తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Netweb Technologies Ipo: ఈ ఐపీఓతో ఇన్వెస్టర్లకు దాదాపు 100 శాతం లాభం.. ‘నెట్ వెబ్’ ఐపీఓ అలాటీలకు జాక్ పాట్

Netweb Technologies IPO: ఈ ఐపీఓతో ఇన్వెస్టర్లకు దాదాపు 100 శాతం లాభం.. ‘నెట్ వెబ్’ ఐపీఓ అలాటీలకు జాక్ పాట్

HT Telugu Desk HT Telugu

27 July 2023, 10:49 IST

  • Netweb Technologies IPO: ఇటీవల ఐపీఓ ప్రకటించిన నెట్ వెబ్ టెక్నాలజీస్ భారీ ప్రీమియంతో మార్కెట్లో అడుగుపెట్టింది. ఐపీఓలో ఈ సంస్థ షేర్లు అలాట్ అయిన వారికి లాభాల పంట పండించింది. నెట్ వెబ్ టెక్నాలజీస్ షేర్లు ఎన్ఎస్ఈ లో 89.4% ప్రీమియంతో, బీఎస్ఈలో 88.5% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (iStock)

ప్రతీకాత్మక చిత్రం

Netweb Technologies IPO: Netweb Technologies IPO: ఇటీవల ఐపీఓ ప్రకటించిన నెట్ వెబ్ టెక్నాలజీస్ భారీ ప్రీమియంతో మార్కెట్లో అడుగుపెట్టింది. ఐపీఓలో ఈ సంస్థ షేర్లు అలాట్ అయిన వారికి లాభాల పంట పండించింది. నెట్ వెబ్ టెక్నాలజీస్ షేర్లు ఎన్ఎస్ఈ లో 89.4% ప్రీమియంతో, బీఎస్ఈలో 88.5% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి 90.36 రెట్ల భారీ సబ్ స్క్రిప్షన్ లభించింది.

ట్రెండింగ్ వార్తలు

Upcoming compact SUVs in India : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న ఎస్​యూవీలు ఇవే..!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త వేరియంట్లు.. త్వరలోనే లాంచ్​!

Tata Nexon SUV : టాటా నెక్సాన్​లో కొత్త ఎంట్రీ లెవల్​ వేరియంట్లు.. భారీగా దిగొచ్చిన ఎస్​యూవీ ధర!

Gold price today : స్థిరంగా పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా..

ఇన్వెస్టర్లకు దాదాపు 100% లాభాలు

భారీ అంచనాలతో మార్కెట్లోకి వచ్చిన నెట్ వెబ్ టెక్నాలజీస్ ఐపీఓ.. అదే స్థాయిలో ఇన్వెస్టర్లకు లిస్టింగ్ గెయిన్స్ ను అందించింది. ఈ ఐపీఓ ఫిక్స్డ్ ప్రైస్ బ్యాండ్ రూ. 475 - రూ. 500. బుధవారం ఈ సంస్థ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఎన్ఎస్ఈలో ఈ సంస్థ షేర్లు 89.4% ప్రీమియంతో రూ. 947 వద్ద లిస్ట్ అయ్యాయి. అలాగే, బీఎస్ఈలో 88.5% ప్రీమియంతో రూ. 942.50 వద్ద లిస్ట్ అయ్యాయి. అంటే, లిస్టింగ్ గెయిన్స్ కోసం తమకు అలాట్ అయిన షేర్లను బుధవారం అమ్మేసిన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై,కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఇన్వెస్టర్ కు సుమారు రూ. 450 ల లాభం వచ్చింది.

90.36 రెట్లు సబ్ స్క్రిప్షన్

జులై 17న ఈ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ ఓపెన్ అయింది. జులై 19న ముగిసింది. ఈ ఐపీఓలో క్యూఐఐలకు 50%, హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ కు 15%, రిటైల్ ఇన్వెస్టర్లకు 35% షేర్లను కేటాయించారు. మొత్తంగా, ఈ నెట్ వెబ్ టెక్నాలజీస్ ఐపీఓకు 90.36 రెట్ల సబ్ స్క్రిప్షన్ లభించింది. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్లు 19.15 రెట్లు, ఎన్ఐఐలు 81.81 రెట్లు, క్యూఐబీలు 228.91 రెట్లు సబ్ స్క్రైబ్ చేశారు. జులై 14న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ రూ. 189.01 కోట్ల నిధులను సమీకరించింది. ఐపీఓ ద్వారా రూ. 631 కోట్లను సమీకరించాలని నెట్ వెబ్ టెక్నాలజీస్ లక్ష్యంగా పెట్టుకుంది.

తదుపరి వ్యాసం