తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Irm Energy Ipo: 75 రూపాయల జీఎంపీతో ట్రేడ్ అవుతున్న ఐఆర్ఎం ఎనర్జీ ఐపీఓ.. సబ్ స్క్రైబ్ చేశారా?

IRM Energy IPO: 75 రూపాయల జీఎంపీతో ట్రేడ్ అవుతున్న ఐఆర్ఎం ఎనర్జీ ఐపీఓ.. సబ్ స్క్రైబ్ చేశారా?

HT Telugu Desk HT Telugu

19 October 2023, 12:53 IST

    • IRM Energy IPO: ఐఆర్ఎం ఎనర్జీ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ ఐపీఓ అక్టోబర్ 18న ఓపెన్ అయింది. అక్టోబర్ 20 వరకు బిడ్డింగ్ చేసుకోవచ్చు. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IRM Energy IPO: ఐఆర్ఎం ఎనర్జీ () ఐపీఓకు అక్టోబర్ 19, మధ్యాహ్నం సమయానికి 2.52 రెట్లు సబ్ స్క్రిప్షన్ లభించింది. రిటైల్ కేటగిరీలో 2.76 రెట్లు, 1.08 రెట్లు క్యూఐబీ కేటగిరీలో, 4.15 రెట్లు ఎన్ఐఐ కేటగిరీలో ఈ ఐ పీఓ సబ్ స్క్రైబ్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Upcoming compact SUVs in India : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న ఎస్​యూవీలు ఇవే..!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త వేరియంట్లు.. త్వరలోనే లాంచ్​!

Tata Nexon SUV : టాటా నెక్సాన్​లో కొత్త ఎంట్రీ లెవల్​ వేరియంట్లు.. భారీగా దిగొచ్చిన ఎస్​యూవీ ధర!

Gold price today : స్థిరంగా పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా..

కంపెనీ వివరాలు..

ఐఆర్ఎం ఎనర్జీ ఐపీఓ (IRM Energy IPO: 75 రూపాయల జీఎంపీతో ట్రేడ్ అవుతున్న ఐఆర్ఎం ఎనర్జీ ఐపీఓ.. సబ్ స్క్) కు బిడ్డింగ్ అక్టోబర్ 18 న ప్రారంభమై, అక్టోబర్ 20 న ముగుస్తుంది. ఐఆర్ఎం ఎనర్జీ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, ఆటోమేటివ్ రంగాలకు సహజవాయు డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ లను నిర్వహిస్తుంటుంది. ఈ సంస్థకు ప్రముఖ ఫార్మా సంస్థ క్యాడిలా ఫార్మాస్యూటికల్స్, డాక్టర్ రాజీవ్ ఇంద్రవదన్ మోదీ, ఐఆర్ఎం ట్రస్ట్ లు ప్రమోటర్స్ గా వ్యవహరిస్తున్నాయి. ఈ ఐపీఓ ద్వారా రూ. 10 ముఖ విలువ కలిగిన 1.08 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించి మొత్తం రూ. 545.40 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

రూ. 14,645

ఐఆర్ఎం ఎనర్జీ ఐపీఓ కు లాట్స్ లో బిడ్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో లాట్ లో 29 ఈక్విటీ షేర్స్ ఉంటాయి. ఇన్వెస్టర్స్ 1 నుంచి 13 లాట్స్ వరకు సబ్ స్క్రైబ్ చేయవచ్చు. ఒక లాట్ కు కనీస ఇన్వెస్ట్ మెంట్ మొత్తం రూ. 14,645. గరిష్టంగా 13 లాట్లకు రూ. 1,90,385 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందది. ఈ ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 480 నుంచి రూ. 505 మధ్య నిర్ణయించారు. అక్టోబర్ 17న యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ ఇప్పటికే రూ. 160.35 కోట్లను సమీకరించింది. ఈ ఐపీఓ కు సంబంధించి షేర్ల అలాట్ మెంట్ అక్టోబర్ 27న జరుగుతుంది. షేర్ల అలాట్ అయిన వారి డీమ్యాట్ ఖాతాల్లోకి అక్టోబర్ 30న ఈ షేర్స్ జమ అవుతాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ల్లో ఈ షేర్ల అక్టోబర్ 31న లిస్ట్ అవుతాయి.

జీఎంపీ..

ఐఆర్ఎం ఎనర్జీ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ షేర్లు గ్రే మార్కెట్లో రూ. 70 - రూ. 75 మధ్య ప్రీమియం (GMP)తో ట్రేడ్ అవుతున్నాయి. అంటే, ఇష్యూ ధర కన్నా ఒక్కో షేరుపై రూ. 75 వరకు లిస్టింగ్ గెయిన్స్ పొందవచ్చు.

సూచన: ఇవి మార్కెట్ నిపుణుల అంచనాలు, అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.

తదుపరి వ్యాసం