తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Spotify Fined: ‘‘స్పాటిఫై’’ కి భారీ షాక్; 5.4 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన స్వీడన్

Spotify fined: ‘‘స్పాటిఫై’’ కి భారీ షాక్; 5.4 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన స్వీడన్

HT Telugu Desk HT Telugu

13 June 2023, 19:57 IST

  • Spotify fined: ఆన్ లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ కంపెనీ స్పాటిఫై (Spotify) కి స్వీడన్ భారీ షాక్ ఇచ్చింది. వినియోగదారుల డేటా ప్రైవసీ విషయంలో స్పాటిఫై అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ.. 5.8 కోట్ల క్రోనోర్ల (54 లక్షల డాలర్లు) జరిమానా విధించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Spotify fined: ఆన్ లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ కంపెనీ స్పాటిఫై (Spotify) కి స్వీడన్ భారీ షాక్ ఇచ్చింది. వినియోగదారుల డేటా ప్రైవసీ విషయంలో స్పాటిఫై అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ.. 5.8 కోట్ల క్రోనోర్ల (54 లక్షల డాలర్లు) జరిమానా విధించింది. స్వీడిష్ అథారిటీ ఫర్ ప్రైవసీ ప్రొటెక్షన్ మంగళవారం స్పాటిఫై సంస్థకు ఈ జరిమానా విధించింది.

Spotify fined 5.4 million dollars: వినియోగదారుల డేటా పరిరక్షణ

తమ ఆన్ లైన్ స్ట్రీమింగ్ యాప్ ను వినియోగిస్తున్న కస్టమర్ల డేటాను ఎలా సేకరిస్తోంది? ఆ డేటాను ఎలా వినియోగిస్తోంది? అన్న వివరాలను కస్టమర్లకు స్పాటిఫై సరిగ్గా తెలియజేయడం లేదని స్వీడన్ అధికారిక డేటా ప్రైవసీ ప్రొటెక్షన్ అథారిటీ గుర్తించింది. దాంతో, స్థానిక చట్టాల ప్రకారం జరిమానాగా స్పాటిఫై 5.8 కోట్ల క్రోనోర్ల (54 లక్షల డాలర్లు) జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయంపై అప్పీల్ కు వెళ్లనున్నట్లు స్పాటిఫై వెల్లడించింది.

యూరోపియన్ డేటా ప్రొటెక్షన్ రూల్స్

తమ డేటా వినియోగానికి సంబంధించి కస్టమర్లకు స్పాటిఫై సరైన సమాచారం ఇవ్వడం లేదన్న విషయం తమ రివ్యూలో తేలిందని స్వీడన్ అథారిటీ ఫర్ ప్రైవసీ ప్రొటెక్షన్ స్పష్టం చేసింది. స్పాటిఫై విధానాల్లో లోపాలను గుర్తించి, అందుకు జరిమానాగా 5.8 కోట్ల క్రోనోర్ల (54 లక్షల డాలర్లు) జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. యూరోపియన్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ ప్రకారం.. యూజర్ల ప్రైవసీ డేటా సేకరిస్తున్న సంస్థ .. కస్టమర్లకు సంబంధించిన ఏ డేటాను సేకరిస్తోంది?, డేటాను ఎలా సేకరిస్తోంది?, సేకరించిన డేటాను ఎలా ఉపయోగిస్తుంది? అన్న వివరాలను కస్టమర్లకు స్పష్టంగా వివరించాల్సి ఉంటుంది. స్పాటిఫై ఈ విషయంలో సరిగ్గా వ్యవహరించలేదని స్వీడిష్ అథారిటీ ఫర్ ప్రైవసీ ప్రొటెక్షన్ రివ్యూలో తేలింది.

టాపిక్

తదుపరి వ్యాసం