తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rbi Repo Rate: రెపొ రేట్ పై ఆర్బీఐ కీలక నిర్ణయం; 2023-24 జీడీపీ వృద్ధి 6.4 శాతం

RBI repo rate: రెపొ రేట్ పై ఆర్బీఐ కీలక నిర్ణయం; 2023-24 జీడీపీ వృద్ధి 6.4 శాతం

HT Telugu Desk HT Telugu

08 June 2023, 11:06 IST

  • భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకు వెళ్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించారు. కీలక పాలసీ రేట్లపై గురువారం ఆర్బీఐ సమీక్షా సమావేశం నిర్వహించింది.

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్

భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకు వెళ్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించారు. కీలక పాలసీ రేట్లపై గురువారం ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించింది.

రెపో రేటు యధాతథం

నిపుణులు అంచనా వేసినట్లే రెపొ రేటు (Repo rate)లో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న 6.5 శాతాన్నే కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయడంలేదని మానిటరీ పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆర్బీఐ దేశంలోని ఇతర బ్యాంకులకు ఇచ్చే రుణాలపై పొందే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ద్రవ్యోల్బణంలో ప్రమాదకర స్థాయిలో లేకపోవడం, గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గుతుండడం.. తదితర కారణాల వల్ల రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకూడదని ఆర్బీఐ నిర్ణయించింది. రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని ఆర్థిక రంగా నిపుణులు కూడా అంచనా వేశారు. ద్రవ్యోల్బణం ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలు సహా, చాలా దేశాలను వేధిస్తున్న ప్రధాన సమస్య. భారత్ మాత్రం ఈ సమస్యను విజయవంతంగా ఎదుర్కొంటోంది. మే 2022 నుంచి రెపో రేటును ఆర్బీఐ సుమారు 250 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దాంతో, ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 6.5% గా ఉంది. రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయవద్దన్న ప్రతిపాదనను ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యలు ఏకగ్రీవంగా ఆమోదించారు.

జీడీపీ 6.5%

2023-24 ఆర్థిక సంవత్సర ద్రవ్యోల్బణం (CPI inflation) 5.1% ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. తొలి త్రైమాసికం Q1 లో 4.6%%, Q2 లో 5.2%, Q3 లో 5.4%, Q4 లో 5.2% ద్రవ్యోల్బణాన్ని అంచనా వేశారు. ద్రవ్యోల్బణ లక్ష్యమైన 4 శాతానికి చేరుకోవడానికి ఇంకా దూరంలోనే ఉన్నామని, రుతుపవనాల రాకలో ఆలస్యం, అంతర్జాతీయంగా నెలకొన్న ద్రవ్యోల్బణ పరిస్థితులు కొంత ఆందోళనకరంగా ఉన్నాయని ఆర్బీఐ వ్యాఖ్యానించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ (GDP) వృద్ధి రేటును 6.5% గా నిర్ధారించారు. తొలి త్రైమాసికం Q1 లో 8%, Q2 లో 6.5%, Q3 లో 6%, Q4 లో 5.7% వృద్ధి రేటును అంచనా వేశారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ గురువారం ప్రధానంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం, అభివృద్ధి కి సహకారాన్ని అందించడం లక్ష్యాలుగా నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయని, గతంలో ఉన్నంత దారుణంగా లేవని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ గుణాత్మక ఫలితాలను సాధిస్తూ, ముందుకు వెళ్తోందన్నారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం పూర్తి వివరాలు జూన్ 12వ తేదీన వెల్లడవుతాయి.

టాపిక్

తదుపరి వ్యాసం