తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nikhil Meswani: అంబానీ కజిన్.. అంబానీని మించిన ఆదాయం

Nikhil Meswani: అంబానీ కజిన్.. అంబానీని మించిన ఆదాయం

HT Telugu Desk HT Telugu

25 April 2023, 18:19 IST

  • Nikhil Meswani: నిఖిల్ మేస్వానీ (Nikhil Meswani).. ముకేశ్ అంబానీకి వరుసకు కజిన్ అవుతారు. రిలయన్స్ ఇండస్ట్రీస్  అభివృద్ధిలో వీరి కుటుంబానిది కీలకపాత్ర. నిఖిల్ మేస్వానీ (Nikhil Meswani) వార్షిక ఆదాయం రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వార్షిక ఆదాయం కన్నా ఎక్కువ కావడం విశేషం.

రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ
రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ

రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ

Nikhil Meswani: నిఖిల్ మేస్వానీ (Nikhil Meswani) తండ్రి రసిక్ లాల్ మేస్వానీ (Rasiklal Meswani).. ముకేశ్ అంబానీ తండ్రి ధీరూభాయి అంబానీ (Dhirubhai Ambani) కి చాలా దగ్గరి బంధువు. రిలయన్స్ (Reliance) ప్రారంభం నుంచి ధీరూభాయితో కలిసి ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance industries) వ్యవస్థాపక డైరెక్టర్లలో రసిక్ లాల్ మేస్వానీ ఒకరు. నిఖిల్ మేస్వానీ సోదరుడు హితల్ మేస్వానీ (Hital Meswani) కూడా రిలయన్స్ గ్రూప్ లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

Nikhil Meswani: విజయవంతమైన ప్రాజెక్టుల వెనుక..

ప్రస్తుతం నిఖిల్ మేస్వానీ (Nikhil Meswani) రిలయన్స్ ఇండస్ట్రీస్ సొంత ఐపీఎల్ (IPL) టీమ్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, నిఖిల్ మేస్వానీ కేవలం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కార్యకలాపాలకే పరిమితం కాదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) చాలా ప్రాజెక్టులను విజయవంతం చేయడంలో నిఖిల్ మేస్వానీ (Nikhil Meswani) పాత్ర చాలా ఉంది. 1986 నుంచి ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ తో ఉన్నారు. జామ్ నగర్ రిఫైనరీని అత్యంత విజయవంతమైన ప్రాజెక్టుగా నిలపడంలో నిఖిల్ ది కీలక పాత్రం. టెలీకాం, రిటైల్ స్టోర్స్ రంగంలోకి రిలయన్స్ రావడానికి ప్రధాన కారణం నిఖిల్ మేస్వానీ (Nikhil Meswani) నే అని రిలయన్స్ వర్గాలు వెల్లడించాయి.

Nikhil Meswani: ఆదాయంలో ముకేశ్ ను మించి..

ఆదాయంలో కూడా నిఖిల్ మేస్వానీ (Nikhil Meswani) ది సింహభాగమే. 2021 22 ఆర్థిక సంవత్సరంలో నిఖిల్ మేస్వానీ రూ. 24 కోట్ల వార్షిక వేతనం తీసుకున్నారు. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వార్షిక వేతనం కన్నా ఎక్కువ. ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వార్షిక వేతనం రూ. 15 కోట్లు. ఆయన గత 10 సంవత్సరాలుగా రూ. 10 కోట్ల వార్షిక వేతనాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. రూ. 10 కోట్ల వార్షిక వేతనాన్ని ఆయన తన గరిష్ట పరిమితిగా నిర్ణయించుకున్నారు. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో గత రెండేళ్లుగా ఆయన ఆ మొత్తాన్ని కూడా తీసుకోవడం లేదు.

తదుపరి వ్యాసం