Samsung Galaxy smartphones launch: సామ్సంగ్ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్; ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ మీ కోసం
Samsung Galaxy smartphones launch: మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ ను సామ్సంగ్ భారతీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. సామ్సంగ్ గెలాక్సీ ఏ 25, సామ్సంగ్ గెలాక్సీ ఏ 15 ఫోన్స్ ఇప్పుడు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు కూడా 5జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తాయి.
Samsung Galaxy smartphones launch: 2023 లో సామ్సంగ్ నుంచి చాలా స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చి వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొన్నాయి. తాజాగా, ఈ దక్షిణ కొరియా టెక్ దిగ్గజం భారతదేశంలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. అవి సామ్సంగ్ గెలాక్సీ ఏ 25 5G, సామ్సంగ్ గెలాక్సీ ఏ 15 5G. గెలాక్సీ A25 5G ఫోన్ లో 50MP ట్రిపుల్ కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లే తదితర ఫీచర్స్ ఉన్నాయి.
Features and specifications: ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
Samsung Galaxy A25 5G స్మార్ట్ ఫోన్ లో 1000 నిట్ బ్రైట్ నెస్ తో 6.5-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది స్పష్టమైన అవుట్‌డోర్ విజిబిలిటీ కోసం విజన్ బూస్టర్ ఫీచర్‌ను కలిగి ఉంది. అలాగే, హానికరమైన నీలి కాంతిని తగ్గించడానికి ఐ కంఫర్ట్ షీల్డ్‌ను కూడా కలిగి ఉంది. Galaxy A25 5G సింగిల్ టేక్, రీమాస్టర్, ఆబ్జెక్ట్ ఎరేజర్ వంటి ఫీచర్లతో 50MP (OIS) ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందువైపు 13MP సెల్ఫీ షూటర్ కూడా ఉంది. ఇందులో Exynos 1280 SoC చిప్ సెట్ ను అమర్చారు. అలాగే, ఇది 8GB RAM, 256 GB స్టోరేజ్ తో వస్తుంది. మరోవైపు, సామ్సంగ్ గెలాక్సీ ఏ 15 5G స్మార్ట్ ఫోన్ లో 6.5-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. వెనుకవైపు, VDISతో కూడిన 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, 8GB RAM, 256GB స్టోరేజ్ ఫీచర్స్ ఉన్నాయి.
నాక్స్ వాల్ట్ చిప్‌సెట్
Samsung Galaxy A25 5G, Galaxy A15 5G స్మార్ట్ ఫోన్స్ లో నాక్స్ వాల్ట్ చిప్‌సెట్ (Knox Vault chipset)ను అమర్చారు. ఇది పిన్స్, పాస్‌వర్డ్స్, పాటర్న్స్, క్విక్ షేర్, సామ్సంగ్ వాలెట్, ఆటో బ్లాకర్, ప్రైవసీ డాష్ బోర్డ్, Samsung Passkey వంటి మీ సున్నితమైన డేటాను పరిరక్షిస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు కూడా 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీలను కలిగి ఉన్నాయి.
Pricing and availability: ధర, ఇతర వివరాలు
సామ్సంగ్ గెలాక్సీ ఏ 25 5G స్మార్ట్ ఫోన్ బ్లూ బ్లాక్, బ్లూ, ఎల్లో అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. 8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999 గా, 8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా నిర్ణయించారు. మరోవైపు, గెలాక్సీ ఏ 15 5G 128GB వేరియంట్ ధర రూ. 19499గా, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22499 గా నిర్ణయించారు. ఈ రెండు ఫోన్స్ జనవరి 1, 2024 నుంచి రిటైల్ స్టోర్‌లు, Samsung.com, ఇతర ఆన్‌లైన్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటాయి.