తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nokia C32 India Launch: ఈనెలలోనే నోకియా సీ32 లాంచ్: ఇంత ధర ఉండనుందా!

Nokia C32 India launch: ఈనెలలోనే నోకియా సీ32 లాంచ్: ఇంత ధర ఉండనుందా!

21 May 2023, 19:18 IST

    • Nokia C32 India launch: నోకియా సీ32 ఫోన్ ఈనెలలో ఇండియాలో విడుదల కానుంది. లాంచ్ డేట్ కూడా లీకైంది. పూర్తి వివరాలు ఇవే.
Nokia C32 India launch: ఈనెలలోనే నోకియా సీ32 లాంచ్: ఇంత ధర ఉండనుందా! (Photo: Nokia)
Nokia C32 India launch: ఈనెలలోనే నోకియా సీ32 లాంచ్: ఇంత ధర ఉండనుందా! (Photo: Nokia)

Nokia C32 India launch: ఈనెలలోనే నోకియా సీ32 లాంచ్: ఇంత ధర ఉండనుందా! (Photo: Nokia)

Nokia C32 India launch: నోకియా నుంచి సీ సిరీస్‍లో మరో బడ్జెట్ 4జీ ఫోన్ భారత మార్కెట్‍లోకి వచ్చేందుకు రెడీ అయింది. అతిత్వరలోనే హెచ్‍ఎండీ గ్లోబల్ ఈ ఫోన్‍ను ఇండియాకు తీసుకురానుంది. ఇప్పటికే గ్లోబల్‍గా ఇప్పటికే కొన్ని దేశాల్లో లాంచ్ అయిన ఈ నోకియా సీ32 ఫోన్ ఇప్పుడు భారత్‍కు రానుంది. కాగా, ఇప్పటికే ఈ మొబైల్ స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. లాంచ్ డేట్ కూడా లీక్ అయింది. పూర్తి వివరాలు ఇవే.

ఇండియాలో నోకియా సీ32 లాంచ్ వివరాలు

Nokia C32 India launch: నోకియా సీ32 ఫోన్ ఈనెలలో ఇండియాలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ టీజర్లను నోకియా ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ భారత్‍లో ఈనెల 23వ తేదీన లాంచ్ అవుతుందని 91మొబైల్ హిందీ రిపోర్ట్ చేసింది. అయితే లాంచ్ డేట్ గురించి నోకియా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

Nokia C32 Price: నోకియా సీ32 ఫోన్ బడ్జెట్ రేంజ్‍లోనే ఉంటుంది. ఈ మొబైల్ ప్రారంభ ధర రూ.9,999గా ఉంటుందని లీకులు వస్తున్నాయి. గ్లోబల్‍గా బీచ్ పింక్, చార్కోల్, అటమ్ గ్రీన్ కలర్ ఆప్షన్‍లలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇండియాకు కూడా ఇదే కలర్లలో వస్తుందని తెలుస్తోంది.

Nokia C32 Specifications: గ్లోబల్ మార్కెట్‍లో ఇప్పటికే నోకియా సీ32 ఫోన్ లాంచ్ కావటంతో స్పెసిఫికేషన్ల గురించి తెలిసిపోయింది. 6.5 ఇంచుల హెచ్‍డీ రెజల్యూషన్ IPS LCD డిస్‍ప్లేను సీ32 మొబైల్ కలిగి ఉంటుంది. గ్లాస్ బ్యాక్, మెటాలిక్ ఫినిష్ ఉంటుంది.

యునిఎస్‍ఓసీ ఎస్‍సీ9863ఏ (Unisoc SC9863A) ప్రాసెసర్ ఈ Nokia C32 ఫోన్‍లో ఉంటుంది. వర్చువల్‍గా 3జీబీ వరకు అదనంగా ర్యామ్‍ను పొడిగించుకోవచ్చు. మైక్రోఎస్‍డీ కార్డు స్లాట్ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ మొబైల్ రానుంది.

నోకియా సీ32 మొబైల్ వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమరా ఉంటాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ఈ ఫోన్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రానుంది.

Nokia C32 ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. స్టాండర్డ్ 10వాట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. పవర్ బటన్‍కే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను నోకియా ఇవ్వనుంది. ఫేస్‍ అన్‍లాక్ ఫీచర్ కూడా ఉంటుంది.

కాగా, ఇండియాలో నోకియా సీ32 లాంచ్ డేట్, ధర వివరాలను నోకియా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

తదుపరి వ్యాసం