తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sbi Q2 Results: ఎస్‌బీఐ నికర లాభంలో 74 శాతం పెరుగుదల

SBI Q2 Results: ఎస్‌బీఐ నికర లాభంలో 74 శాతం పెరుగుదల

HT Telugu Desk HT Telugu

06 November 2022, 10:43 IST

    • SBI Q2 Results: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో త్రైమాసికంలో నికర లాభంలో 74 శాతం పెరుగుదల కనబరిచింది.
క్యూ2లో ఎస్‌బీఐ నికర లాభం 74 శాతం పెరుగుదల
క్యూ2లో ఎస్‌బీఐ నికర లాభం 74 శాతం పెరుగుదల (REUTERS)

క్యూ2లో ఎస్‌బీఐ నికర లాభం 74 శాతం పెరుగుదల

ముంబై: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. ఎస్‌బీఐ నికర లాభం 74 శాతం పెరిగి రూ. 7,627 కోట్ల నుంచి రూ. 13,264 కోట్లకు చేరుకుంది.

ఎస్‌బీఐ నికర వడ్డీ ఆదాయం 12.8 శాతం పెరిగి రూ. 35,183 కోట్లకు చేరుకుంది. గృహ రుణ పోర్ట్‌ఫోలియో 14 శాతం వృద్ధి చెంది రూ. 5.94 లక్షల కోట్లకు చేరుకుంది. దాని రిటైల్ పోర్ట్‌ఫోలియో మొత్తం రూ. 10.7 లక్షల కోట్లుగా ఉంది. కార్పొరేట్ రుణాలు ఏడాదికి 21 శాతం పెరిగి రూ.9.2 లక్షల కోట్లకు చేరుకున్నాయని కూడా పేర్కొంది.

బ్యాంకు రుణ వితరణ రెండింతలు వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ, ఎస్‌బీఐలో డిపాజిట్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖరా తెలిపారు.

‘మా వద్ద రూ. 3.5 లక్షల కోట్లు ఉన్నాయి. రుణాలు ఇవ్వడానికి తగినంత అవకాశం లేనప్పుడు లిక్విడ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడి పెట్టాం. మేం ఇప్పుడు క్రెడిట్ వృద్ధికి నిధుల కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు..’ అని ఫలితాలను ప్రకటిస్తూ ఛైర్మన్ చెప్పారు.

సెప్టెంబరు 2021లో రూ. 25.3 లక్షల కోట్ల నుండి తమ అడ్వాన్సులు 20 శాతం పెరిగి రూ. 30.3 లక్షల కోట్లకు చేరుకున్నాయని రుణదాత పేర్కొంది. కార్పొరేట్ రుణాలు, రిటైల్ సెగ్మెంట్ నుండి రుణాలకు డిమాండ్ ఉందని పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో డిపాజిట్లు రూ. 38 లక్షల కోట్ల నుంచి రూ. 41.9 లక్షల కోట్లకు పెరిగాయి.

ఈ త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని రిటైల్ రుణాలలో 45 శాతం యోనో దాని లెండింగ్ యాప్ ద్వారా పొందినట్లు చెప్పారు. మొత్తం లావాదేవీలలో ప్రత్యామ్నాయ ఛానెల్‌ల వాటా ఏడాది క్రితం 95.1 శాతం నుంచి 96.8 శాతానికి పెరిగింది.

రెండోత్రైమాసికంలో ఎస్‌బీఐ స్లిప్పేజ్ నిష్పత్తి 0.33 వద్ద ఉంది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ముగిసిన తర్వాత 1.38గా ఉంది.

తదుపరి వ్యాసం