తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Silicon Valley Bank: అమెరికాలో మరో సంక్షోభం; మూతపడిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్

Silicon Valley Bank: అమెరికాలో మరో సంక్షోభం; మూతపడిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్

HT Telugu Desk HT Telugu

11 March 2023, 19:31 IST

    • Silicon Valley Bank: అమెరికాలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూతపడింది. 2008 తరువాత అమెరికా బ్యాంకింగ్ రంగంలో ఇదే అతిపెద్ద సంక్షోభమని భావిస్తున్నారు. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Silicon Valley Bank collapses: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. అమెరికా సహా వివిధ దేశాల స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) మూతపడడంతో ఆ బ్యాంక్ లో కస్టమర్లు దాచుకున్న డబ్బు సుమారు 175 బిలియన్ డాలర్లను చెల్లించాల్సిన బాధ్యత అమెరికా డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పై పడింది.

Silicon Valley Bank collapses: స్టార్ట్ అప్ లకు అప్పులతో లాభాలు

పెద్ద సంఖ్యలో స్టార్ట్ అప్ లకు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank SVB) అప్పులు ఇచ్చింది. ముఖ్యంగా టెక్నాలజీ స్టార్ట్ అప్ లపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) కు మొదట్లో మంచి లాభాలనే ఇచ్చాయి. ఈ బ్యాంక్ (Silicon Valley Bank) శుక్రవారం మూతపడడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు, కస్టమర్లు షాక్ కు గురయ్యారు. అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఈ ప్రభావం సోమవారం భారత స్టాక్ మార్కెట్లపై కూడా పడుతుందని భావిస్తున్నారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) లావాదేవీలపై నిషేధం విధించిన అమెరికా బ్యాంకింగ్ నియంత్రణ సంస్థలు.. బ్యాంక్ లోని డిపాజిట్లను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. బ్యాంక్ మూతపడనుందన్న సమాచారం తెలుసుకున్న కస్టమర్లు తమ డబ్బును విత్ డ్రా చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున బ్యాంక్ బ్రాంచ్ ల ముందు బారులు తీరారు.

Silicon Valley Bank collapses: యూఎస్ బాండ్లలో పెట్టుబడులతో నష్టాలు..

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పెద్ద మొత్తంలో యూఎస్ బాండ్స్ (US bonds) లో కూడా పెట్టుబడులు పెట్టింది. అయితే, ధరలను తగ్గించే లక్ష్యంతో ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడం కోసం అమెరికా ఫెడరల్ బ్యాంక్ గత సంవత్సరం నుంచి వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. దాంతో, యూఎస్ బాండ్ల విలువ దారుణంగా పడిపోయింది. యూఎస్ బాండ్ల (US bonds) విలువ పడిపోవడంతో, అందులో భారీగా పెట్టుబడులు పెట్టిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) భారీగా నష్టపోయింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూతపడిన నేపథ్యంలో, ఆ బ్యాంక్ కు సంబంధించిన లావాదేవీల కోసం అమెరికా ఫెడరల్ బ్యాంక్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ సాంటాక్లారా (National Bank of Santa Clara) అనే పేరుతో కొత్త బ్యాంక్ ను ఏర్పాటు చేసింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) కు చెందిన అన్ని ఆస్తులు ఇకపై ఈ నేషనల్ బ్యాంక్ ఆఫ్ సాంటాక్లారా (National Bank of Santa Clara) ఆధీనంలో ఉంటాయి.

Silicon Valley Bank collapses కస్టమర్లకు హామీ

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూతపడిన నేపథ్యంలో కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫెడరల్ బ్యాంక్ ప్రకటించింది. సోమవారం ఉదయం బ్యాంక్ (Silicon Valley Bank) బ్రాంచ్ లు తెరుచుకుంటాయని, అన్ని ఇన్సూర్డ్ డిపాజిట్లు సురక్షితంగానే ఉన్నాయని, గతంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) జారీ చేసిన చెక్ లకు కూడా చెల్లింపులు జరుపుతామని ప్రకటించింది.

తదుపరి వ్యాసం