తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato Payments: ‘‘జొమాటో పే’’ కు మార్గం సుగమం; పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ ఇచ్చిన ఆర్బీఐ

Zomato Payments: ‘‘జొమాటో పే’’ కు మార్గం సుగమం; పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ ఇచ్చిన ఆర్బీఐ

HT Telugu Desk HT Telugu

25 January 2024, 19:13 IST

  • Zomato Payments: ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అనుబంధ సంస్థ జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ZPPL) కు ఆన్ లైన్ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ ను ఆర్బీఐ ఇచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన అనుబంధ సంస్థ జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జెడ్ పీ పీ ఎల్) ఆన్ లైన్ పేమెంట్ అగ్రిగేటర్ గా పనిచేయడానికి ఆర్బీఐ నుండి అనుమతి పొందినట్లు గురువారం తెలిపింది.

జెడ్ పీ పీ ఎల్ విలీనం

పేమెంట్ అగ్రిగేటర్ గా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్ట్రుమెంట్స్ ను జారీ చేసే వ్యాపారాన్ని నిర్వహించడానికి వీలుగా జెడ్ పీ పీ ఎల్ ను విలీనం చేసుకున్నట్లు కంపెనీ ఆగస్టు 4, 2021 న వెల్లడించింది. ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 2024 జనవరి 24 నుంచి భారత్ లో 'ఆన్ లైన్ పేమెంట్ అగ్రిగేటర్'గా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి జడ్ పీ పీ ఎల్ కు 2024 జనవరి 24న సర్టిఫికేట్ లభించిందని జొమాటో వెల్లడించింది. ఆర్బీఐ నుంచి లైసెన్స్ లభించడంతో సొంతంగా పేమెంట్ యాప్ ను ఏదైనా బ్యాంక్ భాగస్వామ్యంతో జొమాటో రూపొందించుకోవచ్చు. ఈ దిశగా ఇప్పటికే జొమాటో ఐసీఐసీఐ బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. సొంత యూపీఐ ద్వారా జొమాటో లావాదేవీలు జరిపితే, ఆ మేరకు మర్చంట్ చార్జీల ఖర్చు తగ్గుతుంది. ఆ మొత్తాన్ని తమ యూపీఐ వినియోగించి చెల్లింపులు జరిపే వినియోగదారులకు అందించవచ్చు. అలాగే, సొంత యూపీఐ వల్ల థర్డ్ పార్టీ యూపీఐ లపై ఆధారపడే పరిస్థితి ఉండదు.

టాపిక్

తదుపరి వ్యాసం