తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rbi Repo Rate: రెపొ రేటు యథాతథం; ఆర్బీఐ కీలక నిర్ణయం

RBI repo rate: రెపొ రేటు యథాతథం; ఆర్బీఐ కీలక నిర్ణయం

HT Telugu Desk HT Telugu

10 August 2023, 11:18 IST

  • RBI repo rate: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం ఆగస్ట్ 8వ తేదీ నుంచి ఆగస్ట్ 10 వ తేదీ వరకు జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గురువారం వెల్లడించారు. ప్రస్తుతానికి కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకూడదని ఈ భేటీలో నిర్ణయించారు.

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ (RBI)

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్

RBI repo rate: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం గురువారం జరిగింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షతన ఆరుగురు ఎంపీసీ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతానికి కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకూడదని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బై మంత్లీ మానిటరీ పాలసీని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు.

RBI repo rate: రెపొ రేట్ 6.5%

ప్రస్తుతానికి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. అంటే, రెపొ రేటు 6.5% గా కొనసాగుతుంది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 6.25% గా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 6.75% గా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవస్థ గమనం సజావుగా సాగుతుండడంతో, 2022 మే నుంచి కీలక వడ్డీ రేట్లలో ఆర్బీఐ పెద్దగా మార్పులేవీ చేయలేదు. రెపొ రేటును మాత్రం 250 బేసిస్ పాయింట్లు పెంచింది.

జీడీపీ వృద్ధి రేటు

ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 లో ఇది 8% గా, క్యూ2 లో 6,5% గా, క్యూ 3 లో 6.0% గా, క్యూ 4 లో 5.7% గా, ఉంటుందని తెలిపింది. అలాగే, Q1FY25లో జీడీపీ వృద్ధి రేటు 6.6% గా ఉంటుందని వెల్లడించింది. ద్రవ్యోల్బణం ఇప్పటికీ సవాలుగానే ఉందని శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరంలో సీపీఐ (consumer price index CPI) 5.4% గా ఉంటుందని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం (FY23) లో ఇది 5.1% గా ఉంది.

రూ. 2 వేల నోటు..

రూ. 2 వేల నోటును మార్కెట్ నుంచి ఉపసంహరించడంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పందించారు. రూ. 2 వేల నోట్లు లేకపోయినా.. మార్కెట్లో అవసరమైనంత నగదు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను ఈ సెప్టెంబర్ 30 లోగా బ్యాంక్ ల్లో జమ చేయడం కానీ, ఎక్స్చేంజ్ చేయడం కానీ చేయాలని ఆర్బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం