తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Pure Ev Ecodryft Electric Motorcycle: 130 కిలోమీటర్ల వరకు రేంజ్‍తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. బడ్జెట్ ధరతో..

Pure EV ecoDryft Electric Motorcycle: 130 కిలోమీటర్ల వరకు రేంజ్‍తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. బడ్జెట్ ధరతో..

31 January 2023, 13:11 IST

    • Pure ecoDryft Electric Motorcycle: ప్యూర్ ఈవీ ఎకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విడుదలైంది. బడ్జెట్ ధరలో అడుగుపెట్టింది. 130 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుంది.
Pure EV ecoDryft: 130 కిలోమీటర్ల వరకు రేంజ్‍తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ (Photo: Pure EV)
Pure EV ecoDryft: 130 కిలోమీటర్ల వరకు రేంజ్‍తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ (Photo: Pure EV)

Pure EV ecoDryft: 130 కిలోమీటర్ల వరకు రేంజ్‍తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ (Photo: Pure EV)

Pure ecoDryft Electric Motorcycle: ప్యూర్ ఈవీ సంస్థ నుంచి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ లాంచ్ అయింది. ఎకోడ్రిఫ్ట్ (Pure ecoDryft) పేరుతో ఈ ఎలక్ట్రిక్ బైక్‍ను హైదరాబాద్ బేస్డ్ సంస్థ ప్యూర్ ఈవీ (Pure EV) తీసుకొచ్చింది. ఈ మోటార్‌సైకిల్ 130 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని ఆ కంపెనీ పేర్కొంది. ధరతో పాటు వివరాలను వెల్లడించింది. ఈ ప్యూర్ ఈవీ ఎకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్‍లు కూడా మొదలయ్యాయి. ప్యూర్ఈవీ డీలర్‌షిప్‍ల వద్ద బుక్ చేసుకోవచ్చు. Pure EV ecoDryft ఎలక్ట్రిక్ బైక్ పూర్తి వివరాలు ఇవే.

బ్యాటరీ, రేంజ్

Pure ecoDryft Electric Motorcycle: 3 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీని ప్యూర్ ఈవీ ఎకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ కలిగి ఉంది. ఒక్కసారి ఫల్ చార్జ్ చేస్తే ఈ మోటార్‌సైకిల్‍ 85 కిలోమీటర్ల నుంచి గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఆరు గంటల్లో ఈ బైక్ బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుంది.

టాప్ స్పీడ్

Pure EV ecoDryft Electric Motorcycle: డ్రైవ్, క్రాస్ ఓవర్, థ్రిల్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‍లను ప్యూర్ ఎకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కలిగి ఉంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 75 కిలోమీటర్లు (75 kmph)గా ఉంది.

ఈ బైక్ మోటార్ గరిష్ఠంగా 4.2 bhp పవర్ ఔట్‍పుట్‍ను, 40 Nm పీక్ టార్క్యూను జనరేట్ చేస్తుంది. 10 సెకన్ల వ్యవధిలోనే ఈ ఎకోడ్రిఫ్ట్ బైక్ 0 నుంచి గంటకు 60 కిలోమీటర్ల (60 kmph) వేగానికి యాక్సలరేట్ అవుతుందని ప్యూర్ ఈవీ పేర్కొంది.

మరిన్ని ఫీచర్లు

Pure ecoDryft Electric Motorcycle: 7 ఇంచుల టీఎఫ్‍టీ డిస్‍ప్లేను ప్యూర్ ఈవీ ఎకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ వస్తోంది. బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉంటుంది. 18 ఇంచుల సైజ్ ఉండే ఫ్రంట్ వీల్, 17 ఇంచుల వెనుక వీల్‍ను ఈ బైక్ కలిగి ఉంది.

ధర, డెలివరీలు

Pure EV ecoDryft Electric Motorcycle Price: ప్యూర్ ఈవీ ఎకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర రూ.99,999గా ఉంది. ఇది ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధర. హైదరాబాద్‍తో పాటు దేశంలోని ఇతర సిటీల్లో ఈ బైక్ ధర రూ.1,14,999గా ఉంది. మార్చి 1వ తేదీ నుంచి డెలివరీలు మొదలుపెట్టనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.

తదుపరి వ్యాసం