తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon To Be Expensive: ఆమెజాన్ లో పెరగనున్న ప్రొడక్ట్స్ ధరలు.. ఎప్పటి నుంచంటే..

Amazon to be expensive: ఆమెజాన్ లో పెరగనున్న ప్రొడక్ట్స్ ధరలు.. ఎప్పటి నుంచంటే..

HT Telugu Desk HT Telugu

18 May 2023, 16:03 IST

  • Amazon to be expensive: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్ (Amazon) లో ప్రొడక్ట్స్ ధరలు పెరగనున్నాయి.ముఖ్యంగా దుస్తులు, నిత్యావసరాలు, బ్యూటీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు.. మొదలైన వాటిపై ఈ పెంపు ఉండబోతోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Amazon to be expensive: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్ (Amazon) లో ప్రొడక్ట్స్ ధరలు పెరగనున్నాయి.ముఖ్యంగా దుస్తులు, నిత్యావసరాలు, బ్యూటీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, మెడిసిన్స్.. మొదలైన వాటిపై ఈ పెంపు ఉండబోతోంది.

Amazon to be expensive: మే 31 నుంచి..

ఆమెజాన్ (Amazon) లో ప్రొడక్ట్స్ ధరలు మే 31 నుంచి పెరగనున్నాయి. సెల్లర్ ఫీ (seller fee), కమిషన్ చార్జెస్ (commission charge) ను మే 31 నుంచి పెంచాలని ఆమెజాన్ నిర్ణయించిన నేపథ్యంలో.. ఆ మేరకు ఆమెజాన్ ప్లాట్ ఫామ్ పై లభించే ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి. ప్రొడక్ట్ రిటర్న్ చార్జీలను కూడా పెంచాలని ఆమెజాన్ (Amazon) నిర్ణయించింది. తమ ప్లాట్ ఫామ్ పై ఉత్పత్తులను అమ్మే అమ్మకం దారుల నుంచి కమిషన్, ఇతర ఫీజులను వసూలు చేయడం ద్వారా సాధారణంగా ఈ కామర్స్ సైట్స్ ఆదాయం పొందుతాయన్న విషయం తెలిసిందే. ప్రతీ సంవత్సరం ఫీజు, కమిషన్ చార్జీ (commission charge)ల సవరణ ఉంటుంది. ‘ఈ సంవత్సరం కూడా మే 31 నుంచి మా ఫీజు, కమిషన్ చార్జీల్లో మార్పు ఉంటుంది’ అని ఆమెజాన్ (Amazon) వివరించింది. దుస్తులు, నిత్యావసరాలు, బ్యూటీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, మెడిసిన్స్.. మొదలైన వాటి హ్యాండ్లింగ్ చార్జెస్ పెరుగుతాయని తెలిపింది.

Amazon to be expensive: సెల్లర్ చార్జీల పెంపు

ఆమెజాన్ (Amazon) లో తమ ఉత్పత్తులు, వస్తువలను అమ్మే వారిపై మే 31 నుంచి.. దుస్తులు, ఇతర అలంకరణ సామగ్రి కేటగిరీలో రూ. 1000 లేదా ఆ పై విలువ ఉన్న వస్తువులపై ప్రస్తుతం 19% సెల్లర్ ఫీజు (seller fee)ను 22.50 శాతానికి పెంచుతారు. అలాగే, రూ. 500 లేదా ఆ లోపు ఉన్న ఓవర్ ది కౌంటర్ ఔషధాల సెల్లర్ ఫీజును ప్రస్తుతం ఉన్న 5.5% నుంచి 12 శాతానికి పెంచుతారు. రూ. 500 పై విలువున్న ఔషధాల సెల్లర్ ఫీజు 15 శాతంగా ఉంటుంది. అలాగే, బ్యూటీ సెక్షన్ లో రూ. 300 లోపు విలువున్న వస్తువులపై సెల్లర్ ఫీజు (SELLER FEE) 8.5% ఉంటుంది. మరోవైపు, దేశీయంగా ట్రాన్స్ పోర్ట్ అయ్యే వస్తువుల డెలివరీ ఫీజు (delivery fee)ను కూడా 20% నుంచి 23 % వరకు పెంచాలని ఆమెజాన్ నిర్ణయించింది.

తదుపరి వ్యాసం