తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy A05s: 12 జీబీ ర్యామ్, అడ్వాన్స్డ్ ఫీచర్స్.. అందుబాటు ధరలోనే ఈ స్మార్ట్ ఫోన్

Samsung Galaxy A05s: 12 జీబీ ర్యామ్, అడ్వాన్స్డ్ ఫీచర్స్.. అందుబాటు ధరలోనే ఈ స్మార్ట్ ఫోన్

HT Telugu Desk HT Telugu

06 January 2024, 19:17 IST

  • Samsung Galaxy A05s: సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ జాబితాలోకి మరో కొత్త ఫోన్ రాబోతోంది. ఈ గెలాక్సీ ఏ 05 ఎస్ (Samsung Galaxy A05s) అందుబాటు ధరలో, ప్రీమియం ఫీచర్స్ తో సామ్సంగ్ అభిమానులను అలరించనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Samsung Galaxy A05s: అత్యంత ప్రజాదరణ పొందిన సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్ లోకి కొత్తగా సామ్సంగ్ గెలాక్సీ ఏ 05 ఎస్ (Samsung Galaxy A05s) ఫోన్ వచ్చి చేరింది. గత కొన్ని సంవత్సరాలుగా, గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా, ఇవి అడ్వాన్స్డ్ ఫీచర్స్, అందుబాటు ధర మధ్య సమతుల్యతను సాధించాయి. ఈ శ్రేణిలో గెలాక్సీ A71, A51, A31, A21s, A11 మోడల్స్ విశేష ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా మధ్య తరగతి వినియోగదారుడి అవసరాలకు అనుగుణంగా, తక్కువ ధరలో, అడ్వాన్స్డ్ ఫీచర్స్ లభించేలా ఈ ఫోన్ ను తీర్చిదిద్దారు.

ట్రెండింగ్ వార్తలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

Gold price today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

6.7 అంగుళాల డిస్ ప్లే

ఈ గెలాక్సీ ఏ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల పుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే (6.7-inch FHD+) తో వస్తుంది. అలాగే, ఇందులో 50MP మెయిన్ కెమరా తక్కువ-కాంతి పరిస్థితుల్లో కూడా స్పష్టమైన చిత్రాలను తీయగలదు. ఈ ప్రైమరీ కెమెరాకు అనుబంధంగా, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్‌ను ఉన్నాయి. అలాగే, ఇందులో 13 MP ఫ్రంట్ కెమెరాతో స్పష్టమైన సెల్ఫీలను పొందవచ్చు.

స్నాప్ డ్రాగన్

ఈ గెలాక్సీ ఏ 05 ఎస్ (Galaxy A05s) లో అత్యుత్తమ పనితీరు, సామర్థ్యాన్ని అందించే స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ను అమర్చారు. దీనిలో 6ఎన్ఎం ప్రాసెస్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ స్మార్ట్ ఫోన్ లైట్ గ్రీన్, లైట్ వయొలెట్, క్లాసిక్ నలుపు కలర్స్ లో లభించనుంది. ఈ ఫోన్ అద్భుతమైన డిస్‌ప్లే, హై-రిజల్యూషన్ కెమెరా సిస్టమ్, శక్తివంతమైన ప్రాసెసర్ లతో అందుబాటు ధరలో లభిస్తుంది.

తదుపరి వ్యాసం