Reliance Jio Q4 results: రిలయన్స్ జియో Q4 ఫలితాల వెల్లడి-reliance jio posts single digit growth qoq in q4 earnings pat at 4 716 crore rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Reliance Jio Q4 Results: రిలయన్స్ జియో Q4 ఫలితాల వెల్లడి

Reliance Jio Q4 results: రిలయన్స్ జియో Q4 ఫలితాల వెల్లడి

HT Telugu Desk HT Telugu
Apr 21, 2023 09:22 PM IST

Reliance Jio Q4 results: 2022- 23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (FY23Q4) ఫలితాలను రిలయన్స్ జియో (Reliance Jio) ప్రకటించింది. ఈ Q4 లో రిలయన్స్ జియో (Reliance Jio) రూ. 4,716 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Reliance Jio Q4 results: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కు చెందిన టెలీకాం విభాగం రిలయన్స్ జియో FY23Q4 లో రూ. 4,716 కోట్ల నికర లాభాలను (net profits) సాధించింది. ఇది FY23Q3 తో పోలిస్తే 1.7% మాత్రమే అధికం. FY23Q3 లో రిలయన్స్ జియో (Reliance Jio) రూ. 4,638 కోట్ల నికర లాభాలను సాధించింది. అలాగే, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం Q4 (Q4FY22) తో పోలిస్తే 13.01% అధికం. అలాగే, Q4FY22 లో రిలయన్స్ జియో (Reliance Jio) నికర లాభాలు రూ. 4,173 కోట్లు.

Reliance Jio Q4 results: ఆదాయంలో మెరుగైన ఫలితాలు

Q4FY23 లో రిలయన్స్ జియో (Reliance Jio) ఆపరేషన్స్ రెవెన్యూ రూ. 23,394 కోట్లు. కాగా, Q3FY23 లో అది రూ. 22,998 కోట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం Q4 (Q4FY22) లో సంస్థ ఆపరేషన్స్ రెవెన్యూ రూ. 20,901 కోట్లు. అంటే Q4FY22 కన్నా Q4FY23 లో రిలయన్స్ జియో (Reliance Jio) ఆదాయం 11.9% పెరిగింది. వాల్యూ సర్వీసెస్ విభాగంలో జియో ఆదాయం Q4FY23 లో రూ. 27,539 కోట్లు కాగా, Q4FY22లో అది 24,602 కోట్లు, Q3FY23లో రూ. 27,055 కోట్లు. 2022 మార్చి నాటికి రిలయన్స్ జియో (Reliance Jio) నికర విలువ రూ. 2,15,997 కోట్లకు చేరింది. మొత్తం 2022 -23 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ జియో నికర లాభాలు రూ. 18,207 కోట్లు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం సాధించిన రూ. 14,817 కోట్ల కన్నా 22.9% అధికం.

WhatsApp channel