్తలు

Renault summer service camp 2024: రెనో కార్లకు సమ్మర్ సర్వీస్ క్యాంప్; కస్టమర్లకు ఆఫర్స్, గిఫ్ట్స్ కూడా..

Tata Motors Q4 Results: క్యూ 4 లో దూసుకుపోయిన టాటా మోటార్స్; నికరలాభంలో 222% వృద్ధి

OnePlus: ఇకపై అన్ని జియోమార్ట్ స్టోర్ట్స్ లో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ల సేల్; చిన్న పట్టణాల్లోనూ లభ్యం

ITR filing 2024: ఐటీఆర్ లో బ్యాంక్ ఎఫ్ డీ లపై వచ్చే వడ్డీని ఎలా చూపాలి?.. ఎంత వరకు వడ్డీ రాయితీ ఉంటుంది?

ట్రేడింగ్ హాలీడే

బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అధికారిక వెబ్సైట్లలో 2024 లోని ట్రేడింగ్ సెలవుల జాబితాలో ఏప్రిల్ 17, బుధవారం కూడా ఉంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు సెలవు ప్రకటించారు. అందువల్ల, ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లో స్టాక్ ఎక్స్ఛేంజీలు పని చేయవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ల్లో ఎటువంటి ట్రేడింగ్ కార్యకలాపాలు జరగవు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్, కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్, వడ్డీ రేటు డెరివేటివ్స్ విభాగాల్లో ఈ రోజు ట్రేడింగ్ జరగదని గమనించాలి.

కమాడిటీ ఎక్స్చేంజ్ మాత్రం..

మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (MCX)లో కమాడిటీ డెరివేటివ్ సెగ్మెంట్ ఈ రోజు ఉదయం సెషన్ లో మాత్రమే మూసివేసి ఉంటుంది. సాయంత్రం సెషన్ తెరిచి ఉంటుంది. ఎంసిఎక్స్ లో కమోడిటీ మార్కెట్ ట్రేడింగ్ ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11:30 / 11:55 గంటల వరకు జరుగుతుంది. ఏప్రిల్ నెలలో 17వ తేదీ చివరి ట్రేడింగ్ సెలవు. తదుపరి ట్రేడింగ్ హాలీడే మే 1వ తేదీన ఉంటుంది.

మే 2024లో స్టాక్ మార్కెట్ సెలవులు

2024 మే నెలలో రెండు స్టాక్ మార్కెట్ సెలవులు ఉన్నాయి. మొదటి స్టాక్ మార్కెట్ సెలవు మే 1 న మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా, లోక్ సభ ఎన్నికల కారణంగా మే 20 న కూడా ముంబైలో స్టాక్ మార్కెట్ సెలవు ప్రకటించారు.

భారత స్టాక్ మార్కెట్

మంగళవారం సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో సెషన్లోనూ నష్టాల్లో ముగిశాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల మధ్య మంగళవారం అర శాతానికి పైగా నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్ 456.10 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 72,943.68 వద్ద, నిఫ్టీ 124.60 పాయింట్లు లేదా 0.56 శాతం క్షీణించి 22,147.90 వద్ద ముగిశాయి. బ్రాడ్ మార్కెట్లలో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.75 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.09 శాతం నష్టపోయింది.

తదుపరి వ్యాసం