తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Odyssey Ark । ఇక గేమ్ లో గెలుపు మీదే, శాంసంగ్ సరికొత్త గేమింగ్ మానిటర్ ఇదే!

Samsung Odyssey Ark । ఇక గేమ్ లో గెలుపు మీదే, శాంసంగ్ సరికొత్త గేమింగ్ మానిటర్ ఇదే!

HT Telugu Desk HT Telugu

10 October 2022, 12:42 IST

    • Samsung Odyssey Ark: శాంసగ్ కంపెనీ ఒక ప్రత్యేకమైన గేమింగ్ మానిటర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. గేమింగ్ ప్రియులకు ఈ మానిటర్‌ గొప్ప అనుభూతిని అందిస్తుంది. అన్నివైపులా దృష్టి సారించేందుకు వీలు కలుగుతుంది. దీని ఇతర ఫీచర్లు, ధర తెలుసుకోండి. 
Samsung Odyssey Ark
Samsung Odyssey Ark

Samsung Odyssey Ark

టెక్ దిగ్గజం శాంసంగ్, కేవలం స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కాకుండా మరెన్నో ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేస్తూ మార్కెట్లో టాప్ బ్రాండ్‌గా నిలుస్తుంది. ఇప్పుడు తమ బ్రాండ్ నుంచి గేమింగ్ ఉత్పత్తులను కూడా ప్రవేశపెడుతోంది. తాజాగా శాంసంగ్ బ్రాండ్ నుంచి ఒడిస్సీ ఆర్క్ ( Samsung Odyssey Ark) పేరుతో ఒక గేమింగ్ మానిటర్ భారత మార్కెట్లో విడుదలైంది. ఇది 55-అంగుళాలతో వంపు తిరిగిన మ్యాట్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 165Hz రిఫ్రెష్ రేటుతో 4K రిజల్యూషన్‌ను అందించగలదు.

ట్రెండింగ్ వార్తలు

Gold price today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

Trading Guide: ఎన్టీపీసీ, వీ గార్డ్ సహా ఈ 8 స్టాక్స్ పై ఈ రోజు దృష్టి పెట్టండి

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

ఉత్తమ స్క్రీన్ పొజిషనింగ్ కోసం ఈ మానిటర్ కాక్‌పిట్ HAS మోడ్‌తో వస్తుంది. ఇది స్క్రీన్‌ను నిలువుగా 270 డిగ్రీలు తిప్పడానికి వీలు కల్పిస్తుంది. ఇంకా స్టాండ్‌ని ఉపయోగించి స్క్రీన్‌ను పైవట్ చేయడం, వంచడం, ఎత్తు సర్దుబాటు చేసుకోవడం చేయవచ్చు.

Samsung Odyssey Ark కర్వ్డ్ గేమింగ్ మానిటర్ ఫీచర్లు

- శాంసంగ్ ఒడిస్సీ ఆర్క్ 55 అంగుళాల ఆర్క్ డయల్‌ను కలిగి ఉంది. ఇందులో సోలార్ శక్తితో నడిచే కంట్రోలర్ ఉంది. USB-C ద్వారా కూడా ఛార్జ్ చేయవచ్చు.

- ఈ కర్వ్డ్ గేమింగ్ మానిటర్ నాలుగు స్పీకర్‌లతో (ప్రతి మూలలో ఒకటి) వచ్చింది. ఈ స్పీకర్లు డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో 60W సౌండ్ అవుట్‌పుట్‌ను అందించగలవు, ఇంకా సెంట్రల్ వూఫర్‌లు ఉన్నాయి.

- 55-అంగుళాల స్క్రీన్‌, సైజ్ 1000R వక్రతతో వచ్చిన కర్వ్డ్ గేమింగ్ మానిటర్ ఇప్పటివరకు ఇదేనని Samsung పేర్కొంది. ఇందులోని 1000R వక్రతతో గేమర్లు అన్ని వైపులా దృష్టి సారించేందుకు సౌకర్యంగా ఉంటుంది.

- ఇందులో 14-బిట్ లైటింగ్ కంట్రోల్ టెక్నాలజీ ఉంది. దీంతో గేమర్లు చీకటి దృశ్యాలలోనూ వివరాలను స్పష్టంగా చూడగలరు.

- మ్యాట్-ఫినిష్డ్ డిస్‌ప్లే గేమర్‌కు గ్లేర్‌తో పాటు ప్రతిబింబాన్ని నిరోధిస్తుంది.

Samsung Odyssey Ark గేమింగ్ మానిటర్ ధర

కర్వ్డ్ గేమింగ్ మానిటర్ ధర, రూ. 219,999/-

దీనిని Samsung అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 31, 2022 మధ్య ఈ మానిటర్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లకు ఉచిత 1TB పోర్టబుల్ SSD, T7 షీల్డ్ USB 3.2తో పాటు రూ. 10,000 తగ్గింపును కూడా కంపెనీ అందిస్తోంది.

టాపిక్

తదుపరి వ్యాసం