తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lenovo Yoga 9i 2 In 1 Laptop: ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో లెనోవో నుంచి కొత్త 2 ఇన్ 1 ల్యాప్‍టాప్ లాంచ్

Lenovo Yoga 9i 2 in 1 Laptop: ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో లెనోవో నుంచి కొత్త 2 ఇన్ 1 ల్యాప్‍టాప్ లాంచ్

17 January 2023, 13:38 IST

    • Lenovo Yoga 9i Gen 8: లెనోవో తాజాగా మరో 2 ఇన్ 1 ల్యాప్‍టాప్ (2 in 1 Laptop)ను విడుదల చేసింది. లెనోవో యోగా 9ఐ జెన్ 8ను తీసుకొచ్చింది.
Lenovo Yoga 9i 2 in 1 Laptop: ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో లెనోవో నుంచి కొత్త 2 ఇన్ 1 ల్యాప్‍టాప్ లాంచ్ (Photo: Lenovo)
Lenovo Yoga 9i 2 in 1 Laptop: ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో లెనోవో నుంచి కొత్త 2 ఇన్ 1 ల్యాప్‍టాప్ లాంచ్ (Photo: Lenovo)

Lenovo Yoga 9i 2 in 1 Laptop: ప్రీమియమ్ స్పెసిఫికేషన్లతో లెనోవో నుంచి కొత్త 2 ఇన్ 1 ల్యాప్‍టాప్ లాంచ్ (Photo: Lenovo)

Lenovo Yoga 9i Gen 8 Laptop: లెనోవో యోగా 9ఐ సిరీస్‍లో మరో కన్వర్టబుల్ ల్యాప్‍టాప్ విడుదలైంది. లెనోవో యోగా 9ఐ జెన్ 8 (Lenovo Yoga 9i Gen 8) భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. ఇది 2 ఇన్ 1 ల్యాప్‍టాప్‍(2 in 1 Laptop)గా ఉంది. కీబోర్డు నుంచి వేరు చేసి దీని 14 ఇంచుల 4K OLED డిస్‍ప్లేను ట్యాబ్‍గా వాడుకోవచ్చు. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌ను ఈ ల్యాప్‍టాప్ కలిగి ఉంది. లెనోవో 9ఐ జెన్ 8 ల్యాప్‍టాప్ వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Vivo Y200 Pro : ఇండియాలో వివో వై200 ప్రో లాంచ్​- ఫీచర్స్​, ధర వివరాలివే!

MG Astor : ఇండియాలోకి ఎంజీ మోటార్​ కొత్త ఎస్​యూవీ.. ఇదే ఆస్టర్​ ఫేస్​లిఫ్ట్​?

Naga Chaitanya Porsche : రూ. 3.5 కోట్లు పెట్టి పోర్షే కొన్న నాగ చైతన్య.. హైదరాబాద్​లో ఇదే ఫస్ట్​!

Stocks to buy today : భారీగా పతనమైన టాటా మోటార్స్​ షేర్లు ఇప్పుడు కొంటే.. భారీ ప్రాఫిట్స్​!

లెనోవో యోగా 9ఐ జెన్ 8 స్పెసిఫికేషన్లు

Lenovo Yoga 9i Gen 8 Specifications: 4K రెజల్యూషన్ ఉండే 14 ఇంచుల OLED ప్యూర్ సైట్ టచ్‍స్క్రీన్ డిస్‍ప్లేను లెనోవో యోగా 9ఐ జెన్ 8 కన్వర్టబుల్ ల్యాప్‍టాప్ కలిగి ఉంది. ఈ ల్యాప్‍టాప్ నుంచి డిస్‍ప్లేను డిటాచ్ చేసి ట్యాబ్‍లా వాడుకోవచ్చు. ఈ డిస్‍ప్లే డాల్బీ విజన్‍కు సపోర్ట్ చేస్తుంది. లెనోవో ప్రెసిషన్ పెన్ కూడా ఈ ల్యాప్‍టాప్‍నే వస్తుంది. విండోస్ 11 (Windows 11 OS) ఆపరేటింగ్ సిస్టమ్‍పై ఈ 2 ఇన్ 1 ల్యాప్‍టాప్ రన్ అవుతుంది. లేటెస్ట్ 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 (13th Gen Intel Core i7) ప్రాసెసర్ ఈ ల్యాప్‍టాప్‍లో ఉంటుంది.

16జీబీ LPDDR5 వరకు ర్యామ్, 1టీబీ వరకు SSD స్టోరేజ్‍తో లెనోవో యోగా 9ఐ జెన్ 8 ల్యాప్‍టాప్ వస్తోంది. వైఫై 6ఈ, బ్లూటూత్ వెర్షన్ 5.2 కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. ఈ ల్యాప్‍టాప్‍లో 75Wh బ్యాటరీ ఉంటుంది. ఫుల్ చార్జ్‌పై ఈ ల్యాప్‍టాప్ 14 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ర్యాపిడ్ బూస్ట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

Lenovo Yoga 9i Gen 8 Laptop: స్మార్ట్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉండే 2 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్‍డీ, ఇన్‍ఫ్రారెడ్ వెబ్‍క్యామ్‍ను Lenovo Yoga 9i Gen 8 ల్యాప్‍టాప్ కలిగి ఉంది. రెండు యూఎస్‍బీ టైప్-సీ థండర్ బోల్ట్ 4.0 పోర్టులు, రెండు యూఎస్‍బీ టైప్-సీ 3.2 జెన్ పోర్టులు, ఓ యూఎస్‍బీ టైప్-ఏ పోర్టు, 3.5mm హెడ్‍ఫోన్ జాక్ ఈ ల్యాప్‍టాప్‍కు ఉంటాయి. మొత్తంగా ఈ 2 ఇన్ 1 ల్యాప్‍టాప్ బరువు 1.4 కేజీలుగా ఉంటుంది.

లెనోవో యోగా 9ఐ జెన్ 8 ధర

Lenovo Yoga 9i Gen 8 Price: లెనోవో యోగా 9ఐ జెన్ 8 ల్యాప్‍టాప్ ప్రారంభ ధర రూ.1,74,990గా ఉంది. ప్రస్తుతం లెనోవో వెబ్‍సైట్‍లో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ఈనెల 29వ తేదీన అమెజాన్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, లెనోవో ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‍ల్లో సేల్‍కు వస్తుంది. స్ట్రామ్ గ్రే, ఓట్‍మీల్ కలర్ ఆప్షన్‍లలో Lenovo Yoga 9i Gen 8.. 2 ఇన్ 1 ల్యాప్‍టాప్ లభిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం