తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Cars Launch In 2024 : కియా క్రేజీ లైనప్​.. ఇక ఇండియా మార్కెట్​పై దండయాత్రే!

Kia cars launch in 2024 : కియా క్రేజీ లైనప్​.. ఇక ఇండియా మార్కెట్​పై దండయాత్రే!

Sharath Chitturi HT Telugu

24 December 2023, 15:06 IST

    • Kia cars launch in 2024 : భారతీయుల కోసం క్రేజీ లైనప్​ని సిద్ధం చేస్తోంది కియా మోటార్స్​. 2024లో లాంచ్​ అవుతున్న కియా కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
2024 కోసం కియా క్రేజీ లైనప్​..!
2024 కోసం కియా క్రేజీ లైనప్​..! (Kia India)

2024 కోసం కియా క్రేజీ లైనప్​..!

Kia cars launch in 2024 : 2023లో ఇండియా ఆటోమొబైల్​ సెక్టార్​ దూసుకెళ్లింది. అనేక సంస్థలు.. కొత్త కొత్త లాంచ్​లతో కస్టమర్లను ఆకర్షించాయి. ఇక 2024లోనూ ఇదే కొనసాగించేందుకు ప్లాన్స్​ వేస్తున్నాయి. దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ కియా మోటార్స్​ కూడా ఇదే పనిలో ఉంది. 2024 కోసం క్రేజీ లైనప్​ని సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదిలో లాంచ్​ అవుతున్న కియా కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​..

మచ్​ అవైటెడ్​ కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ని ఇటీవలే రివీల్​ చేసింది సంస్థ. బుకింగ్స్​ ఈనెల 26న ప్రారంభమవుతునట్టు తెలుస్తోంది. కాగా.. జనవరిలో ఈ ఎస్​యూవీ లాంచ్​ కానుంది. కొత్త వర్షెన్​లో డిజైన్​ పరంగా మార్పులు కనిపిస్తున్నాయి. కేబిన్​లో వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, మూడ లైటింగ్​, 6 ఎయిర్​బ్యాగ్స్​, బోస్​ సౌండ్​ సిస్టెమ్​, లెవల్​ 1 అడాస్​ సెటప్​ వంటివి ఉంటాయి.

Kia Sonet facelift launch date : ఈ కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​.. జనవరిలో లాంచ్​ అవుతుంది దీని ఎక్స్​షోరూం ధర రూ. 8లక్షలు- రూ. 15లక్షల మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది.

కియా ఈవీ9...

భారతీయులకు.. ఇటీవలే స్వీట్​ సప్రైజ్​ ఇచ్చింది కియా మోటర్స్​. అంతర్జాతీయ మార్కెట్​లో బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్న కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ఇండియాలోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్​- మే నెలల్లో ఈ మోడల్​ ఇండియాలో లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Kia EV9 price in India : ఇండియా కియా మోటార్స్​కు ప్రస్తుతం ఒకటే ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఉంది. అది.. కియా ఈవీ6. ఇక త్వరలోనే లాంచ్​ అవుతున్న కియా ఈవీ9 రేంజ్​ 560కి.మీలు! ఇందులో భారీ 99.8 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది.

కియా కార్నివాల్​ ఎంపీవీ..

ఫోర్త్​ జనరేషన్​ కియా కార్నివాల్​ని కూడా ఇండియాలో లాంచ్​ చేస్తున్నట్టు సంస్థ ఇటీవలే ప్రకటించింది. 2024 రెండో భాగంలో ఇది ఇండియాలో అడుగుపెడుతుంది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 26లక్షలు- రూ. 35లక్షల మధ్యలో ఉంటుంది.

ఇందులో 2.2 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. డ్యూయెల్​ 12.3 ఇంచ్​ కర్వ్​డ్​ స్క్రీన్​ వస్తోంది. అనేక సేఫ్టీ ఫీచర్స్​ ఈ కియా కార్నివాల్​ ఎంపీవీ సొంతం.

కియా క్లావిస్​ కూడా..!

Kia new car launch in India : కియా మోటార్స్​ నుంచి సరికత్త సబ్​-4ఎం ఎస్​యూవీ ఇండియాలో లాంచ్​కానుంది. దీని పేరుపై క్లారిటీ లేదు కానీ.. సంస్థ దీనిని కియా క్లావిస్​ అని పిలుస్తోందట! ఇది.. 2024 చివర్లో లాంచ్​ అవుతుందని సమాచారం. కియా సోనెట్​- కియా సెల్టోస్​ మధ్యలో ఈ కియా క్లావిస్​ ఉంటుందట. అంతేకాకుండా.. ఐసీఈ ఇంజిన్​తో పాటు ఎలక్ట్రిక్​ వర్షెన్​లో కూడా ఈ వెహికిల్​ అందుబాటులో ఉండనుందని సమాచారం. అయితే. ఈ మోడల్​పై ప్రస్తుతం పెద్దగా వివరాలు అందుబాటులో లేవు. 2024లో ఓ క్లారిటీ రావొచ్చు.

తదుపరి వ్యాసం